News May 8, 2024

APPLY NOW: రైల్వేలో SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు

image

RPFలో 4,660 పోలీస్ ఉద్యోగాల(SI-452, కానిస్టేబుల్-4,208)కు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు. SI అభ్యర్థులకు డిగ్రీ, 20-28 ఏళ్ల వయసు, కానిస్టేబుల్ అభ్యర్థులు 18-28 ఏళ్ల వయసు, టెన్త్ పాసై ఉండాలి. ఆన్‌లైన్‌ టెస్టు, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. SIలకు ₹35,400, కానిస్టేబుళ్లకు ₹21,700 ప్రారంభ వేతనం ఉంటుంది. వెబ్‌సైట్: <>rrbapply.gov.in<<>>

News May 8, 2024

FREEగా టీ20 వరల్డ్ కప్ చూడొచ్చు

image

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా ప్రసారం చేయనుంది. ఇండియాలోని యూజర్లు మొబైల్‌ వెర్షన్‌లో దీన్ని ఉచితంగా ఆస్వాదించవచ్చు. గత వన్డే వరల్డ్ కప్‌తో పాటు ఆసియా కప్‌ను సైతం ఉచితంగా ప్రసారం చేయగా.. రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

News May 8, 2024

కాంగ్రెస్ గెలిస్తే.. దేశం ఉగ్రవాదుల చేతుల్లోకే: అర్వింద్

image

TG: నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం మొత్తం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళుతుందని ఆరోపించారు. టెర్రరిస్టు సంస్థలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాయని ఆయన అన్నారు. జగిత్యాల PFIకి, బోధన్ నకిలీ పాస్‌పోర్టులకు అడ్డాగా మారాయని ఆయన విమర్శించారు. ఆ రెండు సంస్థలు కాంగ్రెస్‌కు ఫండింగ్ చేస్తున్నాయని అర్వింద్ ఆరోపించారు.

News May 8, 2024

జూన్ 5న 25మంది BRS MLAలు కాంగ్రెస్‌లోకి: కోమటిరెడ్డి

image

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న 25మంది BRS MLAలు కాంగ్రెస్‌లో చేరతారన్నారు. ఆరుగురు ఆ పార్టీ MP అభ్యర్థులూ తనను సంప్రదించారని తెలిపారు. త్వరలో BRS దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో 154 సీట్లు అవుతాయని, అందులో 125 కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. మరో పదేళ్లు రేవంతే CMగా ఉంటారన్నారు. కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు.

News May 8, 2024

పార్లమెంట్ ఇంద్రసేనుడు

image

కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి, బెంగాల్ CPI నేత ఇంద్రజిత్ గుప్తా పార్లమెంట్ సభ్యునిగా పలు రికార్డులు నెలకొల్పారు. అత్యధిక సార్లు లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు. 1977-80 మధ్య కాలం మినహా 1960 నుంచి 2001 FEB 20న తుది శ్వాస విడిచే వరకు MPగానే ఉన్నారు. అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఆయనే. విషయజ్ఞానం, వాక్పటిమ కలిగిన ఇంద్రజిత్ మాట్లాడుతుంటే ప్రధానులంతా సావధానులై వినేవారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News May 8, 2024

SRH.. ఫస్టాఫ్ హిట్టు, సెకండాఫ్ ఫట్టు!

image

IPL-2024 సీజన్ ఫస్టాఫ్‌లో భారీ స్కోర్లు, వరుస విజయాలతో SRH హోరెత్తించింది. మంచి రన్‌రేట్‌తో ప్లేఆఫ్స్‌కు సునాయాసంగా చేరేలా కనిపించింది. కానీ ఆ తర్వాతి మ్యాచుల్లో ఆ జట్టు ఆట పూర్తిగా గాడితప్పింది. చివరి 4 మ్యాచుల్లో మూడింట్లో ఓడిపోయింది. దీంతో రన్‌రేట్ కూడా మైనస్‌లోకి పడిపోయింది. ఇవాళ LSGతో మ్యాచులో గెలిచి టాప్-4లో బెర్త్ పదిలం చేసుకోవాలని SRH అభిమానులు కోరుకుంటున్నారు.

News May 8, 2024

రాజకీయ పార్టీ ఎలా నమోదు చేయాలి..?(1/2)

image

రాజకీయ పార్టీ పెట్టదలచుకునేవారు తమ దరఖాస్తును ఢిల్లీలోని ఈసీ కార్యాలయానికి సంబంధిత ఫార్మాట్‌లో సమర్పించాలి. పార్టీ అధికారిక లెటర్ హెడ్‌పై దరఖాస్తును టైప్ చేయాలి. ఏర్పాటైన నెల రోజుల్లో ఈసీకి పోస్టు ద్వారా లేదా సరాసరి దరఖాస్తును పంపించాలి. ఈసీ అండర్ సెక్రటరీ పేరిట రూ.10వేలకు డీడీ, సెక్షన్ 29ఏలోని సబ్-సెక్షన్‌(5)లో ఉన్న నిబంధనల్ని, రాజ్యాంగానికి తమ నిబద్ధతను పేర్కొంటూ టైప్ చేసిన ప్రతిని జత చేయాలి.

News May 8, 2024

రాజకీయ పార్టీ ఎలా నమోదు చేయాలి..?(2/2)

image

పార్టీ అధ్యక్షుడు సంతకం చేసిన పార్టీ రాజ్యాంగం ప్రతి, 100మంది పార్టీ సభ్యులకు సంబంధించిన తాజా ఎలక్టోరల్ రోల్స్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి ప్రమాణ స్వీకారం చేసినట్లు సంతకం చేసిన అఫిడవిట్, తాము వేరే పార్టీ సభ్యులం కాదని పేర్కొంటూ ప్రమాణం, సంతకాలు చేసిన 100మంది పార్టీ సభ్యుల అఫిడవిట్లు, పార్టీ బ్యాంకు ఖాతాలను కూడా దరఖాస్తుతో జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

News May 8, 2024

మీ మిషన్‌కు మద్దతుగా నిలుస్తాం పవన్: నరేశ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు కొనసాగుతోంది. తాజాగా సీనియర్ నటుడు నరేశ్ ట్విటర్ వేదికగా జనసేనకు మద్దతు ప్రకటించారు. ‘ఏపీ అభివృద్ధి కోసం ఏర్పాటైన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను స్థిరమైన మద్దతుదారునిగా కొనసాగుతున్నా. మీ ప్రయాణం ఓ ఆశాద్వీపం. మీ మిషన్‌కు మద్దతుగా నిలుస్తాం. మీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. ఆల్ ది బెస్ట్’ అని పేర్కొన్నారు.

News May 8, 2024

BREAKING: ప్రధాని మోదీ ఆగ్రహం

image

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. ‘ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేస్తామంటే కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందో నాకు ఇప్పుడు అర్థమైంది. అమెరికాలో యువరాజు(రాహుల్) అంకుల్(శామ్ పిట్రోడా) ఉంటారు. ఆయన చర్మం రంగు నల్లగా ఉండేవారు ఆఫ్రికా వారని అన్నారు. ఇది నాకు చాలా కోపం తెప్పిస్తోంది. చర్మ రంగును బట్టి ప్రజలను వర్గీకరిస్తారా? ఇది మోదీ ఉండగా జరగదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.