India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఒడిశాలో అధికారంలోకి వస్తామని బీజేపీతో పాటు ప్రధాని మోదీ పగటి కలలు కంటున్నారని సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. రాష్ట్రంలో బిజూ జనతా దళ్ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు నవీన్ పట్నాయక్ జూన్ 9న ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 01:30 గంటల మధ్య ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన సన్నిహితుడు వీకే పాండియన్ జోస్యం చెప్పారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,712 SSC CHSL(10+2) ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే మే 10, 11 తేదీల్లో ఎడిట్ చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్/జూ.సెక్రటేరియట్ అసిస్టెంట్, DEO, పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 18-27 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులు(రిజర్వేషన్‌ను బట్టి సడలింపు). పూర్తి వివరాల కోసం <

పునీత్ కుమార్ అనే సైబర్ కేటుగాడి బ్యాంక్ లాకర్ నుంచి ఈడీ పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకుంది. హరియాణా ఫరీదాబాద్‌లోని బల్లాభగఢ్ బ్రాంచ్ లాకర్ నుంచి ఈనెల 3న 19.5 కిలోల బంగారాన్ని సీజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. గతనెల 3వ తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ పునీత్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్‌శర్మను తొలగించడంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశకు గురయ్యారు. అతడి ప్రదర్శన కూడా చెప్పుకోదగ్గ రీతిలో లేదు. అయితే.. ఓ జాతీయ మీడియా రోహిత్ జట్టును వీడితే ఏ జట్టుకు ఆడాలని మీరు కోరుకుంటున్నారని ఓ సర్వే చేపట్టింది. అయితే.. అందులో RCBలో కోహ్లీతో కలిసి ఆడాలని 45% ఓట్లు పడ్డాయి. CSKలో చేరాలని 39% మంది.. లేదు ముంబైతోనే ఉండాలని 16% మంది కోరారు.

AP: పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వం నిర్మించడం లేదని ప్రధాని మోదీ చేసిన <<13193826>>వ్యాఖ్యలపై <<>>రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. ‘మోదీ వ్యాఖ్యలు బాధాకరం. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల కంటే అదనంగా తమ ప్రభుత్వం ఖర్చు చేసింది. సరైన సమయంలో నిధులు ఇస్తే పోలవరం పూర్తి చేసేవాళ్లం. పదేళ్లలో ఏపీకి కేంద్రం ఏం చేసిందో బీజేపీ వాళ్లు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

AP: ఎండలతో అల్లాడుతోన్న ప్రజలకు ఊరట కలగనుంది. ద్రోణి ప్రభావంతో రేపు ఏలూరు, NTR, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే నాలుగు రోజుల వాతావరణ విశేషాల కోసం ఇక్కడ <

రేప్ బాధితులను అబార్షన్‌కు అనుమతించకపోవడమంటే వారు గౌరవంగా బతికే హక్కులను అడ్డుకోవడమేనని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. బాధితులు మాతృత్వం పొందాల్సిందేనని చెప్పలేమని జస్టిస్ కౌసర్ ఎడప్పగాత్ అన్నారు. 16ఏళ్ల ఓ అత్యాచార బాధితురాలికి 24వారాల తర్వాత అబార్షన్ చేయించుకునేందుకు కోర్టు తాజాగా అనుమతిచ్చింది. కాగా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం అబార్షన్‌కు గరిష్ఠ పరిమితి 24వారాలుగా ఉంది.

బిహార్‌ను ఎన్ని సమస్యలు వెంటాడుతున్నా మోదీకే మరోసారి ఓటేస్తామని ఓబీసీ/అగ్రవర్ణాల ఓటర్లు, మోదీ మద్దతుదారులు చెబుతున్నారట. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై కొందరు పెదవి విరుస్తున్నా అధికశాతం మంది మోదీకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ప్రత్యామ్నాయం లేదని, ఈ పరిస్థితికి వ్యాపారవేత్తలే కారణమని చెబుతున్నారు. కొందరు మాత్రం మార్పు కోరుకుంటున్నారట. <<-se>>#Elections2024<<>>

AP: అల్లూరి జిల్లాలో దేవర షూటింగ్ యూనిట్‌పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 18 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మోదకొండమ్మ పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైట్ సీన్ చిత్రీకరణ కోసం డ్రోన్ ఎగరవేయగా.. ఆ శబ్దానికి తేనెటీగలు ఎగిరాయని తెలుస్తోంది.

TG: రైతు బంధు(భరోసా) కింద రూ.2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 5 ఎకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో వాటిని జమ చేసింది. కాగా ఈనెల 9లోగా రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. వీటితో పాటు పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.10వేల నిధులను కూడా ఈసీ అనుమతితో ప్రభుత్వం విడుదల చేసింది.
Sorry, no posts matched your criteria.