India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్, 6 గంటలకు సరూర్ నగర్‌లో జరిగే జనజాతర సభలో ఆయన పాల్గొననున్నారు. అలాగే రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నకిరేకల్ జనజాతర సభకు హాజరవుతారు. 11న కామారెడ్డి, తాండూరులో జరిగే జనజాతర సభలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు.

దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తుల <

లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపుతో ముంబై ఇండియన్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచింది. ప్రస్తుతం టాప్ 6లో ఉన్న జట్లే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబైకి ఏమాత్రం ఛాన్స్ లేదు. కాగా హార్దిక్ నేతృత్వంలో ముంబై ఈ సీజన్‌లో ఘోర ప్రదర్శన చేసింది.

భారీ తారాగణంతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండీ’. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది వీక్షించిన ఇండియన్ వెబ్ సిరీస్‌గా నిలిచింది. 43 దేశాల్లో టాప్-10లో ట్రెండింగ్‌లో ఉంది. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ ముఖ్య పాత్రల్లో నటించిన ‘హీరామండీ’ మే 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఆ జట్టు 146* సిక్సర్లు నమోదు చేసింది. 12 మ్యాచ్‌లలోనే SRH ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 145 (2018) రికార్డును బద్దలుకొట్టింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 143 (2019), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 142 (2016), ముంబై ఇండియన్స్ 140 (2023) ఉన్నాయి.

టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న ‘భజేవాయువేగం’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ సినిమాను మే 31న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యమీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రధన్, కపిల్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

1866: స్వాతంత్ర్య సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే జననం
1981: సంఘ సంస్కర్త, రచయిత్రి దుర్గాబాయి దేశ్‌ముఖ్ మరణం
1986: మొట్టమొదటి ఎవరెస్ట్ అధిరోహకుడు టెన్సింగ్ నార్కే మరణం
1989: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ జననం
1992: హీరోయిన్ సాయి పల్లవి జననం
2003: దర్శక నిర్మాత క్రాంతి కుమార్ మరణం

సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సోషల్ మీడియాలో తనను బ్లాక్ చేయడం బాధించిందని క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలిపారు. అలా ఎందుకు చేసిందో తనకు అర్థం కావట్లేదని అశ్విన్‌తో జరిగిన చిట్ చాట్‌లో చెప్పారు. కానీ ఆ టీమ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఇప్పటికీ టచ్‌లో ఉండటం సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. 2021లో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన SRH.. 2022 మెగా వేలానికి ముందు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

తేది: మే 09, గురువారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:29
సూర్యోదయం: ఉదయం గం.5:46
జొహర్: మధ్యాహ్నం గం.12:13
అసర్: సాయంత్రం గం.4:40
మఘ్రిబ్: రాత్రి గం.6:39
ఇష: రాత్రి గం.07.57
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.