News April 29, 2024

ఇల్లు తగలబెట్టిన పిల్లి

image

చైనాలో ఓ పెంపుడు పిల్లి ఇంటిని తగలబెట్టింది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో దండన్ అనే వ్యక్తి ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దాని పేరు జిన్‌గూడియావో. అయితే ఆ పిల్లి వంటగదిలో ఆడుకుంటూ పొరపాటున ఇండక్షన్ కుక్కర్ టచ్ ప్యానెల్‌‌పై అడుగుపెట్టగా స్టవ్ అంటుకొని వంటగది మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఆ తర్వాత క్యాబినెట్‌లో బూడిదలో కూరుకుపోయిన పిల్లిని గుర్తించారు.

News April 29, 2024

ప్రియాంకపై మధ్యప్రదేశ్ సీఎం తీవ్ర వ్యాఖ్యలు

image

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక <<13112009>>గాంధీ<<>>పై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అసలు మంగళసూత్రం ధరించని ప్రియాంక ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు. ప్రియాంకను చూసి నెహ్రూ ఆత్మ కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా కుమార్తెకు వివాహమైతే ఇంటి పేరు మారిపోతుంది. కానీ ప్రియాంక మాత్రం ఇంకా ‘గాంధీ’ పేరును వాడుకుంటున్నారు’ అని ఎద్దేవా చేశారు.

News April 29, 2024

ఏప్రిల్ 29: చరిత్రలో ఈరోజు

image

* 1848: భారత చిత్రకారుడు రాజా రవివర్మ జననం
* 1970: అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రి అగస్సీ జననం
* 1979: భారత క్రికెట్ క్రీడాకారుడు ఆశిష్ నెహ్రా జననం
* 2003: స్వాతంత్ర్యసమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య మరణం
* అంతర్జాతీయ నృత్య దినోత్సవం

News April 29, 2024

కాబోయే భర్తపై ట్రోల్స్‌ను పట్టించుకోను: వరలక్ష్మీ

image

కాబోయే భర్త నికోలయ్ సచ్‌దేవ్‌పై వచ్చిన విమర్శలపై నటి వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించారు. సెకండ్ మ్యారేజ్ అంటూ నిక్ గురించి కొందరు మాట్లాడుతున్న మాటలను తాను పట్టించుకోనని చెప్పారు. 14 ఏళ్ల క్రితం సచ్‌దేవ్‌ను కలిశానని తెలిపారు. తమ స్నేహం ఈ మధ్య కాలంలోనే ప్రేమగా మారిందన్నారు. ఇటీవల ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని ఆమె వెల్లడించారు.

News April 29, 2024

ముంబై ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే ఇలా జరగాలి!

image

ఈసారి ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో ఉన్న ముంబైకి ఆందోళనకరమైన రన్‌రేట్(-0.261) ఉంది. అయితే మిగిలిన 5 మ్యాచుల్లోనూ గెలిస్తే 16పాయింట్లతో ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉంటాయి. 14పాయింట్లు వస్తే మిగితా జట్ల గెలుపోటములు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

News April 29, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 29, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 29, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:35
సూర్యోదయం: ఉదయం గం.5:51
జొహర్: మధ్యాహ్నం గం.12:13
అసర్: సాయంత్రం గం.4:41
మఘ్రిబ్: రాత్రి గం.6:36
ఇష: రాత్రి గం.07.52
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 29, 2024

రాజ్‌నాథ్‌తో 251సార్లు జైలుకెళ్లిన వ్యక్తి ఢీ

image

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ UPలోని లక్నో నుంచి BJP MP అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయనను 251సార్లు జైలుకెళ్లిన రవిదాస్ మెహ్రోత్రా ఢీకొట్టబోతున్నారు. రవిదాస్ గతంలో UP మంత్రిగా చేశారు. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజ్‌నాథ్‌పై పోటీ గురించి మాట్లాడుతూ.. ప్రజల ముందు పెద్ద యోధులే తలవంచారు, ఎన్నికలు ఎవరివైపు మొగ్గు చూపుతాయో తెలియదని పేర్కొన్నారు.
<<-se>>#ELECTIONS<<>>

News April 29, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 29, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 29, సోమవారం
బ.పంచమి: ఉదయం 07:57 గంటలకు
పుర్వాషాడ: తెల్లవారుజాము 4:42 గంటలకు
దుర్ముహూర్తం: 1. మ.12:29 నుంచి 01:20 గంటల వరకు
2.మ.03:00 నుంచి 03:51 గంటల వరకు
వర్జ్యం: 1. తెల్లవారుజామున 03:11 నుంచి 04:49 గంటల వరకు
2.మధ్యాహ్నం 02:22 నుంచి 03:58 గంటల వరకు