News April 28, 2024

చరిత్ర సృష్టించిన సీఎస్కే

image

టీ20ల్లో చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. అత్యధిక సార్లు 200కుపైగా స్కోరు సాధించిన తొలి జట్టుగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఆ జట్టు 35 సార్లు 200కుపైగా స్కోర్ సాధించింది. ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఈ ఫీట్ నెలకొల్పింది. ఆ తర్వాతి స్థానాల్లో సోమర్‌సెట్ (34), ఇండియా (32), ఆర్సీబీ (31), యార్క్‌షైర్ (29), సర్రే (28) ఉన్నాయి.

News April 28, 2024

T20WC: మే 1న భారత జట్టు ప్రకటన?

image

టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక తుదిదశకు చేరుకుంది. ఈ మేరకు ఈరోజు బోర్డు సభ్యులతో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌శర్మ సమావేశం అయ్యారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపికపై తీవ్రంగా చర్చించింది. మే 1న జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు మే 22న న్యూయార్క్‌‌కు బయలుదేరనున్నట్లు సమాచారం.

News April 28, 2024

డైరీమిల్క్ తింటున్నారా?

image

చాలామంది వేసవిలో ఫ్రిడ్జ్‌లో పెట్టిన చల్లటి చాక్లెట్లు తింటుంటారు. ముఖ్యంగా డైరీమిల్క్ అంటే చాలామంది ఇష్టపడతారు. అయితే.. ఇటీవల డైరీమిల్క్ కొన్న ఓ కస్టమర్ కంగుతిన్నారు. అది మొత్తం బూజుపట్టి, పాడైపోయి ఉండటం గమనించి.. వెంటనే సదరు కంపెనీని ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో ఫొటోలు పంచుకున్నారు. 2024 జనవరిలో తయారైన ఈ చాక్లెట్‌పై 12నెలల ఎక్స్‌పైరీ డేట్ ఉన్నా.. ఇప్పుడే ఇలా కావడం ఏంటని ప్రశ్నించారు.

News April 28, 2024

NDAకు ఓటేయకుంటే ప్రజలకే నష్టం: పవన్

image

AP: ఎన్డీఏ కూటమికి ఓటేయకుంటే ప్రజలే నష్టపోతారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘నేను ప్రధాని మోదీతో ధైర్యంగా మాట్లాడగలను. కానీ సీఎం జగన్‌కు ఆయనంటే భయం. కేసుల గురించే ఆయన మోదీని కలుస్తారు. రాష్ట్ర సమస్యలపై ఎన్నడూ ప్రధానిని కలవలేదు. అరటి తొక్క లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేయండి. జనసేన గళాన్ని అసెంబ్లీలో వినిపించాలి. అందుకే ఈ ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించండి’ అని ఆయన పిలుపునిచ్చారు.

News April 28, 2024

జయశంకరే తెలంగాణ జాతి పిత: రేవంత్

image

TG: ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతి పిత అని సీఎం రేవంత్ అన్నారు. ‘అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కోదండరామ్ జేఏసీ ఛైర్మన్ అయిన తర్వాతే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. కేసీఆర్ ఉద్యమం ముసుగులో అధికారం చేపట్టారు. ఆస్తులు పెంచుకుని అవినీతికి పాల్పడ్డారు. కేసీఆర్‌పై ఎవరికీ జాలి లేదు. ఆయన అబద్ధాలతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది’ అని ఆయన మండిపడ్డారు.

News April 28, 2024

రాణించిన రుతురాజ్.. SRH ముందు భారీ టార్గెట్

image

SRHతో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన CSK భారీ స్కోర్ నమోదు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. 54బంతుల్లో 98 రన్స్ చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. మిచెల్ (52) హాఫ్ సెంచరీ చేయగా.. శివం దూబే (39) మెరుపులు మెరిపించారు. దీంతో 20 ఓవర్లలో చెన్నై 3 వికెట్లకు 212 రన్స్ చేసింది. SRH టార్గెట్ ఛేజ్ చేస్తుందా? కామెంట్ చేయండి.

News April 28, 2024

జనసేనకు ఈసీ గుడ్ న్యూస్

image

AP: జనసేన పార్టీకి కామన్ సింబల్ గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇంతకుముందు గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు జై భారత్ నేషనల్ పార్టీకి ‘టార్చ్ లైట్’ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News April 28, 2024

లోకేశ్ లాగే నా తమ్ముడూ మోసగాడు: నాని

image

AP: ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎంపీ కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్నిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘లోకేశ్ పెద్ద మోసగాడు.. అతడూ మోసగాడు. వారిద్దరికీ వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయ్యుండొచ్చు. భవిష్యత్తులో తనకు బినామీగా పనికొస్తాడని లోకేశ్ అనుకున్నాడేమో’ అని అన్నారు. కాగా.. విజయవాడ పార్లమెంటు స్థానంలో నాని వైసీపీ నుంచి, సోదరుడు చిన్ని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

News April 28, 2024

పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: రేవంత్

image

TG: వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రారు. సొంత నిర్ణయాలు తీసుకోను. పదేళ్ల తర్వాత పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చేపడతా. ప్రజలెవరూ బీఆర్ఎస్ మీటింగ్‌లకు వెళ్లడం లేదు. కేసీఆర్‌లో ఇప్పటికైనా మార్పు రావాలి. పవర్ కట్‌పై కేసీఆర్ ఆరోపణలు అన్నీ అవాస్తవం. ప్రతిపక్షనేతగా ఆయన హుందాగా వ్యవహరించడం లేదు’ అని ఆయన విమర్శించారు.

News April 28, 2024

WILL JACKS: 10 బంతుల్లోనే అర్ధ సెంచరీ

image

గుజరాత్‌తో మ్యాచ్‌లో RCB ఆల్‌రౌండర్ విల్ జాక్స్ (41 బంతుల్లో 100) సెంచరీతో అరాచకం సృష్టించారు. అర్ధ సెంచరీ తర్వాత 10 బంతుల్లోనే శతకం బాదారు. అంతకుముందు 31 బంతుల్లో జాక్స్ ఫిఫ్టీ చేశారు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. మోహిత్ వేసిన ఓవర్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు.. రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించారు. అతడి ధాటికి బంతి ఎక్కడ వేయాలో తెలియక రషీద్ ఖాన్ బెంబేలెత్తిపోయారు.