India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో వడదెబ్బతో ఏకంగా 19 మంది చనిపోయారు. ఇందులో వెల్గటూరుకు చెందిన MEO భూమయ్య(57) కూడా ఉన్నారు. జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, NZB, నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 22 జిల్లాల్లో వడగాలులు వీయగా.. హైదరాబాద్‌లో గాలిలో తేమ 15శాతానికి పడిపోయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

AP: జగన్ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ‘దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసే స్థాయికి దాడుల తీవ్రతను పెంచారు. ఈ కేసు నిందితుడు అనంతబాబును CM వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. దళితులకు శిరోముండనం కేసులో YCP MLC త్రిమూర్తులుకు శిక్ష పడితే ఆయన్ను సస్పెండ్ చేయలేదు. SC వర్గీకరణపై మోసం చేశారు. వర్గీకరణపై హామీ ఇవ్వడంతోనే NDA కూటమికి మద్దతిస్తున్నాం’ అని తెలిపారు.

బీజేపీ MLA రాజాసింగ్, నుపుర్ శర్మ హత్యకు కుట్ర పన్నిన ఉగ్రవాదిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని మౌలానా సొహైల్ అబు బకర్‌గా గుర్తించారు. దారాల పరిశ్రమలో మేనేజర్‌గా చేస్తూ పిల్లలకు ఇస్లాంపై ట్యూషన్లు నిర్వహిస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో ఉగ్రకార్యకలాపాలు సాగించేందుకు నిందితుడికి పాక్ నుంచి ఆదేశాలు వస్తున్నాయని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతల ప్రచారం తారస్థాయికి చేరింది. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పలు బహిరంగ సభల్లో పాల్గొంటారు. కాగజ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా.. నిర్మల్, అలంపూర్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల సభలో మాట్లాడనున్నారు. అటు ఈ నెల 8, 10 తేదీల్లో ప్రధాని మోదీ TGలో పర్యటించనున్నారు.

AP: ఈ నెల 7న రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. కాగా ఇవాళ 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 247 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటిని నిర్మించుకున్నారు. విభజన తర్వాత ఆయన ఇల్లు తెలంగాణ మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వెళ్లింది. అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది ఏపీలోని అరకు లోక్‌సభ స్థానంలో ఉండటం విశేషం.

భారత్‌లో అఫ్గానిస్థాన్ తాత్కాలిక రాయబారి జాకియా వర్ధక్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. గత నెల 25న ఆమె రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా ముంబై విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. ఆమె ధరించిన ప్రత్యేక తరహా జాకెట్, లెగ్గిన్, బెల్ట్, మోకాలి క్యాప్‌లలో ఒక్కోటి కేజీ బరువున్న 25 బంగారు కడ్డీలు దొరికాయి. కాగా ఈ ఘటనతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి 29 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 14న ఆలయ శుద్ధి, 20న సాయంత్రం అంకురార్పణ, 21న ఉదయం 10.45 నుంచి 11.30 గంటల మధ్యలో కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం జరుగుతాయి. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఉదయం 8గంటల నుంచి 9 గంటల మధ్యలో, రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్యలో వాహన సేవలు జరుగుతాయని టీటీడీ వర్గాలు తెలిపాయి. 30న సాయంత్రం పుష్పయాగం చేస్తారు.

AP: రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలను ఎన్నికల సంఘం గుర్తించింది. మొత్తం 14 సెగ్మెంట్లను అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా ప్రకటించింది. మాచర్ల, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. ఈ 14 సెగ్మెంట్లలో CRPFతోపాటు రాష్ట్ర పోలీసుల బలగాలు భారీగా మోహరించనున్నాయి.

AP: అనకాపల్లి జిల్లా తారువలో తనపై వైసీపీ నేతలు <<13183356>>దాడికి <<>>పాల్పడ్డారని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. ‘డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా. అనకాపల్లి ఎంపీ స్థానంలో ముత్యాలనాయుడు, మాడుగులలో ఆయన కుమార్తె ఓడిపోతామనే భయంతోనే ఇలా దాడులకు దిగుతున్నారు’ అని ఆగ్రహించారు.
Sorry, no posts matched your criteria.