News April 25, 2024

D-ఓటరు ఓటేయలేరు.. అసలు వీరెవరు?

image

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ బెంగాలీలు అస్సాంలోని బరాక్ లోయ ప్రాంతంలో స్థిరపడ్డారు. భారత పౌరులుగా నిరూపించుకునేందుకు సరైన ఆధారాలు చూపించలేని వారిని D-ఓటరు లేదా సందేహాస్పద ఓటరుగా పేర్కొంటున్నారు. వీరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నా.. ఏ ఎన్నికలోనూ ఓటు వేయలేరు. అస్సాంలో మొత్తం 96,987 మంది D-ఓటర్లు ఉన్నారు. CAA ప్రకారం పౌరసత్వ సమస్య పరిష్కారమైతే వీరికి ఇబ్బందులు తొలగిపోతాయని BJP అంటోంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 25, 2024

ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చిన నీచుడు చంద్రబాబు: బొత్స

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ‘ఓటుకు నోటు కేసులో పారిపోయి ఇక్కడ తిరుగుతున్న నీచుడు చంద్రబాబు. రాజకీయాల్లో నేతల తలలపై రూపాయి పెట్టి విలువ కట్టడమే ఆయన బతుకు. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో సహనం కోల్పోయి సీఎం జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారు’ అని ఫైరయ్యారు.

News April 25, 2024

ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

image

1874: రేడియో కనిపెట్టిన శాస్త్రవేత్త గూగ్లిల్మో మార్కోని జననం
1984: గణితశాస్త్రజ్ఞుడు ముదిగొండ విశ్వనాథం మరణం
2005: ఆధ్యాత్మిక గురువు స్వామి రంగనాథానంద మరణం
2018: రాజకీయ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి మరణం
2021: సాహితీవేత్త, పద్యకవి డా.తిరునగరి రామానుజయ్య మరణం
నేడు మలేరియా దినోత్సవం
ఇవాళ ప్రపంచ పశువైద్య దినోత్సవం

News April 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 25, 2024

కనీసం నా అంత్యక్రియలకైనా హాజరవ్వండి: ఖర్గే

image

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎమోషనల్ అయ్యారు. కర్ణాటకలోని తన సొంత జిల్లా కలబురగిలో మాట్లాడుతూ.. ‘హస్తానికి ఓటు వేయడానికి ఇష్టపడకపోయినా కనీసం మీ(ప్రజల) కోసం పనిచేశానని భావిస్తే నా అంత్యక్రియలకైనా హాజరవ్వండి. మీరు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే కలబురగిలో నాకు స్థానం లేనట్లే భావిస్తా. ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా చివరి శ్వాస వరకు కృషి చేస్తా’ అని పేర్కొన్నారు.

News April 25, 2024

BREAKING: జేఈఈ మెయిన్-2 ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. <>https://jeemain.nta.ac.in/<<>> వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. అలాగే జనవరిలో జరిగిన తొలి సెషన్‌తోపాటు ఏప్రిల్‌లో నిర్వహించిన రెండో సెషన్‌లో మెరుగైన స్కోరు సాధించిన వారి మెరిట్ లిస్టును విడుదల చేసింది. దేశంలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది.

News April 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 25, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 25, గురువారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:38
సూర్యోదయం: ఉదయం గం.5:54
జొహర్: మధ్యాహ్నం గం.12:14
అసర్: సాయంత్రం గం.4:41
మఘ్రిబ్: రాత్రి గం.6:35
ఇష: రాత్రి గం.07.50
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 25, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 25, గురువారం
బ.పాడ్యమి: ఉదయం 6:46 గంటలకు
విశాఖ: తెల్లవారుజాము 2:24 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.9:59 నుంచి 10.50 వరకు
దుర్ముహూర్తం: మ.3 నుంచి 3.50 వరకు
వర్జ్యం: ఉదయం 6:41 నుంచి ఉ.8:24 వరకు

News April 25, 2024

TODAY HEADLINES

image

TG: ఇంటర్ ఫలితాలు విడుదల
☛ వరంగల్‌కు రెండో రాజధాని అయ్యే అర్హతలు: రేవంత్
☛ బీఆర్ఎస్‌కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
☛ 6 గ్యారంటీలకు కాంగ్రెస్ పంగనామం పెట్టింది: కేసీఆర్
AP: ఎన్నికల్లో కూటమి చెంప చెళ్లుమనిపించాలి: జగన్
☛ వైఎస్సార్‌ని తిట్టిన వారికే జగన్ పెద్దపీట: షర్మిల
☛ జగన్ నాటకాల రాయుడు : చంద్రబాబు