India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ జట్లపై సీఎస్కే మాజీ ఆటగాడు సురేశ్ రైనా పరోక్ష విమర్శలు గుప్పించారు. ఐపీఎల్ టైమ్‌లో పార్టీలు చేసుకుంటున్న జట్లు ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీని కూడా గెలవలేదన్నారు. ‘చెన్నై ఎప్పుడూ పార్టీ చేసుకోలేదు. ఐపీఎల్‌లో 5 కప్పులు, 2 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు గెలిచింది. ముంబై కూడా 5 కప్పులు గెలిచింది. రాత్రంతా పార్టీ చేసుకునే ఆటగాళ్లు తర్వాతి రోజు ఆట ఎలా ఆడగలుగుతారు?’ అని ప్రశ్నించారు.

IAS అధికారి కావాలనేది యువత కల. కానీ ఆ ఛాన్స్ కొంతమందికే దక్కుతుంది. జీతం తక్కువైనా IAS కావాలనుకోవడానికి కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగం గౌరవ మర్యాదలు, అధికారం అందిస్తుంది. ఆ అధికారంతో ప్రజలకు, సమాజానికి ఎలాంటి ప్రయోజనమైనా కల్పించవచ్చు. ఉద్యోగ భద్రతకు తిరుగుండదు. వారిని తొలగించడం కష్టం. వేతనంతోపాటు ప్రోత్సాహకాలు అందుతాయి. ఆఫీస్, బంగ్లా, వాహనం, పీఏ, డ్రైవర్ వంటి అత్యుత్తమ సౌకర్యాలు ఉంటాయి.

భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, పీహెచ్‌డీకి అర్హత కోసం నిర్వహించే ‘యూజీసీ నెట్’కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలైనట్లు యూజీసీ తెలిపింది. ఈ ఏడాది జూన్ 16న దేశవ్యాప్తంగా పరీక్షను నిర్వహించనున్నారు. వచ్చే నెల 10న రాత్రి 11.50గంటలకు దరఖాస్తుల గడువు ముగియనుంది. అప్లికేషన్లలో పొరపాట్లుంటే వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ మధ్యలో సరిచేసుకోవచ్చు.

కర్ణాటకకు చెందిన ‘నందిని’ డెయిరీ బ్రాండ్ 2 క్రికెట్ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. జూన్ 1 నుంచి జరగనున్న T20 WCలో పాల్గొనే స్కాట్లాండ్, ఐర్లాండ్ టీమ్స్‌కు ‘నందిని’ స్పాన్సర్‌గా ఉండనున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(KMF) ప్రకటించింది. అలాగే టోర్నీ సందర్భంగా అమెరికాలో ‘నందిని స్ప్లాష్’ పేరిట ఎనర్జీ డ్రింక్‌ను కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. అమెరికా, వెస్టిండీస్‌లో WC జరగనుంది.

బెంగళూరుతో మ్యాచులో KKR ఓపెనర్ ఫిల్ సాల్ట్ విరుచుకుపడ్డారు. ఫెర్గూసన్ వేసిన 4వ ఓవర్‌లో ఏకంగా 6,4,4,6,4,4 బాదారు. దీంతో ఆ ఓవర్‌లో 28 రన్స్ పిండుకున్నారు. సాల్ట్ కేవలం 14 బంతుల్లోనే 48 పరుగులు చేసి ఔటయ్యారు.

మాల్దీవుల్లో 93 స్థానాలకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. 6 పార్టీల నుంచి 368 మంది పోటీలో ఉన్నారు. ఫలితాలు రేపు రానుండగా, ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు పార్టీ ‘పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్’కు షాక్ తగిలే ఛాన్సుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముయిజ్జు చేపట్టిన భారత వ్యతిరేక చర్యల నేపథ్యంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన ప్రతిపక్షమైన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి మెజారిటీ రావొచ్చని అంటున్నారు.

పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ కొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ T20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 3వేల పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచారు. 79 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత అందుకున్నారు. 81 ఇన్నింగ్సుల్లో ఈ మైలురాయిని చేరుకున్న కోహ్లీ, బాబర్‌లను రిజ్వాన్ వెనక్కి నెట్టారు. నిన్న కివీస్‌తో మ్యాచులో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో 3వేల పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్ రిజ్వాన్.

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లో ఏ కోశానా నాయకుడి లక్షణాలు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లు ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడిలా ఆయన వ్యవహరించడం లేదు. బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు. కాపుల హక్కుల కోసం ఆయన ఏనాడైనా నోరువిప్పారా? జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే కూటమిగా వస్తున్నారు. జగన్ ఓ వైపు.. గుంటనక్కలు మరో వైపు’ అని ఆయన మండిపడ్డారు.

నిన్నటి మ్యాచులో SRH బౌలర్ నటరాజన్ ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేసిన నటరాజన్ మూడు వికెట్లు తీయడమే కాకుండా.. ఏకంగా మెయిడిన్ వేశారు. మొత్తం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన నటరాజన్ 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు. బ్యాటర్లు రెచ్చిపోయిన మ్యాచులో 5లోపు ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘శభాష్.. నటరాజన్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

AP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్‌పై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ససేమిరా అంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మెత్తబడ్డారు. చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి బుజ్జగించడంతో బీజేపీలో చేరేందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. ఎన్నికల నిమిత్తం నల్లమిల్లి త్వరలోనే బీజేపీలో చేరతారని, దీనికోసం బీజేపీ నేతలతో స్వగృహంలో భేటీ అయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.