News April 16, 2024

ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు: అరవింద్

image

TG: లో‌క్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన ఆయన.. ‘రాష్ట్రంలో BJPకి 12 MP సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయి. వంద రోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా అమలవుతాయి?’ అని ప్రశ్నించారు.

News April 16, 2024

CSKకి గుడ్‌న్యూస్

image

IPL ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ నెలకొన్న నేపథ్యంలో CSKకు బంగ్లాదేశ్ శుభవార్త చెప్పింది. CSK కీలక బౌలర్ ముస్తాఫిజుర్ NOCని పొడిగించింది. దీంతో అతడు మే 1న పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌ వరకు అందుబాటులో ఉండనున్నారు. జింబాబ్వేతో T20 సిరీస్ (మే 3-12) కోసం అతడిని BCB ఏప్రిల్ 30నే స్వదేశానికి రమ్మంది. అయితే CSK కోరిక మేరకు ఆ గడువును తాజాగా పొడిగించింది. CSKలో ఇతడు టాప్ వికెట్ టేకర్(10)గా ఉన్నారు.

News April 16, 2024

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

image

జులై నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. 22న మ.3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 23న మ.3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల టోకెన్లు.. 24న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను TTD విడుదల చేయనుంది.

News April 16, 2024

‘ఆమె’ అనుకొని లవ్ చేశాడు.. కానీ!

image

అమ్మాయితో 20సం. రిలేషన్ తర్వాత ఆమె ‘అతడు’గా తెలిస్తే? ఫ్రెంచ్ మాజీ దౌత్యవేత్త బెర్నార్డ్ బౌర్సీకాట్‌ విషయంలో ఇదే జరిగింది. చైనా స్పై షీ పెయిపూతో బెర్నార్డ్‌కు 1964లో పరిచయం ఏర్పడింది. నటుడైన షీ మహిళగా శరీరాకృతి మార్చుకోగా బెర్నార్డ్ ప్రేమించాడు. ఇద్దరి రిలేషన్ గుర్తించిన చైనా బెర్నార్డ్‌ను బెదిరించి కీలక సమాచారం సేకరించింది. 1983లో ఇది గ్రహించిన ఫ్రెంచ్ రక్షణ శాఖ ఇద్దరికీ 6సం. శిక్ష విధించింది.

News April 16, 2024

BREAKING: భారీగా పెరిగిన ధరలు

image

బంగారం ధరలు ఆకాశమే హద్దు అన్నట్లు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.980 పెరిగి రూ.74,130కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.67,950గా నమోదైంది. అటు సిల్వర్ కూడా కేజీ రూ.1000 పెరిగి రూ.90,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News April 16, 2024

మహిళ స్కూటీపై రూ.1.36లక్షల ఫైన్

image

బెంగళూరులో ఓ మహిళకు ఏకంగా రూ.1.36లక్షల ఫైన్ పడింది. సదరు మహిళ పదేపదే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు. హెల్మెట్ ధరించకపోవడంతో పాటు ట్రిపుల్ రైడింగ్ వంటివి చేస్తూ 277సార్లు నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో ఆమె హోండా యాక్టివాపై భారీ జరిమానా పడింది. ఆ స్కూటీ ఖరీదు కంటే ఫైన్ అమౌంట్ ఎక్కువ కావడం గమనార్హం. కాగా.. బండి పోలీస్ స్టేషన్‌లో పెట్టి మిగిలిన డబ్బు చెల్లించి వెళ్లాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

News April 16, 2024

టాప్-10 రద్దీ విమానాశ్రయాలు ఇవే..

image

గత ఏడాది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాల జాబితాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ACI) రిలీజ్ చేసింది. ఇందులో అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్ట్ తొలిస్థానంలో నిలవగా.. దుబాయ్, డల్లాస్, లండన్, యూకే, టోక్యో, జపాన్, డెన్వార్ అమెరికా, ఇస్తాంబుల్(తుర్కియే), లాస్ ఏంజెలిస్, చికాగో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఢిల్లీ) పదో స్థానంలో నిలిచింది.

News April 16, 2024

టీ20ల్లోనే చెత్త రికార్డు

image

నిన్న సన్‌రైజర్స్‌తో మ్యాచులో ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డు నమోదైంది. SRH బ్యాటింగ్ సమయంలో ఆర్సీబీలోని నలుగురు బౌలర్లు ఏకంగా 50కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఐపీఎల్‌లోనే కాకుండా టీ20ల్లోనూ ఇలా జరగడం ఇదే తొలిసారి. టాప్లీ(68), యశ్(51), ఫెర్గూసన్(52), వైశాఖ్(64) పరుగులు ఇచ్చారు. మరోవైపు నిన్నటి మ్యాచులో ఇరు జట్లలోని బౌలర్లు ఓవర్‌కు కనీసం 10 పరుగుల చొప్పున ఇవ్వడం గమనార్హం.

News April 16, 2024

BREAKING: టీడీపీకి ఈసీ నోటీసులు

image

AP: టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్న లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలని అడిషనల్ సీఈవో నోటీసులు జారీ చేశారు.

News April 16, 2024

జనసేన అభ్యర్థులకు రేపు బీఫారాలు

image

AP: తమ అభ్యర్థులకు జనసేన రేపు బీఫారాలు అందించనుంది. ఆ పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వారందరికీ బీఫారాలు ఇవ్వాలని పవన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రేపు ఉదయం ఈ కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు అభ్యర్థులందరికీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ ఈ నెల 21 లేదా 22న పిఠాపురంలో నామినేషన్ వేసే అవకాశం ఉంది.