India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగ్లాదేశ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత మహిళల జట్టును BCCI ప్రకటించింది.
★ టీమ్: హర్మన్‌ప్రీత్ (C), మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, సజన సజీవన్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, రాధా యాదవ్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, ఆశా శోభనా, రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు

కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు ద్వారకీశ్(81) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1963లో కన్నడ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ద్వారకీశ్ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయుష్మాన్ భవ, ఆప్తమిత్ర, విష్ణువర్ధన వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేశారు.

ట్విటర్ అధినేత మస్క్ సంచలన ప్రకటన చేశారు. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకునేవారు నామమాత్రపు ఫీజు ($1 USD అని సమాచారం) చెల్లించాలన్నారు. లైక్, రీపోస్ట్, రిప్లై, బుక్‌మార్క్ చేయాలంటే ఈ రుసుము తప్పనిసరి అని తెలిపారు. ఫేక్, స్పామ్ అకౌంట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ వెల్లడించారు. న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఈ పాలసీ త్వరలో భారత్‌లోనూ అమలు కావొచ్చు.

భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా.. పేద దేశంగానే ఉంటుందని RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. సౌదీ అరేబియా అందుకు సాక్ష్యమన్నారు. అది సంపన్న దేశమే అయినా ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాలేకపోయిందని ఉదహరించారు. దేశంలో సంక్షేమ ఫలాలు అందరికీ అంది, నిరుపేదలన్నవారు లేనిరోజే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని దువ్వూరి తన పుస్తకంలో పేర్కొన్నారు.

AP: గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట దక్కింది. ఈ గుర్తును JSPకి కేటాయిస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యులర్) పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసును కేటాయించగా.. తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది.

మనిషికి నిద్ర కనీస అవసరమని, దానికి ఆటంకం కలిగించడం అంటే మానవ హక్కులను ఉల్లంఘించినట్టేనని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితుల స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేయడానికి ‘earthly timings’ని పాటించాలని EDని ఆదేశించింది. నిద్ర లేకపోతే మానసిక సమస్యలు వస్తాయని పేర్కొంది. తనను రాత్రి సమయాల్లో ఈడీ అధికారులు విచారించారని ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది.

TG: కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఎన్ వంశతిలక్‌ను బీజేపీ ప్రకటించింది. అక్కడి ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ నుంచి ఆమె సోదరి నివేదిత పోటీ చేయనున్నారు.

★ <
★ రిజిస్టర్ చేసుకున్నట్టైతే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి
★ తర్వాత e-epic Download ఆప్షన్‌ను క్లిక్ చేయాలి
★ మీ ఓటర్ కార్డు నంబర్, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి
★ ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నంబర్ వెరిఫై అవుతుంది
★ ఆ తర్వాత Download e-EPIC పైన క్లిక్ చేయాలి
★ PDF ఫార్మాట్‌లో ఓటర్ ఐడీ డౌన్‌లోడ్ అవుతుంది.
>> SHARE

త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు TG సచివాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికలు పారదర్శకంగా, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. గోవా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు రాకుండా సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రపంచ వైద్య నిపుణుల్ని కంగారు పెడుతున్న కనిపించని పెను ముప్పు ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’(ఏఎంఆర్). విచ్చలవిడి ఔషధాల వాడకం వలన కొంతకాలానికి ఆయా రోగకారక క్రిములు ఆ మందులకు కూడా లొంగని నిరోధకతను పెంపొందించుకోవడాన్ని ఏఎంఆర్‌గా వ్యవహరిస్తారు. అదే జరిగితే ఇప్పటి వరకు కనిపెట్టిన ఔషధాలేవీ పనిచేయవు. ఈ కారణంగా 2050 నాటికి ఏటా కోటి మరణాలు నమోదవుతాయనే శాస్త్రవేత్తల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.