India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్ణాటక మంత్రి లక్ష్మి హెబ్బల్కర్‌పై ఆ రాష్ట్ర BJP నేత సంజయ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘BJPకి మహిళల మద్దతు పెరుగుతుండటంతో లక్ష్మికి నిద్ర పట్టడం లేదు. రాత్రి నిద్ర పట్టాలంటే ఆమె స్లీపింగ్ పిల్ కానీ, ఎక్స్‌ట్రా పెగ్ కానీ వేసుకోవాలి’ అని అన్నారు. దీనిపై స్పందించిన లక్ష్మి మహిళలకు BJP ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. జైశ్రీరామ్ నినాదాలు చేస్తే సరిపోదని, మహిళలను గౌరవించాలని హితవు పలికారు.

AP: ఒక్క రోజు విరామం తర్వాత సీఎం జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు యాత్రను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘కృష్ణా జిల్లా సిద్ధమా..?’ అని పేర్కొన్నారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, జొన్నపాడు వరకు యాత్ర సాగనుంది. సాయంత్రం గుడివాడలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.

TG: మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది. నర్సాపూర్ మాజీ MLA మదన్‌రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు CM రేవంత్ సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం నర్సాపూర్ నుంచి భారీ కాన్వాయ్‌తో ఆయన HYD చేరుకోనున్నారు. పదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించానని, తనను అభిమానించే వారంతా కాంగ్రెస్‌లో చేరుతారని మదన్‌రెడ్డి తెలిపారు.

TG: లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 25 వరకు అప్లై చేసుకోవచ్చు. నిన్నటివరకు మూడేళ్ల లా కోర్సుకు 18,615, ఐదేళ్ల కోర్సుకు 5,661, పీజీకి 2,294 దరఖాస్తులు వచ్చినట్లు లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మి తెలిపారు. జూన్ 3న పరీక్ష జరగనుంది.

తనకు సినిమాల్లో కంటే బయటే విలన్లు ఎక్కువగా ఉన్నారని హీరో విశాల్ అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రత్నం’ సినిమా తర్వాత స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్-2 మూవీ చేయనున్నట్లు తెలిపారు. మే 5న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. కొత్తగా ఏం చేస్తాడని అనుకునేవారి కోసమే ఈ సినిమా చేస్తున్నానన్నారు. కాగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రత్నం’ మూవీ ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 81,057 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 27,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి రూ.3.80 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.

TG: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నెల 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. అలాగే బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు కూడా నేటితో గడువు ముగియనుండగా.. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆయన అరెస్ట్, రిమాండ్‌ను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది.

ఐక్యత లేకపోవడం వల్లే దేశంలోని విపక్షాలు బలహీనపడి, తమ శక్తిని కోల్పోయాయని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ తెలిపారు. అతిపెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్‌లో అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని చెప్పారు. ముందుగా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేపై అమర్త్యసేన్ విమర్శలు చేశారు. నిరక్షరాస్యత, లింగ అసమానతలు దేశంలోని పేదల పురోగతిని కష్టతరం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

TG: మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకంపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. 18.86 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారని.. ఏప్రిల్ 13 నాటికి కొందరు రెండో రాయితీ సిలిండర్ కూడా పొందారని పేర్కొంది. మొత్తంగా 21.29 లక్షల మందికి రూ.59.97 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 39.33 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు రూ.500కు సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించింది.
Sorry, no posts matched your criteria.