India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. ‘సీఎం జగన్‌పై దాడి దురదృష్టకరం. ఈ ఘటనపై CBI లేదా NIAతో విచారణ జరిపించాలి. సీఎం భద్రత విషయంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా విఫలమయ్యారు. వారిని వెంటనే బదిలీ చేయాలి’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

AP: తాము అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీనిచ్చారు. జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.4వేలను ఏప్రిల్ నుంచే కలిపి అందిస్తామని చెప్పారు. ‘తల్లికి వందనం కింద ప్రతి మహిళకు రూ.15వేలు, ఉచితంగా మూడు సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’ హామీలు అమలు చేస్తామని పాయకరావుపేట సభలో తెలిపారు.

TG: రాష్ట్రంలోని మద్యం షాపుల్లో బీర్ల కొరత ఏర్పడింది. సరఫరా, విక్రయాల మధ్య అంతరం పెరగడంతో ఈ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. బ్రూవరీల యాజమాన్యాలకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో బెవరేజెస్ కార్పొరేషన్ విఫలం కావడంతో బీర్ల ఉత్పత్తిపై ప్రభావం పడినట్లు సమాచారం. రాష్ట్రంలోని 6 బ్రూవరీల్లో రోజుకు 2.50 లక్షల కేసుల బీరు తయారు చేయొచ్చు. ప్రస్తుతం 1.50 లక్షల కేసుల బీరు మాత్రమే తయారవుతుండటంతో డిమాండ్ పెరిగింది.

AP: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనపై విచారణ కోసం పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ సీపీ కాంతి రాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఈ కేసును విచారిస్తుండగా.. ఈ బృందాల నుంచి సిట్ కేసు వివరాలను తీసుకోనుంది. అటు ఈ ఘటనపై వైసీపీ నేతలు సజ్జల, మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు.

పీఎం మోదీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మోదీ గ్యారంటీలన్నీ తప్పుడు హామీలేనని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. ‘ఉద్యోగ కల్పన, రైతుల ఆదాయం రెట్టింపు, ధరల పెరుగుదల కట్టడి వంటి గత హామీలన్నీ అలాగే ఉండిపోయాయి. వీటన్నింటినీ ఇప్పుడు 2047కు వాయిదా వేస్తున్నారు. గత పదేళ్లలో దేశం కోసం బీజేపీ చేసిందేమీ లేదు. ప్రజలు ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు’ అని విమర్శించారు.

AP: YSR జిల్లాలోని ప్రొద్దుటూరుకు అరుదైన రికార్డు ఉంది. 1957 నుంచి 1978 వరకు వరుసగా 5 ఎన్నికల్లో ఇండిపెండెంట్లే హవా సాగించారు. 6సార్లు INC, 3సార్లు TDP, 2సార్లు YCP అభ్యర్థులు గెలిచారు. ఈసారి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి(YCP) హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా, టీడీపీ నుంచి రాజకీయ కురువృద్ధుడు నంద్యాల వరదరాజులు రెడ్డి బరిలో దిగుతున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు.<<-se>>#ELECTIONS2024<<>>

తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఇండియన్-2 నుంచి కమల్ హాసన్ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘సంఘ విద్రోహ శక్తులను ఏ మాత్రం క్షమించని సేనాపతి వచ్చే జూన్‌లో మళ్లీ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ అన్యాయం జరిగినా రెడ్ అలర్ట్‌గా పరిగణించండి’ అని రాసుకొచ్చారు. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్, ప్రియ భవానీ శంకర్, SJ సూర్య, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటించారు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయన్న ఆందోళన సర్వత్రా కనిపిస్తోంది. ఈక్రమంలో ట్విటర్‌లో ‘వరల్డ్ వార్ 3’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు 51.7 వేల పోస్టులు ఈ ట్యాగ్‌తో వచ్చాయి. కొంతమంది భయం వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ యుద్ధం మొదలైతే మీరు ఎవరికి మద్దతిస్తారు అంటూ చర్చించుకుంటున్నారు.

KKRతో మ్యాచ్‌లో LSG 20 ఓవర్లలో 161/7 స్కోరు చేసింది. పూరన్ 45, కేఎల్ రాహుల్ 39, ఆయుష్ బదోని 29 మినహా అందరూ విఫలమయ్యారు. KKR బౌలర్లలో స్టార్క్ 3, వైభవ్, సునీల్ నరైన్, వరుణ్, రస్సెల్ తలో వికెట్ తీశారు.

సినీ హీరో విశాల్ సంచలన ప్రకటన చేశారు. త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపారు. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతుల్లేవని.. వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని చెప్పారు. ఇప్పటికే సీనియర్ హీరోలు కమల్ హాసన్, విజయ్ పార్టీలు స్థాపించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.