India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీఆర్ఎస్ సంగారెడ్డి(D) సుల్తాన్‌పూర్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనుంది. పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సభలో పాల్గొంటారు. ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు.

TG: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ(TSRJC) పరిధిలోని 35 గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీీసీ, ఎంఈసీ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఈ నెల 21న పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం 73,527 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

విమానం టికెట్ అంటే కనీసం రూ.3వేలైనా ఉంటుంది. కానీ మన దేశంలో కొన్ని రూట్లలో విమానం టికెట్ ధర రూ.150నే అని తెలుసా? రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ కింద కేంద్రం పలు చోట్ల అమలు చేస్తున్న ధరలివి. ఈ స్కీమ్‌లో భాగంగా ధర రూ.1000లోపే ఉంటుంది. కనిష్ఠంగా అస్సాంలోని లిలాబరీ-తేజ్‌పూర్ మధ్య ఫ్లైట్ టికెట్ రూ.150గా ఉంది. డిమాండ్ తక్కువ ఉన్న రూట్లలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ స్కీమ్ తెచ్చింది.

బీజేపీ 400కుపైగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. తమ పార్టీ అజెండాపై ప్రతిపక్షాలు ప్రజలను భయబ్రాంతులను గురిచేయడం మానుకోవాలని సూచించారు. ‘నేను పెద్ద ప్లాన్స్ ఉన్నాయని చెప్తున్నందుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరినీ భయపెట్టాలని నిర్ణయం తీసుకోను. దేశ అభివృద్ధి గురించి ఆలోచించే తీసుకుంటా’ అని తెలిపారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి 100రోజుల్లో తీసుకోవాల్సిన చర్యల్లో డ్రాపౌట్లకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి చదువు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోందట. 10, 12 తరగతుల్లో ఫెయిలైన విద్యార్థులను స్కూళ్లు రీఅడ్మిట్ చేసుకునేలా ఉన్న AP ప్రభుత్వ విధానాన్ని పరిశీలిస్తోందట. ప్రస్తుతం పదో తరగతి ఫెయిలైన వారి సంఖ్య 36లక్షలు, 12వ తరగతి ఫెయిలైన వారి సంఖ్య 12లక్షలుగా ఉంది.

SRHతో మ్యాచ్‌లో RCB సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. ఛేదనలో 250 రన్స్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. దీంతో RCB పోగొట్టుకున్న అత్యధిక స్కోర్ (263) రికార్డును ఇది భర్తీ చేసినట్లు అయింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో RCB అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసిన SRH (277).. నిన్నటి మ్యాచ్‌లో 287 కొట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. తమ రికార్డ్ బ్రేక్ చేసిన జట్టుపైనే RCB కొత్త రికార్డ్ సాధించడం గమనార్హం.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులకు తెగబడ్డ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో వీరు పట్టుబడినట్లు తెలిపారు. కాగా ఆదివారం నిందితులు బైక్‌పై వచ్చి సల్మాన్ ఇంటివైపుగా కాల్పులు జరిపి పరారయ్యారు. ఇది తమ పనేనని ప్రకటించుకున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్.. సల్మాన్‌కు ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరించారు.

ఎలక్టోరల్ బాండ్స్‌తో బీజేపీ ఎక్కువగా లబ్ధి పొందిందన్న ప్రతిపక్షాల విమర్శలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ‘మనీలాండరింగ్ కేసులు ఎదుర్కొన్న తర్వాత 16 కంపెనీలు పార్టీలకు డొనేషన్ ఇచ్చాయి. ఇందులో బీజేపీకి 37% వస్తే, 63% డొనేషన్ ప్రతిపక్షాలకే వెళ్లింది. మరి ప్రతిపక్షాలకు ఆ డొనేషన్ ఎలా వచ్చింది?’ అని ప్రశ్నించారు. కాగా ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను ఓ సక్సెస్ స్టోరీగా అభివర్ణించారు మోదీ.

ఎన్నికల్లో పారదర్శకత రావాలంటే ఎలక్టోరల్ బాండ్స్ స్కీమే అత్యుత్తమ మార్గమని తమ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదన్నారు ప్రధాని మోదీ. ‘ఎన్నికల్లో పార్టీలు డబ్బును ఖర్చు చేసే మాట నిజం. ఇందులో నల్లధనానికి చోటు లేకుండా పారదర్శకత తేవాలని చేసిన చిన్న ప్రయత్నమే ఈ స్కీమ్. ఇది రద్దు కావడంతో దేశాన్ని మళ్లీ నల్లధనంవైపు నెట్టేసినట్లు అయింది. దీని పరిణామాలు గురించి తెలుసుకున్నాక అందరూ చింతిస్తారు’ అని పేర్కొన్నారు.

గత ఏడాదిలానే ఈసారి కూడా భారీగా ఫ్రెషర్లను నియమించుకుంటామని TCS సీఈఓ కృతివాసన్ వెల్లడించారు. FY25లో దాదాపు 40వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు తెలిపారు. గత మూడు త్రైమాసికాలుగా సంస్థలోని ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గింది.
Sorry, no posts matched your criteria.