India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఇవాళ తుక్కుగూడ సభలో కాంగ్రెస్‌లో 12మంది BRS MLAలు చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గంగుల కమలాకర్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కోవా లక్ష్మి, సుధీర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మాణిక్ రావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాగుంట గోపీనాథ్, బండారు లక్ష్మారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని BRS శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది సాయంత్రం తేలిపోనుంది.

AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ 93.42 శాతం పూర్తయింది. 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1874.85 కోట్లను ప్రభుత్వం అందించింది. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇళ్ల వద్దే పింఛన్లు అందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. నేడు కూడా ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్లు అందిస్తామని అన్నారు.

TG: ఎన్నికల సమయంలో మేనిఫెస్టోల పేరిట ప్రజలను మోసం చేయొద్దని మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచించారు. మోసపూరిత హామీలతో మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటేనని రాహుల్‌కు రాసిన లేఖలో దుయ్యబట్టారు. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయాలనే ఎత్తుగడలు ఇక ముందు సాగవని రాహుల్‌ను హెచ్చరించారు.

భారత క్రికెట్ చరిత్రలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ది ఓ ప్రత్యేక స్థానం. అతడి రిటైర్మెంట్ తర్వాత.. వీరూ లాంటి డేరింగ్&డ్యాషింగ్ ఓపెనర్‌ను టీమ్ తయారు చేసుకోలేకపోయింది. అయితే SRH బ్యాటర్ అభిషేక్‌శర్మ ఆ లోటు తీర్చేలా కనిపిస్తున్నారు. ఈ యువ కెరటం బ్యాటుతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఈ సీజన్‌లో ఆడిన 4మ్యాచుల్లో 32రన్స్(19బంతుల్లో), 63(23), 29(20), 37(12) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

AP: పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. నిన్నటితో గడువు ముగియగా.. పలు వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఏప్రిల్ 10 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుం చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పరీక్ష యథావిధిగా ఏప్రిల్ 27వ తేదీన నిర్వహిస్తామని తెలిపింది.

AP: శ్రీశైలంలో నిర్వహించనున్న ఉగాది మహోత్సవాలకు నేడు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో కైలాసగిరి నిండిపోయింది. ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా రోజూ శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి విశేష వాహన సేవ నిర్వహిస్తారు.

అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు, రేపు ఏపీ, తెలంగాణలో తీవ్ర వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. TGలో నిన్న 4 జిల్లాల్లో 43.5, APలోని 9 జిల్లాల్లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఆదివారం TGలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. APలో 8, 9 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది.

IPLలో రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ఆడిన 3మ్యాచుల్లోనూ RR టాప్2లో ఉంటే.. RCB 4మ్యాచుల్లో 1 మాత్రమే గెలిచి 8వ ప్లేస్‌లో ఉంది. వరుస ఓటములతో డీలాపడ్డ RCBకి ఈరోజు జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌ను దాని సొంతగడ్డపైనే ఎదుర్కోనుండటం సవాలే. వీటి మధ్య 30మ్యాచులు జరగ్గా.. RR 15, RCB 12 మ్యాచుల్లో గెలిచాయి. మూడింట్లో ఫలితం తేలలేదు.

AP: పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. నియోజకవర్గంలో ఇల్లు కొనుక్కుంటానని ఇటీవల ప్రచార సభలో తెలిపారు. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆయన నివసించే భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉంటుందని దీన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల జ్వరం బారిన పడ్డ పవన్.. రేపటి నుంచి తిరిగి ప్రచారంలో పాల్గొంటారు.

రష్యాను ఉక్రెయిన్ చావుదెబ్బ కొట్టింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థ SBU, సైన్యం కలిసి భారీ డ్రోన్లతో రష్యాపై దాడి చేశాయి. ఈ దాడిలో సౌత్ రోస్టోవ్‌లోని మోరోజోవ్స్క్ వైమానిక స్థావరంలోని ఆరు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. మరో 8 వరకూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. భద్రతా దళాలకు చెందిన దాదాపు 20 మంది సిబ్బంది మరణించినట్టు తెలుస్తోంది. కాగా ఈ దాడి తామే చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
Sorry, no posts matched your criteria.