India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తన బాల్యంలో ఆర్థిక కష్టాల కారణంగా ఇంటి అద్దె కట్టలేకపోయామని నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలిపారు. ‘నా చిన్నప్పుడు సొంత ఇల్లు లేదు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారేవాళ్లం. అద్దె కట్టలేక రోడ్డున పడ్డ సందర్భాలు ఉన్నాయి. నా తల్లిదండ్రులు నేను ఆడుకోవడానికి బొమ్మను కూడా కొనలేకపోయారు. అందుకే ఇప్పుడు నేను డబ్బుకు విలువిస్తాను. సక్సెస్‌ను అంత ఈజీగా తీసుకోను’ అని ఆమె చెప్పారు.

112ఏళ్ల నాటి టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ తాజాగా బయటపడింది. ప్రయాణికుల కోసం రూపొందించిన ఈ మెనూ వైరలవుతోంది. అల్పాహారం నుంచి లంచ్ వరకు కన్సోమ్ ఫెర్మియర్, ఫిల్లెట్ ఆఫ్ బ్రిల్, చికెన్ ఎలా మేరీల్యాండ్, కార్న్డ్ బీఫ్, బంగాళాదుంపలు, సీతాఫలం పుడ్డింగ్, యాపిల్ మెరింగ్యూ, పేస్ట్రీ వంటివి మెనూలో ఉన్నాయి. 1912 APR14న ఈ మెనూ రూపొందించగా మరుసటి రోజు షిప్ సముద్రంలో మునిగిపోయి 1500 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా మొదటి వారంలో రూ.94 కోట్ల గ్రాస్ రాబట్టి రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువైంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. నేహా శెట్టి కీలకపాత్రలో నటించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు.

TG: మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న CSK, HYD మ్యాచును వీక్షిస్తున్నారు. దీంతో ఇద్దరి ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ రైతుల సమస్యలు తెలుసుకుంటుంటే, రేవంత్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని మండిపడుతున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ మరో మ్యాచ్‌కు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదని సమాచారం. దీంతో వచ్చే ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు కుల్దీప్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన NCA పర్యవేక్షణలో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా అతడి గాయం పూర్తిగా మానితేనే బరిలోకి దించాలని బీసీసీఐ కూడా భావిస్తున్నట్లు సమాచారం.

కొన్ని నెలలుగా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతుండగా, భారత్ కూడా భారీగా కొనుగోలు చేస్తోంది. రెండేళ్లలోనే అత్యధికంగా ఈ జనవరిలో ఏకంగా 8.7 టన్నుల పసిడిని RBI కొనడంతో నిల్వ 812.3 టన్నులకు చేరింది. ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడంలో భాగంగానే గోల్డ్ కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

AP: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జైభారత్ నేషనల్ పార్టీ 12 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ నుంచి పోటీ చేయనున్నారు. సీపీఐ గుంటూరు పార్లమెంట్ స్థానంతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.

AP: రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 8.45 గంటలకు యాగశాల ప్రవేశం చేసి పూజలు ప్రారంభించనున్నారు. మహోత్సవాల సందర్భంగా స్వామివారి స్పర్శ దర్శనం రద్దు చేశారు. కాగా ఇప్పటికే లక్షలాది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. దీంతో ఆలయం, సత్రాలు, హోటళ్లు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

ఉగాది రోజున (APR 9) ఏ పనులు చేయాలనేది పురాణాల ద్వారా తెలుస్తోంది. పండుగ రోజు ఏ పనైతే చేస్తామో అదే పనిని ఏడాదంతా చేస్తామని పెద్దలు చెబుతుంటారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. దేవుడిని ఆరాధించి, సూర్య నమస్కారం చేయాలి. ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలి. పేదలకు తోచిన సాయం అందించాలి. ఉగాది పచ్చడి చేసుకుని తినాలి. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలుగు ప్రజల నమ్మకం.

అమెరికాలో భూకంపం సంభవించింది. న్యూ జెర్సీ, న్యూ యార్క్ నగరాల్లో భూప్రకంపనలు వచ్చాయి. న్యూ జెర్సీలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. అమెరికా కాలమానం ప్రకారం ఉ.10.20 గంటలకు భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
Sorry, no posts matched your criteria.