News October 3, 2024

సురేఖ‌పై పరువు నష్టం దావా వేసిన నాగార్జున

image

నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొన్నారు.

News October 3, 2024

రేడియోలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు

image

యూపీలోని గజ్రౌలాకు చెందిన రామ్ సింగ్ 1,257 యూనిక్ రేడియోలను కలిగి ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కారు. ఇవి 1920 నుంచి 2010 మధ్య కాలంలోనివని ఆయన తెలిపారు. రామ్ సింగ్ వద్ద మొత్తం 1,400 రేడియోలు ఉండగా వీటిలో 1,257 ప్రత్యేకమైనవని గుర్తించారు. వీటిని ఢిల్లీ, మీరట్‌లో కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తు తరాలకు రేడియో గురించి తెలియజేసేందుకు వీటిని సేకరించినట్లు రామ్ సింగ్ పేర్కొన్నారు.

News October 3, 2024

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News October 3, 2024

సద్గురు పాదం ఫొటో ఒక్కోటి ₹3,200.. నెటిజన్ల ఫైర్

image

సద్గురు జ‌గ్గీ వాసుదేవ్ పాదాల ఫొటో ఒక్కోటి ₹3,200కి ఈషా ఫౌండేష‌న్ వెబ్‌సైట్‌లో విక్ర‌యానికి ఉంచడంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స‌ద్గురు పాదాల ఫొటో కోసం రూ.3,200 చెల్లించ‌డానికి మీ జీవితంలో ఏం త‌ప్పు జ‌ర‌గాల్సి ఉందంటూ ఒకరూ, మోడ్ర‌న్ బాబాలు ధ‌ర్మాన్ని మార్కెట్‌లో వ‌స్తువులా మార్చేశార‌ని మరొకరు విమ‌ర్శిస్తున్నారు. ఇదొక మోడ్రన్ చర్య అని, ఫొటోపై రివ్యూలు కూడా ఇస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.

News October 3, 2024

రేపటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు: TTD ఈవో

image

AP: తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వాహన సేవలు ఉ. 8గంటలకు, రాత్రి 7గంటలకు నిర్వహిస్తామని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. 8వ తేదీ రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుందని పేర్కొన్నారు. 3.5 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. 7లక్షల లడ్డూలు సిద్ధం చేశామన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 4 నుంచి 12వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు చెప్పారు.

News October 3, 2024

దీన్ని అస్సలు అంగీకరించలేం: విజయ్

image

సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను హీరో విజయ్ దేవరకొండ ఖండించారు. ‘నేటి రాజకీయ నాయకుల ప్రవర్తనపై మంచి భాషలో మాట్లాడేందుకు కష్టపడుతున్నా. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ప్రజా శ్రేయస్సు, విద్యను మెరుగుపరచడానికే మేము మీకు ఓట్లు వేస్తామని రాజకీయ నాయకులకు గుర్తుచేస్తున్నా. కానీ ఇప్పుడు జరిగిన దాన్ని అస్సలు అంగీకరించలేం. రాజకీయాలు దిగజారకూడదు’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

‘దళపతి69’లో గౌతమ్ మీనన్, ప్రియమణి

image

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబోలో తెరకెక్కనున్న ‘దళపతి 69’ సినిమాలో నటీనటులను మేకర్స్ రివీల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలిపారు. తాజాగా డైరెక్టర్- యాక్టర్ గౌతమ్ మీనన్‌తో పాటు నటి ప్రియమణి నటిస్తున్నట్లు వెల్లడిస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ‘విజయ్ సర్‌తో నటించే అవకాశం లభించినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది’ అని ప్రియమణి ట్వీట్ చేశారు.

News October 3, 2024

డబ్బులిచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారు: మంత్రి పొంగులేటి

image

TG: మూసీ ఆక్రమణల కూల్చివేతల విషయంలో కొందరు డబ్బులిచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. దీనికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సమన్వయంతో ముందుకెళతామని చెప్పారు. పేదలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లే దిశగా ఇందిరమ్మ ఆశయ సాధనలో సాగుతామన్నారు.

News October 3, 2024

గజ్జల వెంకటలక్ష్మి పిటిషన్ కొట్టివేత

image

AP: తనను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గజ్జల వెంకటలక్ష్మి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గత నెల 23న ఆమెను పదవి నుంచి GOVT తొలగించింది. పదవీకాలం ముగియకముందే తొలగించారంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమితులయ్యారని, AUGతో పదవీ కాలం ముగిసిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు.

News October 3, 2024

Stock Market: యుద్ధ భయాలు.. భారీ నష్టాలు

image

మిడిల్ ఈస్ట్‌లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఒక్క రోజే 2 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ 1,769 పాయింట్లు న‌ష్ట‌పోయి 82,497 వ‌ద్ద‌, నిఫ్టీ 546 పాయింట్లు న‌ష్ట‌పోయి 25,250 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. భారీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన సూచీలు ఉద‌యం మొద‌టి 30 నిమిషాలు కోలుకొనే ప్ర‌య‌త్నం చేసినా అప్పటికే సెంటిమెంట్ బ‌ల‌హీన‌ప‌డ‌డంతో అమ్మ‌కాలు జోరందుకున్నాయి.