News April 1, 2024

చంద్రబాబుకు పెన్షనర్ల ఓట్లు పడవు: మల్లాది

image

AP: వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబు భయపడిపోతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. టీడీపీకి పెన్షనర్ల ఓట్లు పోవడం ఖాయమని చెప్పారు. ‘ఈసీకి ఫిర్యాదులు చేసి పెన్షన్లు ఆపింది టీడీపీ నేతలే. ఇప్పుడు త్వరగా ఇవ్వాలంటూ గొడవలు చేస్తోంది వాళ్లే. వృద్ధులు మూడు నెలల పాటు సచివాలయంకి వెళ్లి పెన్షన్లు తీసుకునేలా చంద్రబాబు చేశారు. ప్రజలకు, సచివాలయం సిబ్బందికి క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

News April 1, 2024

ఏప్రిల్ 1: చరిత్రలో ఈరోజు

image

1578: రక్తప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం
1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ జననం
1941: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ జననం
2022: తెలుగు చిత్ర దర్శకుడు శరత్ మరణం
1935: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన
1936: ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

News April 1, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 01 , సోమవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:58
సూర్యోదయం: ఉదయం గం.6:11
జొహర్: మధ్యాహ్నం గం.12:20
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:29
ఇష: రాత్రి గం.07.42
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 1, 2024

జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల

image

జేఈఈ మెయిన్స్-2024 పేపర్ 1(బీఈ/బీటెక్) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు హాల్‌ టికెట్లను http://jeemain.nta.ac.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News April 1, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 1, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

News April 1, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 01, సోమవారం
బహుళ సప్తమి: రాత్రి 09:10 గంటలకు
మూల: రాత్రి 11:12 గంటలకు
దుర్ముహూర్తం: 1)మధ్యాహ్నం 12:35- 01:24 గంటల వరకు
2)మధ్యాహ్నం 03:01 నుంచి 3:50 గంటల వరకు
వర్జ్యం: రాత్రి 9:35-11.12 గంటల వరకు

News April 1, 2024

TODAY HEADLINES

image

✒ TG: ఏప్రిల్ 6 నుంచి బీఆర్ఎస్ నేతల దీక్షలు: కేసీఆర్
✒ కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, కావ్య
✒ పార్లమెంటు స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన కాంగ్రెస్
✒ AP: రాష్ట్ర ప్రజల కోసమే తగ్గాను: పవన్ కళ్యాణ్
✒ ప్రజలంతా ప్రభుత్వ బాధితులే: పురందీశ్వరి
✒ కూటమికి ఓటమి తప్పదు: పేర్ని నాని
✒ బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది: షర్మిల
✒ అద్వానీకి భారత రత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి

News March 31, 2024

IPL: సీఎస్కేకు షాకిచ్చిన ఢిల్లీ

image

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచులో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. వార్నర్, పంత్ అర్ధ సెంచరీలు చేయడంతో 192 పరుగులు చేసింది. ఛేదనలో సీఎస్కే 171 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో ధోనీ(16 బంతుల్లో 37*) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది తొలి ఓటమి కాగా ఢిల్లీకి మొదటి విజయం.

News March 31, 2024

‘వార్2’లో మరో తెలుగు నటుడు?

image

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో రానున్న ‘వార్2’ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నటుడు జగపతిబాబు నటిస్తున్నట్లు తెలుస్తోంది. తారక్‌కు తండ్రి పాత్రలో ఆయన నటిస్తున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. జాన్ అబ్రహం విలన్‌గా కనిపించనున్నట్లు టాక్.