News March 31, 2024

పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే..(2/2)

image

TG: భువనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్-సంపత్ కుమార్, చేవెళ్ల-నరేందర్ రెడ్డి, మల్కాజిగిరి-మైనంపల్లి హనుమంత రావు, మెదక్-కొండా సురేఖ, నిజామాబాద్-సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్-సీతక్క, జహీరాబాద్-దామోదర రాజ నర్సింహ, నాగర్ కర్నూల్-జూపల్లి కృష్ణారావు.

News March 31, 2024

డీకే శివకుమార్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలోని తన ఆఫీసును కాంగ్రెస్ కార్యాలయంలా డీకే వాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. నిన్న ఆ కార్యాలయంలో నజ్మా నజీర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.

News March 31, 2024

పంత్ ఈజ్ బ్యాక్

image

లాంగ్ గ్యాప్ తర్వాత క్రికెట్ ఆడుతున్న ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ సత్తా చాటారు. చెన్నైతో మ్యాచులో తనదైన షాట్లు బాదుతూ అర్ధ సెంచరీ చేశారు. దీంతో గాయం తర్వాత పంత్ ఆటపై వస్తున్న విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెప్పారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 31 బంతుల్లో ఫిఫ్టీ చేసిన పంత్ తన ఇన్నింగ్సులో 3 సిక్సర్లు, 4 ఫోర్లు బాదడం గమనార్హం.

News March 31, 2024

రేపు కవిత పిటిషన్‌పై విచారణ

image

TG: BRS MLC కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రేపు విచారించనుంది. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలంటూ ఆమె గతంలో కోర్టును ఆశ్రయించగా.. విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. దీంతో రేపు కోర్టులో కవితకు ఊరట లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

News March 31, 2024

IPL: ఢిల్లీ భారీ స్కోరు

image

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. వార్నర్, పంత్ అర్ధసెంచరీలతో రెచ్చిపోవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. CSK బౌలర్లలో పతిరణ 3, జడేజా, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు. చెన్నై టార్గెట్ 192.

News March 31, 2024

అభిమానం అంటే ఇలానే ఉంటుంది

image

దాదాపు ఏడాదిన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషభ్ పంత్‌పై ఫ్యాన్స్‌లో అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. వైజాగ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్యాన్స్ తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. ‘నీవెప్పుడూ ఒంటరి కావు’ అని అర్థం వచ్చేలా ఉన్న పంత్ పోస్టర్‌ను ప్రదర్శించారు. అభిమానం అంటే ఇలానే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News March 31, 2024

తండ్రి కాబోతున్న భారత స్టార్ క్రికెటర్?

image

భారత స్టార్ క్రికెటర్ KL రాహుల్, నటి అతియా శెట్టి(సునీల్ కుమార్తె) తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త వైరల్ అవుతోంది. ‘డాన్స్ దీవానే’ ప్రోగ్రామ్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ దీనికి బలం చేకూరుస్తున్నాయి. ‘వచ్చే సీజన్‌లో నేను తాతలాగా వేదికపై నడుస్తాను’ అని తాతయ్యల స్పెషల్ ఎపిసోడ్‌లో సునీల్ శెట్టి అనడంతో ఈ ప్రచారం మొదలైంది. కాగా 2023 జనవరిలో రాహుల్-అతియా పెళ్లైంది.

News March 31, 2024

గేల్ రికార్డు సమం చేసిన వార్నర్

image

ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్‌లో రికార్డు సృష్టించారు. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన అర్ధ సెంచరీ బాదారు. దీంతో కలుపుకుని ఆయన ఇప్పటివరకు 110 ఫిఫ్టీలు సాధించారు. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసకవీరుడు క్రిస్ గేల్ (110) రికార్డును సమం చేశారు. కాగా వార్నర్ ఐపీఎల్‌లో 62 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆయన ఖాతాలో 4 శతకాలు కూడా ఉన్నాయి.

News March 31, 2024

వర్మ గారికి మర్యాద తగ్గకుండా చూస్తా: పవన్

image

AP: పిఠాపురంలో తన పోటీకి మద్దతిచ్చిన TDP నేత వర్మను జనసేన అధినేత పవన్ ప్రశంసించారు. ‘చంద్రబాబు గీసిన గీత దాటను అని వర్మ చెప్పడం నాకు ఆనందం కలిగించింది. నా గెలుపునకు బాధ్యత తీసుకున్న ఆయనకు.. నేను గెలిచిన తర్వాత మర్యాద, గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటా. ఒంటెద్దు పోకడలకు పోను. పిఠాపురం అభివృద్ధికి ఏం చేయాలన్న దానిపై 3 పార్టీల నాయకులం ఎప్పటికప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పవన్ వెల్లడించారు.

News March 31, 2024

వేసవిలో ఫోన్ వేడెక్కుతోందా.. ఈ టిప్స్ పాటించండి!

image

మొబైల్స్ సాధారణంగా హీటెక్కుతుంటాయి. వేసవిలో మరింత వేడెక్కి ఇబ్బంది కలిగిస్తాయి. అలా కాకూడదంటే ఈ టిప్స్ పాటించండి.
✦ వేసవిలో బయట తిరిగేటప్పుడు ఫోన్‌కు సూర్యకాంతి తగలకుండా జాగ్రత్తపడండి
✦ కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడాలి
✦ బ్లూటూత్‌, లోకేషన్‌ సర్వీసెస్‌ వంటి ఫీచర్లు ఎప్పుడూ ఆన్‌లో ఉంచకూడదు
✦ అనవసరపు యాప్‌లు డిలీట్ చేయాలి
✦ పవర్ సేవ్ మోడ్‌ను ఆన్‌లో పెట్టాలి
✦ ఫోన్ కవర్‌ ఉపయోగించకపోవడమే మంచిది