India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలను సినీ నటి గాయత్రి గుప్తా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘మా నాన్నకు ఐదుగురు కుమార్తెలం. ఆయనకు అబ్బాయి కావాలని ఉండేది. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నా అమ్మాయే పుట్టింది. అప్పటినుంచి నన్ను చీపురు, చెప్పులు, వైర్లతో కొట్టి కారం వేసేవాడు. మేం రిచ్ అయినా పాకెట్ మనీ ఇవ్వలేదు. నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా మా నాన్నలాంటివాడే. అందుకే విడాకులు ఇచ్చా’ అంటూ చెప్పుకొచ్చారు.
హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాత నాగవంశీ నిర్మిస్తారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్. కాగా విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ మూవీ ఇటీవల విడుదలై మిక్స్‌డ్ టాక్ అందుకుంది. మరోవైపు హరీశ్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీని తెరకెక్కిస్తున్నారు.
TG: వేతనాలు పెంచాలని సినీ కార్మికులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా రేపటి నుంచి చిత్రీకరణలు పూర్తిగా నిలిపేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే 2 రోజులు సమయమిస్తామని, ఆ తర్వాత అవి కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈరోజు జరిగే చర్చలపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన వేతనాల కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
AP: ఈ నెల 12న జరిగే పులివెందుల ZPTC ఉపఎన్నికను TDP, YCP ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఇరు పార్టీలు నువ్వా నేనా అనేలా వ్యూహాలు రచిస్తున్నాయి. జగన్‌కు కంచుకోటైన స్థానంలో తమ పట్టు నిలుపుకునేందుకు ఓటుకు ₹10,000 ఇచ్చేందుకు లీడర్లు సిద్ధమైనట్లు సమాచారం. పులివెందులతో పాటు ఒంటిమిట్ట ZPTCలను గతంలో YCPనే గెలవగా, తిరిగి కైవసం చేసుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తోంది.
AP: గత ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో జరిగిన స్కామ్‌పై విచారణ ముగిసింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును త్వరలో విజిలెన్స్ అధికారులు డీజీపీకి సమర్పించనున్నారు. కాగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్స్, ఈవెంట్స్ పేరిట అవినీతి జరిగిందనే ఆరోపణలతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
ఇటీవల 30 ఏళ్లలోపు యువతలోనూ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఆడుతూ, జిమ్, డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోతున్నారు. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, సిగరెట్, మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం కూడా గుండెపోటు మరణాలకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
TG: పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న రూల్‌ను రద్దు చేసే ఛాన్సున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు చర్చ మొదలైంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో దాయాది పాక్‌తో భారత సైన్యం చెస్ ఆడిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. శత్రు కదలికలు తెలియనప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ ఆ దేశానికి చెక్ పెట్టామన్నారు. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు చెప్పారు. దీంతో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. కాగా పాక్‌కు చెందిన 5 ఫైటర్ జెట్లు, ఓ విమానాన్ని కూల్చేశామని IAF చీఫ్ <<17350664>>చెప్పిన<<>> విషయం తెలిసిందే.
రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడాలని సంజూ <<17338073>>శాంసన్<<>> నిర్ణయించుకోవడానికి కారణం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది IPLలో RR ఓపెనర్‌గా దిగిన అతడు విధ్వంసం సృష్టించారు. ఇకపైనా వైభవ్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని యాజమాన్యం నిర్ణయించుకుందని సమాచారం. దీంతో అప్పటివరకు యశస్వీతో కలిసి ఓపెనింగ్ చేసిన సంజూకు మొండిచేయి ఎదురైంది. అందుకే అతడు జట్టును వీడాలనుకుంటున్నట్లు సమాచారం.
TG: ఆదివాసీ బిడ్డలకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా ఉన్నత విద్యను అందించనున్నట్లు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ VC ఘంటా చక్రపాణి తెలిపారు. ‘ఆదివాసీలకు చదువును చేరువ చేయాలని ప్రణాళిక రూపొందించాం. ఉచితంగా చదువు చెప్తాం. గోండు, కోయ, చెంచు తదితర తెగల వారికి ఫీజు లేకుండా కేవలం రూ.500తోనే అడ్మిషన్, పుస్తకాలు అందిస్తాం’ అని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 040-23680333, 23680555 నంబర్లను సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.