News July 3, 2024

కొత్త టీచర్లు ఆగస్టులోనే: విద్యాశాఖ అధికారి

image

TG: డీఎస్సీ ద్వారా నియమితులయ్యే కొత్త టీచర్లు ఆగస్టులోనే వస్తారని విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు DSC జరగనుంది. మరోవైపు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. బదిలీలు, పదోన్నతుల్లో సమస్యలతో పాటు అనారోగ్య, ఇతర కారణాలను పోర్టల్‌లో నమోదు చేసుకోని పరిష్కరించుకోవచ్చన్నారు.

News July 3, 2024

పట్టిసీమ నుంచి నేడు నీరు విడుదల

image

AP: రాయలసీమ, కృష్ణా డెల్టాలకు సాగు, తాగు నీరు అందించేందుకు పట్టిసీమ నుంచి ఇవాళ ఉదయం నీరు విడుదల చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ నుంచి 7 వేల క్యూసెక్కులు, తాడిపూడి ఎత్తిపోతల నుంచి 870, పురుషోత్తపట్నం నుంచి 3500, పుష్కర నుంచి 1225 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. ఎగువ నుంచి వరద జలాలు రాకపోవడంతో కృష్ణా నదీ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటాయన్నారు.

News July 3, 2024

నేరాలకు పాల్పడితే వారికి క్షమాభిక్ష రద్దు

image

TG: నిన్న రాష్ట్ర ప్రభుత్వం 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసిందే. ఒకవేళ తిరిగి నేరాలకు పాల్పడితే వారికి క్షమాభిక్ష రద్దవుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 26నే ఈ ఉత్తర్వులు ఇవ్వాలని భావించినా కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఈ క్రమంలో ఖైదీల కుటుంబ సభ్యులు CM రేవంత్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో వారి విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News July 3, 2024

ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి

image

TG: రాష్ట్రంలో చిన్నారులపై వీధి కుక్కల దాడి <<13554509>>ఘటనలు<<>> తరచూ జరుగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయట్లేదని, సరైన ఆహారం లేక మనుషులపై దాడి చేస్తున్నాయని ఓ పిల్ దాఖలైంది.

News July 3, 2024

ఆగస్టులో నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష?

image

నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో నీట్-పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నిర్వహించిన భేటీలో ఆరోగ్యశాఖ, సైబర్ సెల్, ఇతర అధికారులు, ప్రతినిధులు పరీక్ష సన్నద్ధతపై చర్చించారు. కాగా పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ఎగ్జామ్ నిర్వహించే 2గంటల ముందు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News July 3, 2024

రేపటి నుంచి సదరం స్లాట్ బుకింగ్

image

AP: వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఇందుకోసం మీసేవా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.

News July 3, 2024

రేపు స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపు

image

నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్‌లో పాల్గొని, తరగతులు బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు తెలియజేయాలని కోరాయి.

News July 3, 2024

అసైన్డ్ భూముల చట్టం రద్దు చేయాలని వినతి

image

AP: అసైన్డ్ భూములు 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చంటూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కోరింది. ఈ మేరకు సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌‌కు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు వినతిపత్రం అందజేశారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు భూమి లేని వారికే భూపంపిణీ చేయాలన్నారు.

News July 3, 2024

ఇసుక విధానం అమలుపై కీలక సమావేశం

image

AP: నూతన ఇసుక పాలసీపై అధికారులతో CM చంద్రబాబు కూలంకషంగా చర్చించారు. వర్షాకాలం కావడంతో నదుల్లో వరదొస్తే తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. కాగా ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే ఆన్‌లైన్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందిస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నట్లు సమాచారం.

News July 3, 2024

18,526 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

image

AP: కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరకు పట్టుకున్న 15,396 టన్నుల(రూ.43.43 కోట్ల) రేషన్ బియ్యానికి ఈ సరుకు అదనం. కాగా కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ మాఫియా అవినీతికి పాల్పడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వీటిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.