India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.

TG: హైదరాబాద్‌లో రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలపై నగర పోలీసులు స్పందించారు. ‘సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి. దుకాణాలు, సంస్థలు తెరిచే మరియు మూసివేసే సమయాలు ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయి. ఇది అందరూ గమనించగలరు’ అని ట్వీట్ చేశారు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే రోజు మూడు రికార్డులు బ్రేక్ చేశారు. ఇవాళ ఆస్ట్రేలియాపై ఊచకోతతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(4,165) చేసిన ఆటగాడిగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్(4,145), కోహ్లీ (4,103) ఉన్నారు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు(132vsAUS) బాదిన ప్లేయర్‌గా నిలిచారు. T20Iల్లో 200 సిక్సర్లు బాదిన మొదటి ఆటగాడిగానూ రోహిత్ చరిత్ర సృష్టించారు.

AP: ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి- 2898AD’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ <<13492922>>ప్రభుత్వం<<>> అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2వారాల పాటు సింగిల్ స్క్రీన్‌లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.125 మేర పెంచుకోవచ్చంది. అలాగే రోజుకు ఐదు షోలు వేసేందుకు కూడా అనుమతిచ్చింది. కాగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను పెంచింది. ఈ నెల 27న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

AP: సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై బదిలీ వేటు పడింది. సాధారణ పరిపాలన శాఖ(GAD)లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. ఇటీవల బదిలీల్లో వ్యవసాయ, గనుల శాఖ నుంచి కార్మికశాఖకు ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యారు. గతంలో సచివాలయాలకు పార్టీ రంగులు వేయడం సహా పలు అంశాల దృష్ట్యా ఆయన్ను GADకు అటాచ్ చేసింది.

TG: ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ ఆయనతో పాటు ఉన్నారు. నిన్న జగిత్యాల ఎమ్మెల్యేను సీఎం రేవంత్ పార్టీలోకి ఆహ్వానించగా, మరో 20 మంది MLAలు తమతో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ చేరికలతో కాంగ్రెస్ బలం 64 నుంచి 70కి చేరింది.

AP: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను నామినేటెడ్ పదవులతో గౌరవిస్తామని CM చంద్రబాబు తెలిపారు. TDP నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకుని పోరాడటం వల్లే ఘనవిజయం సాధ్యమైంది. కూటమి కోసం కష్టపడిన వారి పేర్లు సేకరిస్తున్నాం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కార్యకర్తలను వేధించిన YCP నేతలకు TDPలోకి నో ఎంట్రీ’ అని వెల్లడించారు.

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో వార్సెస్టర్‌షైర్(WOR) ప్లేయర్ డాన్ లారెన్స్ రెచ్చిపోయారు. సర్రేతో జరుగుతున్న మ్యాచులో ఇన్నింగ్స్ 128వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో 5 సిక్సర్లు బాదారు. ఈ ఓవర్లో ఎక్స్‌ట్రాలతో కలుపుకుని ఏకంగా 38 పరుగులు వచ్చాయి. లారెన్స్ 223 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 పరుగులు చేశారు. కాగా WOR తొలి ఇన్నింగ్సులో 490 పరుగులు చేయగా సర్రే 4 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది.

T20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచులో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్(92) విధ్వంసానికి తోడు సూర్య(31) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ తలో 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు. AUS టార్గెట్ 206 పరుగులు.

టీ20ల్లో ఫాస్టెస్ట్ 50s చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ చేరారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో 19 బంతుల్లో 50రన్స్ చేసిన రోహిత్.. గంభీర్(Vs శ్రీలంక, 2009) రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు. 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో ఆయన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత 18 బంతుల్లో KL రాహుల్(Vs స్కాట్లాండ్), సూర్యకుమార్(Vs SA) ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేశారు.
Sorry, no posts matched your criteria.