News June 27, 2024

రేవంత్‌ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని విరమించుకోవడం విచారకరం: KTR

image

2014-2023 మధ్య తాము ప్రతి ఏడాది జూన్ 2న IT, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల వార్షిక నివేదికలను విడుదల చేశామని KTR గుర్తుచేశారు. ‘ఈ నివేదికలు రాష్ట్రం సాధించిన విజయాలను గర్వంగా ప్రదర్శించాయి. ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేయడమే దీని ఉద్దేశం. కానీ రేవంత్‌ సర్కార్ ఈ సంప్రదాయాన్ని విరమించుకుంది. 2023-24 వార్షిక నివేదికలను విడుదల చేయకపోవడం విచారకరం’ అని ట్వీట్ చేశారు.

News June 27, 2024

రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా తీర్పిచ్చారు: రాష్ట్రపతి

image

కొత్తగా ఎన్నికైన ఎంపీలకు రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలిపారు. ‘ఎన్నికలు నిర్వహించిన ఈసీకి అభినందనలు. దేశ ప్రజలు మూడోసారి మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా తీర్పిచ్చారు. పదేళ్ల పాలనలో గ్రామీణ వ్యవస్థ పరిపుష్టమైంది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరాయంగా పని చేస్తోంది’ అని పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు.

News June 27, 2024

మా ప్రభుత్వం ₹12,922 కోట్ల అప్పు తీర్చింది: టీ కాంగ్రెస్

image

CMగా KCR పదేళ్ల కాలంలో ₹7లక్షల కోట్ల అప్పులు చేశారని T కాంగ్రెస్ ట్వీట్ చేసింది. వాటిపై వడ్డీలు కట్టడానికే ప్రస్తుత ప్రభుత్వం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ‘2014లో అప్పు ₹62వేల కోట్లు. KCR దిగిపోయే నాటికి ₹7లక్షల కోట్లకు చేరింది. 2023 DEC 7 నుంచి 2024 JUNE 17 వరకు మా ప్రభుత్వం ₹25,118cr అప్పు తెచ్చింది. ₹38,040cr అప్పు తిరిగి కట్టింది. అంటే ₹12,922cr అప్పు తీర్చింది’ అని తెలిపింది.

News June 27, 2024

బుల్ జోరు.. సెన్సెక్స్@79000

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త రికార్డులను సృష్టించాయి. సెన్సెక్స్ 79వేల మార్క్ తాకి ఆల్ టైమ్ హై నమోదు చేసింది. మరోవైపు నిఫ్టీ సైతం 23,974 చేరి సరికొత్త గరిష్ఠాలను తాకింది. అయితే కోల్ ఇండియా, LT, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్ వంటి బడా షేర్లు నష్టాలను నమోదు చేయడంతో మార్కెట్లు ఒడుదొడుకులకు గురవుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 73 పాయింట్ల లాభంతో 78,751 వద్ద ట్రేడవుతోంది.

News June 27, 2024

కస్టడీలోనూ నటి మేకప్.. మహిళా SIకి నోటీసులు

image

రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు, కన్నడ నటి పవిత్ర గౌడ పోలీస్ కస్టడీలోనూ మేకప్ వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. విచారణలో భాగంగా ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పవిత్రను ఒకరోజు బెంగళూరులోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఆ గ్యాప్‌లో లిప్‌స్టిక్, మేకప్ వేసుకున్న ఆమె నవ్వుతూ ఇంటి నుంచి బయటికి వచ్చారు. దీంతో మేకప్‌కు అనుమతించిన మహిళా ఎస్సైకి కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు.

News June 27, 2024

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు

image

T20WC 2వ సెమీఫైనల్‌లో ఈ రోజు ఇంగ్లండ్‌ను భారత్ ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో గత T20WCలో ఇండియాVSఇంగ్లండ్‌ మ్యాచ్‌ పలువుర్ని కలవరపెడుతోంది. అందులో ఇంగ్లండ్ ఓపెనర్లే లక్ష్యాన్ని ఛేదించారు. అయితే టీమ్ఇండియాలో అప్పటికి, ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు బుమ్రా, జడేజా, కుల్దీప్ చేరికతో బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్‌లో స్టోక్స్, వోక్స్, హేల్స్ వంటి అనుభవజ్ఞులు లేరు.

News June 27, 2024

శ్రీనివాసుడి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,332 మంది దర్శించుకోగా 30,540 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు లభించింది.

News June 27, 2024

కీలక నిర్ణయం.. పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకోనున్న ప్రభుత్వం

image

AP: YCP హయాంలో జగన్ ఫొటోతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని GOVT నిర్ణయించింది. పంపిణీ చేసిన 20.19లక్షల భూహక్కు పత్రాలు, పంచాల్సిన మరో లక్ష పత్రాలను నిలిపివేశారు. దీనిపై అధికారులతో మంత్రి సత్యప్రసాద్ చర్చించారు. అందరికీ కలిపి కొత్త పాస్ పుస్తకాలివ్వాలని నిర్ణయించారు. రాజముద్రతో కొత్త పుస్తకాల డిజైన్లను తయారు చేసి, CM చంద్రబాబు ఆమోదం తర్వాత పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు.

News June 27, 2024

కస్టడీలో బెల్ట్ అనుమతించండి: కేజ్రీవాల్

image

CM కేజ్రీవాల్‌కి రౌస్ అవెన్యూ కోర్టు 3రోజుల CBI కస్టడీ విధించడం తెలిసిందే. కాగా కస్టడీలో తనకు బెల్ట్ అనుమతించాలని కేజ్రీవాల్ కోరారు. తన బెల్ట్ అధికారులు తీసుకోవడంతో తిహార్ జైలుకు వెళ్లేటప్పుడు ప్యాంటు చేతితో పట్టుకోవాల్సి వచ్చిందని, అది ఇబ్బందిగా ఉందని వివరించారు. బెల్టుతో పాటు కళ్లద్దాలు, మెడిసిన్, ఇంటి భోజనం, భగవద్గీతనూ కోర్టు అనుమతించింది. అలాగే భార్య, బంధువులను రోజూ గంటపాటు కలవొచ్చంది.

News June 27, 2024

నిలకడగా అద్వానీ ఆరోగ్యం

image

అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె.అద్వానీ(96) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మూడు నెలల క్రితం ఆయనను కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించింది.