News June 27, 2024

ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ&రేటింగ్

image

మహాభారతం, సైన్స్ ఫిక్షన్, భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుంచారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎక్స్‌ట్రార్డినరీగా తీర్చిదిద్దారు. అద్భుతమైన VFXతో మరో ప్రపంచంలో ఉన్న ఫీల్ వస్తుంది. యాక్షన్ సీన్లు, క్లైమాక్స్ అదిరిపోయాయి. ఈ యాక్షన్ డ్రామాకు ఎమోషన్ యాడ్ చేస్తే మూవీ మరో స్థాయికి చేరేది. ప్రభాస్ ఎక్కువసేపు కనిపించకపోవడం కాస్త మైనస్.
RATING: 3/5

News June 27, 2024

రేపు వరంగల్, హనుమకొండలో సీఎం రేవంత్ పర్యటన

image

TG: సీఎం రేవంత్‌రెడ్డి రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో జరిగే వనమహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్ట్, కాళోజీ కళాక్షేత్రం తదితర అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత కాకతీయ మెగా జౌళి పార్కు, నయీంనగర్ నాలా తదితర ప్రాంతాలను సందర్శించనున్నారు.

News June 27, 2024

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

image

కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. జీరో FIR ప్రకారం ఏ వ్యక్తి అయినా PS పరిధితో సంబంధం లేకుండా ఏ PSలోనైనా ఫిర్యాదు చేయొచ్చు. మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తు 2నెలల్లో పూర్తి చేయాలి.

News June 27, 2024

2, 3 రోజుల్లో డీఎస్సీ పూర్తి షెడ్యూల్?

image

తెలంగాణలో డీఎస్సీ పూర్తి షెడ్యూల్‌ను 2, 3 రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించిన తేదీల్లోనే (జులై 17-జులై 31) జరుగుతాయని స్పష్టం చేశారు. అభ్యర్థులకు తమ సొంత జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. డీఎస్సీ దరఖాస్తుల గడువు ఈనెల 20తో ముగియగా, 2.79 లక్షల దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే.

News June 27, 2024

BREAKING: ఫైనల్‌కు సౌతాఫ్రికా

image

T20WC: అఫ్గానిస్థాన్ ఆశలు గల్లంతయ్యాయి. సెమీఫైనల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన సౌతాఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది. అఫ్గాన్ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. డికాక్ (5) ప్రారంభంలోనే ఔట్ అయినా కెప్టెన్ మార్క్రమ్ (23*), హెండ్రిక్స్ (29*) తమ జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటర్ల ఘోర వైఫల్యంతో అఫ్గాన్ 56 పరుగులకే ఆలౌట్ అయింది.

News June 27, 2024

ఇంజినీర్లు చెప్పినా కేసీఆర్ వినలేదు: కోదండరాం

image

TG: మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టడం మంచిది కాదని ఇంజినీరింగ్ కమిటీ చెప్పినా అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని TJS అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నిపుణుల సూచనలు పెడచెవిన పెట్టడం, డిజైన్ ప్రకారం నిర్మించకపోవడం, నిర్వహణ లోపంతో మేడిగడ్డ కుంగిందని డ్యాం సేఫ్టీ అధికారులు కూడా తేల్చారని తెలిపారు. ఇప్పటికైనా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించే అంశాన్ని సర్కార్ పున:పరిశీలించాలని కోదండరాం కోరారు.

News June 27, 2024

చేతిరాత బిల్లులకు చెల్లు.. ఇక ఆన్‌లైన్ పర్మిట్లే

image

AP: గనుల శాఖలో, ఇసుక అమ్మకాల్లో ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లు చేతిరాతతో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం అంటోంది. దీంతో గత టీడీపీ హయాంలో ఉన్న ఆన్‌లైన్ విధానాన్నే తీసుకురానున్నారు. ఈ మేరకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇటు సీవరేజి వసూళ్ల కాంట్రాక్టర్లూ ఆన్‌లైన్ పర్మిట్లే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

News June 27, 2024

హెల్మెట్ లేకుంటే ఉపేక్షించొద్దు: హైకోర్టు సీరియస్

image

AP: వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాల దృష్ట్యా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలంది. ట్రాఫిక్ పోలీసులు బాడీవోర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరముందని పేర్కొంది. వాహన చట్ట నిబంధనలను అమలు చేసేందుకు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈ అంశంపై పిటిషన్ వేసిన వ్యక్తిని అభినందించింది.

News June 27, 2024

నేడు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం

image

కొత్తగా కొలువుదీరిన లోక్‌సభతో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే ముర్ముకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ స్వాగతం పలుకుతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 87ప్రకారం లోక్‌సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది.

News June 27, 2024

విద్యుత్ వినియోగదారుల కోసం కొత్త సదుపాయం

image

TG: కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానాలున్న వినియోగదారుల కోసం దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ ఓ సదుపాయాన్ని తీసుకొచ్చింది. <>వెబ్‌సైట్‌లో<<>> విద్యుత్ ఛార్జీలను తెలుసుకునేందుకు వీలుగా ‘ఎనర్జీ ఛార్జెస్ కాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్’ అనే సర్వీసును ప్రారంభించింది. దీని కోసం రీడింగ్ తేదీలు, యూనిట్ల వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉత్తర డిస్కం వినియోగదారులూ దీనిని వినియోగించుకోవచ్చు.