India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టడం మంచిది కాదని ఇంజినీరింగ్ కమిటీ చెప్పినా అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని TJS అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నిపుణుల సూచనలు పెడచెవిన పెట్టడం, డిజైన్ ప్రకారం నిర్మించకపోవడం, నిర్వహణ లోపంతో మేడిగడ్డ కుంగిందని డ్యాం సేఫ్టీ అధికారులు కూడా తేల్చారని తెలిపారు. ఇప్పటికైనా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించే అంశాన్ని సర్కార్ పున:పరిశీలించాలని కోదండరాం కోరారు.

AP: గనుల శాఖలో, ఇసుక అమ్మకాల్లో ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లు చేతిరాతతో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం అంటోంది. దీంతో గత టీడీపీ హయాంలో ఉన్న ఆన్‌లైన్ విధానాన్నే తీసుకురానున్నారు. ఈ మేరకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇటు సీవరేజి వసూళ్ల కాంట్రాక్టర్లూ ఆన్‌లైన్ పర్మిట్లే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

AP: వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాల దృష్ట్యా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలంది. ట్రాఫిక్ పోలీసులు బాడీవోర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరముందని పేర్కొంది. వాహన చట్ట నిబంధనలను అమలు చేసేందుకు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈ అంశంపై పిటిషన్ వేసిన వ్యక్తిని అభినందించింది.

కొత్తగా కొలువుదీరిన లోక్‌సభతో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే ముర్ముకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్వాగతం పలుకుతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 87ప్రకారం లోక్‌సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది.

TG: కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానాలున్న వినియోగదారుల కోసం దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ ఓ సదుపాయాన్ని తీసుకొచ్చింది. <

జింబాబ్వే పర్యటనకు ఎంపికైన నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో ఆ సిరీస్ నుంచి తప్పుకున్నారు. కానీ నితీశ్ గాయంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతను నిజంగా గాయపడ్డారా? లేక వేరే కారణంతో తప్పించారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నితీశ్ ఏ టోర్నీలోనూ ఆడటం లేదని, అలాంటప్పుడు గాయం ఎలా అయిందని అడుగుతున్నారు. ఇటీవలే యోయో టెస్ట్ కూడా పాసయ్యారని, పూర్తి ఫిట్‌గా ఉన్నారనేది ఫ్యాన్స్ వాదన.

AP: పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న ఉ.6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది.

AP: IIITల్లో 2024-25 అడ్మిషన్లకు సంబంధించి 53,863 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జులై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. వీరికి జులై 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల పరిశీలన చేసి అడ్మిషన్లు ఇస్తారు. స్పెషల్ కేటగిరీ వారికి జులై 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు.

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరగనుంది. గయానాలోని డారెన్ సామి స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. T20WC-2022 సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు బట్లర్ సేన అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండి టీమ్ ఇండియాకు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది.

TG: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరే MLAల కోసం రెండు మంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 6 ఖాళీలు ఉండగా 4 భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే BRS నుంచి కాంగ్రెస్‌లోకి ఐదుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. మరికొందరు హస్తం గూటికి చేరిన తర్వాత వారందరిలో ఇద్దరికి మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. పోచారం శ్రీనివాస్ కుమారుడు భాస్కర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.