News June 30, 2024

చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా

image

AP: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా IAS కార్తికేయ మిశ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను ఏపీ సర్వీసుకు పంపాలని కేంద్రానికి సీఎం ఇటీవల లేఖ రాశారు. చంద్రబాబు రాసిన లేఖపై స్పందించిన DOPT, కార్తికేయ మిశ్రాను ఏపీ క్యాడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకుంది.

News June 30, 2024

14 ఏళ్లలో ఒక్కరోజైనా ఇంటి వద్దకే చంద్రబాబు పింఛను పంపించారా?: వైసీపీ

image

AP: ప్రతి నెలా 1, 2 తేదీల్లో పెన్షన్ తీసుకోకుంటే అనర్హులవుతారని YCP దుష్ప్రచారం చేస్తోందన్న TDP <<13537125>>విమర్శలకు<<>> ఆ పార్టీ కౌంటరిచ్చింది. ‘అవ్వాతాతలను ఏడిపించింది ఎవరో అందరికీ తెలుసు. జగనన్న హయాంలో పండుటాకులకు కష్టం కలగకుండా గడప వద్దే పింఛను అందించాం. 14ఏళ్లలో ఒక్కరోజైనా ఇంటి వద్దకే CBN పింఛను పంపించారా? పింఛనుదారులకు డబ్బు ఎగ్గొట్టడానికేగా ఈ డప్పు ప్రచారం!’ అని Xలో మండిపడింది.

News June 30, 2024

ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా బాల్య స్నేహితులు

image

దేశ రక్షణ దళాల చరిత్రలో తొలిసారి ఇద్దరు బాల్య స్నేహితులు ఆర్మీ, నేవీ అధిపతులయ్యారు. నౌకాదళ చీఫ్‌గా అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఇవాళ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్‌గా విధుల్లో చేరారు. వీరిద్దరూ 1970లో మధ్యప్రదేశ్‌ రేవా సైనిక్ స్కూల్‌లో ఐదో తరగతిలో చేరి, 12Th క్లాస్ వరకు కలిసి చదువుకున్నారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి నేడు అత్యున్నత విభాగాలకు నేతృత్వం వహిస్తున్నారు.

News June 30, 2024

చల్లా శ్రీనివాసులకు జనసేనాని అభినందనలు

image

SBI ఛైర్మన్‌గా నియమితులైన తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు శెట్టికి జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. ఆయన నేతృత్వంలో ఎస్బీఐ మరెన్నో మైలురాళ్లు దాటాలన్నారు. తెలుగు వారైన చల్లా తెలంగాణలోని ప్రస్తుత జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. విద్యాభ్యాసం తెలంగాణలోనే సాగింది. 1988లో SBIలో పీవోగా చేరారు. బ్యాంకింగ్ రంగంలో 35 ఏళ్ల అనుభవం ఆయన సొంతం.

News June 30, 2024

YELLOW ALERT.. భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 30-40కి.మీ వేగంతో కూడిన బలమైన ఉపరితల గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

News June 30, 2024

మాజీ మంత్రి డీఎస్ అంత్యక్రియలు పూర్తి

image

TG: సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామాబాద్ బైపాస్ రోడ్ సమీపంలోని ఫామ్‌హౌజ్‌లో పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. కాగా నిన్న తెల్లవారుజామున డీఎస్ అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.

News June 30, 2024

రైతులకు అన్యాయం జరిగితే సహించం: పెమ్మసాని

image

AP: ఖరీఫ్‌లో పంటల సాగుకు కొరత లేకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలో మాట్లాడుతూ.. కృత్రిమంగా కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే వారిపై నిఘా పెట్టాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.

News June 30, 2024

జులై 6 నుంచి దుర్గమ్మకు ఆషాఢ సారె మహోత్సవాలు: ఈవో

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలిసారి జులై 6 నుంచి 15 వరకు వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు EO రామారావు వెల్లడించారు. జులై 6 నుంచి నెల రోజులపాటు ఆషాఢ మాస సారె మహోత్సవాలు జరుపుతున్నామన్నారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. జులై 19 నుంచి 21 వరకు శాకాంబరీ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు సమర్పిస్తుందని పేర్కొన్నారు.

News June 30, 2024

పాత డీఎస్సీ రద్దు చేస్తూ జీవో విడుదల

image

AP: ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన DSC నోటిఫికేషన్‌‌ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. ఈ మేరకు జీవో 256 రిలీజ్ చేసింది. ఇవాళ లేదా రేపు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం డీఎస్సీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

News June 30, 2024

అమ్మ పేరుతో మొక్క నాటండి: ప్రధాని మోదీ

image

మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ కొత్త ప్రచారానికి తెరలేపారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’(అమ్మ పేరుతో ఒక మొక్క) నాటండి అని అన్నారు. ‘మా అమ్మ పేరుతో నేను మొక్క నాటాను. ప్రతి ఒక్కరూ తమ తల్లులను గౌరవించేలా ఒక మొక్కను నాటండి’ అని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిపించి ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.