India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విద్యార్థి వీసా ఫీజును ఆస్ట్రేలియా 473 అమెరికన్ డాలర్ల నుంచి 1,068 డాలర్లకు పెంచింది. నేటి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఇతర దేశాల నుంచి వలసలను నియంత్రించేందుకు, అంతర్జాతీయ విద్యావిధానాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంలో 5,48,000 మంది ఇతర దేశాల నుంచి అక్కడికి వలస వెళ్లినట్లు ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.

లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కొన్ని నెలల నుంచి కవిత ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

నక్సలైట్లు, క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టులను అణచివేసిన దివంగత IPS ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి ప.గో. కలెక్టర్‌గా నియమితులయ్యారు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉమేశ్ చంద్రను 1999లో HYDలోని SRనగర్‌లో నక్సలైట్లు కాల్చి చంపారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆయన సేవలకు గౌరవంగా నాగరాణికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ఆమె పదోన్నతులు పొందుతూ తాజాగా ప.గో. జిల్లా కలెక్టర్ అయ్యారు.

T20WC గెలిచిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని భారత యువ ఓపెనర్ జైస్వాల్ ఇన్‌స్టాలో ఫొటో పోస్టు చేశారు. కాగా ఆ పోస్టుపై ఫన్నీగా స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ‘వర్ణించకు పోయి పడుకో’ అని కామెంట్ చేశారు. అయితే ‘ఆడే ఛాన్స్ ఎలాగూ ఇవ్వలేదు. కనీసం మాట్లాడే ఛాన్స్ అయినా ఇవ్వరా?’ అని నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. WCకి సెలక్టయిన జైస్వాల్‌కు ప్లేయింగ్11లో ఛాన్స్ దొరకని విషయం తెలిసిందే.

AP: ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలను అధికారిక విప్‌లుగా నియమించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లను విప్‌లుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు.

ఈరోజు అమలులోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల్లో పోలీస్ రిమాండ్‌ను 40-75రోజులకు పెంచారన్న ప్రచారంలో నిజం లేదని PIB స్పష్టం చేసింది. ‘పోలీసు రిమాండ్ ఇప్పటికీ 15 రోజులే ఉంది. గతంలో పోలీసులకు నిందితుడిని అరెస్ట్ చేసిన తొలి 15రోజుల్లోనే కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉండేది. కొత్త చట్టాల ప్రకారం డిటెన్షన్ పీరియడ్ (60-90 రోజులు)లోని తొలి 40-60 రోజుల్లో ఎప్పుడైనా పోలీస్ కస్టడీ విధించొచ్చు’ అని పేర్కొంది.

ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(BNS) చట్టంలో భాగంగా తెలంగాణలో తొలి కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని చార్మినార్ పీఎస్ పరిధిలో నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న బైకర్‌పై సెక్షన్ 281 BNS, ఎంవీ యాక్ట్ కింద కేసు పెట్టారు. కొత్త చట్టం ప్రకారం డిజిటల్ FIR నమోదు చేసినట్లు DGP ఆఫీస్ ట్వీట్ చేసింది. కాగా IPC స్థానంలో కేంద్రం BNS తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

* హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్
* కొత్తగూడెం OSDగా పరితోష్ పంకజ్
* భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్
* ములుగు OSDగా మహేశ్ బాబాసాహెబ్
* గవర్నర్ OSDగా సిరిశెట్టి సంకీర్త్
* భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్
* ఏటూరు నాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయ
* వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి

పేద విద్యార్థులు NEETపై నమ్మకం కోల్పోయారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీట్ కోసం విద్యార్థులు ఏళ్ల పాటు చదువుతారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. నీట్ పేద విద్యార్థుల కోసం కాదు ఉన్నత వర్గాల కోసం అనే విధంగా మార్చారు. నీట్ పరీక్ష విధానంలో అనేక లోపాలు ఉన్నాయి’ అని ధ్వజమెత్తారు.

‘కల్కీ’ హిట్ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘‘పదేళ్ల క్రితం స్వప్న దత్, ప్రియాంక దత్, నేను కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ప్రారంభించాం. ఆ చిత్రం రిస్క్‌తో కూడుకుంది. అదనపు ఖర్చు ఆందోళనకు గురిచేసింది. కానీ పదేళ్ల తర్వాత చూస్తే మేము చేసిన ప్రతి సినిమా విజయం పొందడంతో పాటు మైలురాయిగా నిలిచాయి. వీరి మధ్య నిలబడటం గర్వంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నా’’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.