News July 1, 2024

ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్

image

మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ను మెన్స్ టీమ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా నియమించినట్లు ఆర్సీబీ ప్రకటించింది. DK మెంటార్‌గానూ వ్యవహరించనున్నట్లు ట్వీట్ చేసింది. ‘ఇతడిని క్రికెట్ నుంచి దూరం చేయవచ్చు గానీ ఇతడి నుంచి క్రికెట్‌ను దూరం చేయలేము. 12th మ్యాన్ ఆర్మీ’ అని పేర్కొంది. ఈ ఏడాది IPLలో ఆర్సీబీ తరఫున ఆడిన DK రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News July 1, 2024

BOBలో 168 ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 168 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్‌షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్ తదితర పోస్టులున్నాయి. జాబ్‌ను బట్టి డిగ్రీ, CA/CMA/CS/CFA, పీజీ, డిప్లొమా చేసిన వారు అర్హులు. అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో 459 ఉద్యోగాలున్నాయి. పూర్తి వివరాల కోసం <>https://www.bankofbaroda.in/<<>> వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

News July 1, 2024

రాష్ట్రంలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయంది. కాగా నిన్న రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్‌లోని తాండూరులో 5.1 సెం.మీ, నిజామాబాద్‌లోని పొతంగల్‌లో 4.8 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

News July 1, 2024

NEET UGపై చర్చకు విపక్షాల పట్టు

image

లోక్‌సభ సమావేశాల్లో NEET UGపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. NEET UG, UG NET సహా పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలు, నిర్వహణలో NTA వైఫల్యంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరో ఎంపీ మాణిక్కం ఠాగూర్ సస్పెన్షన్‌ ఆఫ్ బిజినెస్ నోటీసు ఇచ్చారు.

News July 1, 2024

ప్రధాన కోచ్ రేసులో ఇద్దరి పేర్లు షార్ట్ లిస్ట్: జైషా

image

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రేసులో ఇద్దరి పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్లు BCCI సెక్రటరీ జైషా తెలిపారు. ‘కోచ్, సెలక్టర్ నియామకం త్వరలోనే జరుగుతుంది. CAC నిర్ణయించిన పేర్లను ప్రకటిస్తాం. జింబాబ్వేకు వెళ్లే జట్టుతో లక్ష్మణ్ కోచ్‌గా వెళ్తారు. కొత్త కోచ్ శ్రీలంక సిరీస్‌తో జాయిన్ అవుతారు’ అని పేర్కొన్నారు. కాగా గంభీర్‌ను కోచ్‌గా ఎంపిక చేశారనే ప్రచారం నడుమ జైషా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

News July 1, 2024

తెలంగాణలో నిరుద్యోగ జేఏసీ డిమాండ్లివే

image

☞ గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి
☞ గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి
☞ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
☞ 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి
☞ గురుకుల టీచర్ పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పెట్టకూడదు
☞ నిరుద్యోగులకు రూ.4వేల భృతి, 7 నెలల బకాయిలు ఇవ్వాలి
☞ ఈ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగ JAC నేత <<13537666>>మోతీలాల్<<>> దీక్ష చేస్తున్నారు.

News July 1, 2024

మహిళలకు బెంగాల్ సురక్షితం కాదు: జేపీ నడ్డా

image

పశ్చిమబెంగాల్‌లోని చోప్రాలో నడిరోడ్డుపై ఓ మహిళను <<13539360>>దారుణంగా<<>> కొట్టిన ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. ‘మతతత్వ పాలనల్లో మాత్రమే ఉండే క్రూరత్వాన్ని గుర్తు చేస్తూ బెంగాల్‌లో ఓ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని మరింత దిగజార్చడానికి TMC నేతలు ఈ చర్యను సమర్థిస్తున్నారు. దీదీ పాలిస్తున్న బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు’ అని ట్వీట్ చేశారు.

News July 1, 2024

జూన్‌లో అధిక వర్షపాతం.. జులైలోనూ సమృద్ధిగానే!

image

AP: జూన్‌లో సాధారణ వర్షపాతం 91.2MM కాగా 143.7MM నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180% వర్షపాతం కురవగా, ఆ తర్వాత అనంతపురం(177%) నిలిచినట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాల కారణంగా రాయలసీమలోని 8 జిల్లాలు, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఈనెలలోనూ సమృద్ధిగానే వానలు కురుస్తాయని అంచనా వేసింది.

News July 1, 2024

ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు అసాధ్యం: CBSE

image

ప్రస్తుత అకడమిక్ షెడ్యూల్ ప్రకారం 10, 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి 2సార్లు బోర్డు ఎగ్జామ్స్ అసాధ్యమని CBSE తెలిపింది. ఏడాదికి 2సార్లు పరీక్షలు పెట్టి, ఉత్తమ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా విద్యాశాఖ AUGలో సిఫార్సు చేసింది. ఈ మేరకు CBSE ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. దీంతో పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో చర్చించిన CBSE ప్రస్తుతం ఈ విధానం అసాధ్యమని తెలిపింది.

News July 1, 2024

హోంమంత్రి ఇలాకాలో కీచకపర్వం: YCP

image

AP: హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో కీచకపర్వం అంటూ ఇద్దరు మహిళలపై కొందరు దాడికి పాల్పడిన వీడియోను YCP పోస్ట్ చేసింది. నడిరోడ్డుపై మహిళల దుస్తులు చించి, వారిపై అమానుషంగా దాడి చేసినట్లు పేర్కొంది. ఇదేనా ఆడబిడ్డలకి మీరు కల్పిస్తానన్న రక్షణ అంటూ హోంమంత్రిని YCP ప్రశ్నించింది.