India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ రూ.25 లక్షలు తీసుకున్నట్లు నవీ ముంబై పోలీసులు ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. సల్మాన్‌ను చంపేందుకు పాకిస్థాన్ నుంచి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కాంట్రాక్ట్ ఎవరిచ్చారో తెలియాల్సి ఉంది.

HYDలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అమరావతిలో AP మంత్రి నారా లోకేశ్‌కు పలువురు AP క్యాబ్ డ్రైవర్లు విన్నవించుకున్నారు. ఉమ్మడి రాజధానిగా HYD కాలపరిమితి ముగియడంతో తమ వాహనాలకు TG ప్రభుత్వం మళ్లీ లైఫ్ ట్యాక్స్ అడుగుతోందని వినతిపత్రం ఇచ్చారు. ఉమ్మడి APలో ట్యాక్స్ కట్టిన తమకు మళ్లీ కట్టడం ఆర్థికంగా తీవ్ర భారమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6న జరిగే చంద్రబాబు-రేవంత్ భేటీలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

చెన్నై ఎయిర్‌పోర్టులో షాప్ మాటున గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ 2నెలల్లో రూ.3కోట్లు సంపాదించిన ఓ యూబ్యూటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలంకకు చెందిన ఓ స్మగ్లర్ లోకల్ యూట్యూబర్ మహ్మద్ సాబిర్‌తో షాప్ పెట్టించగా అతడు 2నెలల్లోనే రూ.167కోట్ల విలువైన 267kgల బంగారం అక్రమంగా తరలించాడు. షాపు సిబ్బంది వద్ద గోల్డ్ పౌడర్ పోలీసులకు దొరకడంతో మొత్తానికి గుట్టురట్టయింది. అలీ, షాపు సిబ్బంది అరెస్టయ్యారు.

మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ విజృంభిస్తోంది. ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వైరస్ గర్భిణులకు సోకితే పుట్టే బిడ్డల్లో మెదడు అభివృద్ధి చెందదు. జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. జ్వరం, దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

YS జగన్ కొత్త లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని తన ఇంట్లో వారం రోజులుగా ఉంటున్న జగన్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగుతున్నారు. అందులో వైట్ అండ్ బ్లాక్ కుర్తా పైజామాతో మాజీ సీఎం కనిపించారు. గతంలో ఈ తరహా లుక్‌లో జగన్‌ను ఎప్పుడూ చూడలేదని YCP శ్రేణులు అంటున్నాయి. దీంతో జగన్ స్టైల్ మార్చారని సోషల్ మీడియాలో ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నాయి.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో కేంద్రంపై రాహుల్ గాంధీ చేసి <<13546466>>విమర్శలపై<<>> బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా చర్యలు తీసుకున్నారు. హిందూ మతం, బీజేపీ, RSS, అగ్నివీర్, నీట్ పరీక్షల్లో అక్రమాలపై విపక్ష నేత చేసిన వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. కాగా నిన్న దాదాపు 100 నిమిషాలపాటు రాహుల్ ప్రసంగించిన విషయం తెలిసిందే.

గతఏడాది అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ కుట్రపూరితంగానే రిపోర్ట్ రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సెబీ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ‘అదానీ FPO లాంచ్ అయ్యే టైమ్‌లోనే ఈ రిపోర్ట్ వచ్చింది. దీనికి ముందు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో షార్ట్ సెల్లింగ్ (ముందు షేర్లు విక్రయించి ఆ తర్వాత వాటి విలువ తగ్గాక మళ్లీ కొనడం) జరిగింది. రిపోర్ట్ తర్వాత AEL షేర్ల విలువ 59% పడిపోయింది’ అని పేర్కొంది.

T20WC గెలిచిన అనంతరం బార్బడోస్ పిచ్ మీద <<13536415>>మట్టి <<>>తినడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్‌శర్మ వెల్లడించారు. ‘ఆ పిచ్‌పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాం. నాకు ఆ పిచ్ ఎంతో ప్రత్యేకం. దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. దాన్ని నేను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా మట్టి నోట్లో వేసుకున్నా’ అని రోహిత్ తెలిపారు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్‌లో SAపై 7 రన్స్ తేడాతో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.

ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త, ఔట్‌కమ్ హెల్త్ కోఫౌండర్ రిషి షాకు US కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ₹8,300 కోట్ల కుంభకోణం కేసులో న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువరించారు. అతిపెద్ద కార్పొరేట్ మోసం కేసుల్లో ఇదొకటని పేర్కొన్నారు. కంపెనీ లాభాల్లో ఉందని చెప్పి రిషి టాప్ ఇన్వెస్టర్లు గోల్డ్‌మన్ సాచ్, అల్ఫాబెట్‌లను మోసం చేశారు. యాడ్ల కోసం డబ్బులు తీసుకుని పలు కంపెనీలను బురిడీ కొట్టించారు.

AP: ఈ 3 యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లులు <<13544824>>చెల్లించే <<>>సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే క్రెడిట్ కార్డు ద్వారా బిల్లుల చెల్లింపులను ఆ యాప్‌లు నిలిపివేశాయి. ఇకపై ఆయా డిస్కంల వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లను వినియోగించి బిల్లులు కట్టాలి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు సెంట్రల్ పవర్, ఉమ్మడి గోదావరి జిల్లాలు, VZM, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల వారు ఈస్ట్రన్ పవర్, మిగతా వారు సదరన్ పవర్ యాప్‌లు వాడాలి.
Sorry, no posts matched your criteria.