India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సినీ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో <<14631162>>అరెస్టయిన<<>> ఆమెను పోలీసులు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై పోలీసుల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలపకపోవడంతో తాజాగా కోర్టు బెయిల్ ఇచ్చింది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. రెండు రోజుల పర్యటన కోసం నేడు సా.6 గంటలకు స్పెషల్ ఫ్లైట్‌లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సా.7.10 వరకు రాజ్ భవన్‌లో రెస్ట్ తీసుకుని, సా.7.20కి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. రేపు ఉదయం హైటెక్‌సిటీలోని శిల్పకళా వేదికలో లోక్‌మంథన్-2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు.
BGT సిరీస్‌కు పుజారాను ఎంపిక చేయకుండా బీసీసీఐ తప్పు చేసిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. అతడు ఎక్కువ గంటలు బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా బౌలర్లను అలసిపోయేలా చేసేవాడని తెలిపారు. గతంలో ఆసీస్‌పై భారత్ గెలవడంలో పుజారా కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అతడిలా బ్యాటింగ్ చేసే వారు లేకపోతే భారత జట్టుకు ఇబ్బందేనని అభిప్రాయపడ్డారు. కాగా BGT తొలి టెస్ట్ రేపటి నుంచి జరగనుంది.
యూపీలోని ఝాన్సీలో ఉన్న మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో ఈనెల 15న <<14624063>>అగ్నిప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని 10 మంది నవజాత శిశువులు మరణించారు. 39 మంది శిశువుల్ని రక్షించగా, అందులో ఐదుగురు గత రెండు రోజుల్లో అనారోగ్యంతో చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే వారి శరీరాలపై ఎటువంటి కాలిన గాయాలు లేవని, వారిపై పొగ ప్రభావం కూడా పడలేదని డాక్టర్లు తెలిపారు.
రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమరావతిలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. జనవరి తొలి వారంలో జరిగే ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే Dy.CM అయ్యాక ఆయన హాజరైన తొలి సినిమా ఈవెంట్ ఇదే కానుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జనవరి 10న థియేటర్లలోకి రానుంది.
వచ్చే ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను IPL సమయంలో నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది. PSL ఫిబ్రవరి-మార్చి మధ్యలో జరుగుతుంటుంది. వచ్చే ఏడాది ఆ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో IPL జరిగే మార్చి-మే సమయంలోనే PSLను జరపాలని PCB భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అగ్రస్థాయి విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరంటూ ఫ్రాంచైజీలు ఓ లేఖలో బోర్డు వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల గడువు నిన్నటితో ముగియగా, మొత్తం 2.48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పేపర్-1కి 71,000, పేపర్-2కి 1.55 లక్షలు, రెండు పేపర్లకు కలిపి 20,000 మంది అప్లై చేసుకున్నారని పేర్కొన్నారు. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే రేపటిలోపు (నవంబర్ 22) ఎడిట్ చేసుకోవాలని సూచించారు.
చెన్నైలో జరిగే ప్రమోషనల్ ఈవెంట్‌పై ‘పుష్ప-2’ మూవీ టీమ్ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 24న తాంబరంలోని సాయి రామ్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఉన్న లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వైల్డ్ ఫైర్ ఈవెంట్ సా.5 గంటలకు ప్రారంభం అవుతుందని పేర్కొంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.
ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2024 విజేతగా భారత మహిళల హాకీ జట్టు నిలిచింది. నిన్న చైనాతో జరిగిన ఫైనల్‌లో 1-0 తేడాతో విజయ కేతనం ఎగరవేసింది. 31వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా భారత ప్లేయర్ దీపిక గోల్ సాధించారు. ఈ టోర్నీలో అత్యధికంగా 11 గోల్స్ చేసిన ఆమె ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచారు. ఇది భారత్‌కు మూడో ACT టైటిల్ కాగా అంతకుముందు 2016, 2023లో IND ఈ టైటిల్‌ను గెలిచింది.
వాతావరణపరంగా భారత్‌కు మున్ముందు చాలా గడ్డుకాలం ఉంటుందని అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీ పరిశోధకుల నివేదిక తేల్చిచెప్పింది. ‘2043 కల్లా దేశంలో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలకు పైగా పెరుగుతాయి. వర్షాకాలంలో భారీ వరదలు ముంచెత్తుతాయి. ప్రజల ఆరోగ్యం, పంటలు, గ్రామీణ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రత అన్నీ ప్రమాదంలో పడతాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేలా ప్రభుత్వాలు ముందుగానే పరిష్కారాల్ని కనుగొనాలి’ అని హెచ్చరించింది.
Sorry, no posts matched your criteria.