India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పటాన్‌చెరు BRS MLA గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిన్న రాత్రి ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి, పార్టీలో చేరికపై చర్చించారని వార్తలొచ్చాయి. దీంతో నేడో, రేపో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇటీవల ఆయనపై ఈడీ దాడులు జరిగాయి. దీంతో బీజేపీలో చేరాలని భావించినా.. అనుచరుల ఒత్తిడితో నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని నీతి ఆయోగ్ స్పష్టం చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలు ఏమైనా చేయగలరని, అయితే ప్రత్యేక హోదాను ఇవ్వలేమని తెలిపారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం నిధులను మాత్రం మోదీ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు.

ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్. 5 గంటల వ్యవధిలోనే రెండు ఫైనల్స్ జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఇవాళ అర్ధరాత్రి 12:30 గంటలకు స్పెయిన్, ఇంగ్లండ్ మధ్య యూరో ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచులో స్పెయిన్ ఫేవరెట్‌గా ఉంది. మరోవైపు రేపు ఉదయం 5.30 గంటలకు అర్జెంటీనా, కొలంబియా మధ్య కోపా అమెరికా ఫైనల్ జరగనుంది. ఇప్పటికే 15 టైటిళ్లు సొంతం చేసుకున్న మెస్సీ టీమ్ మరో ట్రోఫీ గెలవాలని ఎదురుచూస్తోంది.

TGలోని పలు జిల్లాల్లో నేటి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ నిర్మల్, NZB, VKD, MDK, KMRD, MBNR, NGKL జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపు జనగామ, SDPT, MDK, KMRD జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధ, గురువారాల్లోనూ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

TG: ‘ఆసరా’ పక్కదారి పట్టడంపై ప్రభుత్వం చేపట్టిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగపరంగా పింఛన్ పొందుతున్న 5,650 మంది విశ్రాంత ఉద్యోగులు కూడా పెన్షన్ తీసుకున్నట్లు తేలింది. వీరిలో 3,824 మంది మరణించగా మిగిలిన 1826 మంది ఇప్పటికీ రెండూ తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తి 2 పింఛన్లు తీసుకోకూడదు. దీంతో ప్రభుత్వం వారి నుంచి పెన్షన్ రికవరీ చేస్తోంది.

అమెరికాలో హింసకు తావులేదని ప్రెసిడెంట్ జో బైడెన్ ట్వీట్ చేశారు. ‘<<13624982>>కాల్పుల్లో<<>> గాయపడిన ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసింది. ట్రంప్, ఆయన కుటుంబం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మనం అందరం ఒక్కటై ఈ ఘటనను ఖండించాలి’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

TG: రాష్ట్రంలో పప్పుల ధరలు సామాన్యులను షాక్ ఇస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో గతనెల రూ.150-160గా ఉన్న కేజీ కందిపప్పు ఇప్పుడు రూ.180-200 పలుకుతోంది. సూపర్ మార్కెట్లో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. మినప్పప్పు కేజీ రూ.90-120 ఉండగా ప్రస్తుతం రూ.140-160కి, పెసరపప్పు కేజీ రూ.100 నుంచి రూ.120కి చేరింది. గతేడాది వర్షాభావం వల్ల ఈసారి ఉత్పత్తి 40% తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఎన్నికల ర్యాలీలో దుండగుడి <<13624982>>కాల్పులలో<<>> గాయాలపాలైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు ఆయన ప్రతినిధి స్టీవెన్ తెలిపారు. స్థానిక మెడికల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో త్వరగా స్పందించిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ట్రంప్ త్వరగా కోలుకోవాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

టెన్నిస్ చరిత్రలో ఆసక్తికర పోరుకు సమయమైంది. వింబుల్డన్ మెన్స్ సింగిల్స్‌లో ఇవాళ సాయంత్రం 6:30 గంటల నుంచి జకోవిచ్, అల్కరాజ్ మధ్య తుది పోరు జరగనుంది. కెరీర్‌లో 25వ గ్రాండ్ స్లామ్‌పై జకో కన్నేయగా.. నాలుగో గ్రాండ్ స్లామ్ అందుకోవాలని అల్కరాజ్ చూస్తున్నారు. ఇరువురి మధ్య ఐదు మ్యాచులు జరగ్గా మూడు సార్లు జకోవిచ్, రెండు సార్లు అల్కరాజ్ గెలుపొందారు. మరి ఈ మ్యాచులో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి.

TG: సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. దీనికోసం ఆయన తాజాగా తన పాస్ పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. ఇది వ్యక్తిగత పర్యటనా? అధికారిక పర్యటనా? అనేది తెలియాల్సి ఉంది. టూర్‌లో భాగంగా ఆయన ఎన్నారై పారిశ్రామికవేత్తలతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తారని సమాచారం.
Sorry, no posts matched your criteria.