India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: గుంటూరు జిల్లాలో TDPకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ TDPకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెనాలి టికెట్ జనసేనకు కేటాయించడంతో.. గుంటూరు-2, పెనమలూరు స్థానాలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల గుంటూరు-2 మాధవికి, పెనమలూరు బోడే ప్రసాద్‌కు CBN కేటాయించారు. దీంతో అసంతృప్తితో ఉన్న రాజా.. సాయంత్రం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ప్రకటించనున్నారు.

లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ CM కేజ్రీవాల్‌ను కాసేపట్లో ED అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆయనను 10రోజుల కస్టడీకి ఇవ్వాలని ED కోరుతోంది. ఇటీవల కవితకు కోర్టు వారం రోజుల కస్టడీ విధించింది. దీంతో కేజ్రీవాల్‌కూ కస్టడీ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా పేర్కొంటున్న సిసోడియా, కవిత, కేజ్రీవాల్‌ను కలిపి విచారించేందుకు ఇదే సరైన సమయమని ED భావిస్తోంది.

ఏకపక్ష విధానాలతో పోటీ సంస్థల మనుగడను ‘యాపిల్’ ప్రశ్నార్థకం చేస్తోందని, ధరలను కృత్రిమంగా పెంచుతోందని అమెరికా ప్రభుత్వం దావా వేసింది. దీంతో యాపిల్ షేర్లు 4.1 శాతం నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 113 బిలియన్ డాలర్లు(రూ.9.41 లక్షల కోట్లు) తగ్గిపోయింది. మొత్తంగా కంపెనీ షేరు విలువ ఈ ఏడాది 11 శాతం వరకు తగ్గడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ ఆరోపణలను యాపిల్ కొట్టిపారేసింది.

చికిత్స లేని వ్యాధుల్లో HIV ఎయిడ్స్ ఒకటి. తాజాగా సైంటిస్టులు CRISPR(క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్‌స్పేస్‌డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్) సాంకేతికతతో కణాల నుంచి HIVని తొలగించే వీలుందని గుర్తించారు. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో వైరస్ సోకిన జన్యువులను కత్తిరించి తీసేస్తారు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని, ఇప్పటికిప్పుడు కాకపోయినా దీర్ఘకాలంలో HIVకి చికిత్స సాధ్యమవుతుందని పరిశోధకులు తెలిపారు.

TG: ఆనందంగా జరుగుతోన్న వివాహ వేడుకలో మటన్ ముక్క చిచ్చుపెట్టింది. జగిత్యాల జిల్లా ఆత్మకూరులో ఈ ఘటన జరిగింది. తమకు మటన్ కూర వేయలేదంటూ పెళ్లి కొడుకు బంధువులు వడ్డిస్తోన్న వారిపై వంట సామగ్రి, టేబుళ్లతో దాడి చేశారు. ఆగ్రహంతో పెళ్లి కూతురు బంధువులు ఎదురుదాడి చేయడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేశారు.

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ పిటిషన్‌పై విచారణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తరఫు లాయర్లు సుప్రీంకు తెలిపారు. కాగా నిన్న కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను విచారించేందుకు ఇవాళ అత్యున్నత ధర్మాసనం స్పెషల్ బెంచిని ఏర్పాటు చేసింది.

ఏప్రిల్ 1 నుంచి తమ కార్ల ధరలను 3% వరకు పెంచనున్నట్లు కియా ఇండియా ప్రకటించింది. సెల్టోస్, సొనెట్, కారెన్స్ వంటి పలు పాపులర్ మోడళ్ల ధరలను వేరియంట్ ఆధారంగా పెంచబోతున్నట్లు తెలిపింది. ముడి పదార్థాల ధరలు, సరఫరా సంబంధిత ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇండియాలో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి ఓవర్సీస్, డొమెస్టిక్ మార్కెట్‌లో ఈ కంపెనీ ఇప్పటివరకు 1.16 మిలియన్ కార్లను విక్రయించింది.

యాపిల్ వాచ్‌లు ఆండ్రాయిడ్‌తో పనిచేయవు. ఇది గుత్తాధిపత్యమే అంటూ ఓ సంస్థ USలో దావా వేసింది. ‘ఎవరైనా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారాలనుకుంటే, వారు తమ యాపిల్ వాచ్‌ను వదిలివేసి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలి. ఇది యూజర్లపై విపరీతమైన భారాన్ని వేస్తోంది’ అని వాదించింది. అయితే ఆండ్రాయిడ్‌తోనూ పనిచేసేలా రూపొందించేందుకు తాము మూడేళ్లు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని యాపిల్ వెల్లడించింది.

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల/కమల్ మౌలా మసీదులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) సర్వే చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు 12 మంది సభ్యులతో కూడిన ASI బృందం సర్వే చేస్తోంది. వాగ్దేవి దేవత ఆలయమని హిందువులు విశ్వసించే ఈ భోజ్‌శాల కాంప్లెక్స్‌పై సర్వే నిర్వహించి ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు మార్చి 11న ఆదేశాలు జారీ చేసింది.

లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు BJP చీఫ్ అన్నామలై గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూరులో ఉత్తరాది నుండి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉండటం, ఇదే ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు సద్గురు ఆశీస్సులు అన్నామలైకు ఉండటం పార్టీకి కలిసొస్తుందని అంటున్నారు. ఇటీవల ఇక్కడ PM పర్యటించడం, 1998 బాంబు బ్లాస్ట్‌లో చనిపోయిన వారిని గుర్తుచేసుకోవడం కూడా ప్లస్ అవ్వొచ్చని భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.