News October 3, 2024

డబ్బులిచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారు: మంత్రి పొంగులేటి

image

TG: మూసీ ఆక్రమణల కూల్చివేతల విషయంలో కొందరు డబ్బులిచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. దీనికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సమన్వయంతో ముందుకెళతామని చెప్పారు. పేదలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లే దిశగా ఇందిరమ్మ ఆశయ సాధనలో సాగుతామన్నారు.

News October 3, 2024

గజ్జల వెంకటలక్ష్మి పిటిషన్ కొట్టివేత

image

AP: తనను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గజ్జల వెంకటలక్ష్మి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గత నెల 23న ఆమెను పదవి నుంచి GOVT తొలగించింది. పదవీకాలం ముగియకముందే తొలగించారంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమితులయ్యారని, AUGతో పదవీ కాలం ముగిసిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు.

News October 3, 2024

Stock Market: యుద్ధ భయాలు.. భారీ నష్టాలు

image

మిడిల్ ఈస్ట్‌లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఒక్క రోజే 2 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ 1,769 పాయింట్లు న‌ష్ట‌పోయి 82,497 వ‌ద్ద‌, నిఫ్టీ 546 పాయింట్లు న‌ష్ట‌పోయి 25,250 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. భారీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన సూచీలు ఉద‌యం మొద‌టి 30 నిమిషాలు కోలుకొనే ప్ర‌య‌త్నం చేసినా అప్పటికే సెంటిమెంట్ బ‌ల‌హీన‌ప‌డ‌డంతో అమ్మ‌కాలు జోరందుకున్నాయి.

News October 3, 2024

BHU విద్యార్థుల సస్పెన్షన్‌పై వివాదం

image

BHU IITలో గత ఏడాది విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్‌కి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన 13 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం వివాదాస్పదమైంది. బయటి వ్యక్తులను క్యాంపస్‌లోకి అనుమతించకూడదని విద్యార్థులు తాజాగా నిరసనకు దిగారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన వర్సిటీ విద్యార్థులను క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యం పేరుతో సస్పెండ్ చేసింది. గతంలో ఈ కేసులో ముగ్గురు BJP IT Cell సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

News October 3, 2024

జాతి పితలు లేరు.. జాతి పుత్రులే ఉన్నారు: మరో వివాదంలో కంగన

image

‘దేశానికి జాతి పిత‌లు లేరు. పుత్రులే ఉన్నారు. ఈ భారతమాత పుత్రులు ధన్యులు’ అంటూ EX PM లాల్ బ‌హ‌దూర్ శాస్త్రికి నివాళుల‌ర్పిస్తూ BJP MP కంగన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే, గాంధీ, శాస్త్రిల మధ్య వ్యత్యాసం చూపుతూ, బాపూను తక్కువ చేయడంపై విప‌క్షాలు భ‌గ్గుమ‌న్నాయి. ‘గాడ్సే కొత్త భ‌క్తురాలు’ అంటూ కంగ‌నాను కాంగ్రెస్ విమ‌ర్శించింది. జాతిపిత ఉన్నారు, పుత్రులు ఉన్నారు, అమరవీరులూ ఉన్నారు అని పేర్కొంది.

News October 3, 2024

తిరుమల లడ్డూ వివాదంపై విచారణ వాయిదా

image

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు ఉ.10.30 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. దర్యాప్తుపై కేంద్రం అభిప్రాయం తెలిపేందుకు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీంతో విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

News October 3, 2024

ఇవాళ కూడా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ మరోసారి రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.660 పెరిగి రూ.77,560కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.100 పెరిగి రూ.71,100గా నమోదైంది. అటు కేజీ సిల్వర్ రేట్ రూ.1,01,000గా కొనసాగుతోంది.

News October 3, 2024

ఘోరం: ఐదుగురు బిడ్డలున్నా అన్నం పెట్టట్లేదు

image

TG: కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలు కాదు పొమ్మన్నారు. దీంతో పోలీసులు వారి కడుపు నింపుతున్నారు. మహబూబ్‌నగర్(D) మాసన్‌పల్లికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ఓ కొడుకు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. బిడ్డలు పట్టించుకోకపోవడంతో HYD రాజేంద్రనగర్‌లో ఓ బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నారు. వారిని వృద్ధాశ్రమంలో చేరుస్తామని పోలీసులు తెలిపారు.

News October 3, 2024

మణిపూర్‌లో అరుదైన దృశ్యం

image

మణిపూర్‌లో 17నెలల తర్వాత కుకీ, మైతేయి తెగల వ్యక్తులు కౌగిలించుకొని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. Sep 27న గూగుల్ మ్యాప్స్‌‌ని నమ్మి మైతేయి వ్యక్తులు కుకీ ఆధిపత్య గ్రామంలోకి ప్రవేశించి, బందీలయ్యారు. ప్రభుత్వ జోక్యంతో కుకీ సివిల్ సొసైటీ వారిని విడుదల చేసింది. వారిని సొంత తెగకు అప్పగించే క్రమంలో వారు హగ్ చేసుకున్న ఫొటో వైరలవుతోంది. ఈ తెగల మధ్య విబేధాలతో మణిపూర్‌లో ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే.

News October 3, 2024

డైరెక్ట్‌గా OTTలో రిలీజ్ కానున్న ‘ఇండియన్-3’?

image

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘భారతీయుడు-3’ సినిమాపై మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన ‘భారతీయుడు-2’ ఆశించిన మేర కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానున్న ‘ఇండియన్-3’ను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారని సినీవర్గాలు తెలిపాయి. OTT ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో ఇది స్ట్రీమింగ్ కానుందని పేర్కొన్నాయి.