News February 9, 2026

ICSILలో డేటా ఎంట్రీ పోస్టులు

image

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<>ICSIL<<>>)8 డేటా ఎంట్రీ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇవాళ (OTR)రిజిస్ట్రేషన్ చేసుకుని, రేపు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in

News February 9, 2026

నేతల్లారా.. మీ బూతులకు అడ్డు లేదా?

image

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. సీఎం రేవంత్‌ను ‘అరేయ్ పొట్టోడా’ అంటూ కేటీఆర్, ‘బేవకూఫ్’ అని బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శించారు. అటు సీఎం రేవంత్ కూడా తగ్గకుండా BRSకు ఇదే సరైన భాష అని బూతులు ప్రయోగిస్తున్నారు. ‘హౌలా’, ‘ఒరేయ్’, ‘లుచ్చా’.. అనేవి కామనైపోయాయి. పదవుల్లో ఉన్న వీరు ఇలాంటి అసభ్యకర భాష మాట్లాడటంపై విరక్తి కలుగుతోందని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

News February 9, 2026

ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి బాడీబిల్డర్ సూసైడ్

image

మూడేళ్లు తనను ప్రేమించి, మరొకరితో పెళ్లికి యువతి సిద్ధమవడంతో ఓ బాడీబిల్డర్ గుండెపగిలింది. కొత్త చీర, ఆహ్వానపత్రికను పంపడంతో అతను సూసైడ్ చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. ‘మా కొడుకు కిరణ్ యువతికి ఇవ్వడానికి వాలంటైన్స్ డే గిఫ్ట్‌ను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆమె కుటుంబానికి ఉన్న రూ.50 లక్షల అప్పును తీరుస్తానని హామీ ఇచ్చాడు’ అని పేరెంట్స్ వాపోయారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 9, 2026

చర్మాన్ని మెరిపించే జ్యూసులు

image

చలికాలంలో చర్మం పొడిబారడం, కాంతి కోల్పోవడం సాధారణం. దీని కోసం ఖరీదైన క్రీములు వాడటం కంటే.. లోపల నుంచి పోషణ అందించడం ద్వారా సహజ సౌందర్యాన్ని పెంచుకోవడం మంచిది. దీనికోసం క్యారెట్ జ్యూస్, టొమాటో జ్యూస్, బీట్‌రూట్ జ్యూస్‌, దోసకాయ జ్యూస్, పాలకూర- గ్రీన్ జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుందంటున్నారు నిపుణులు. వీటిల్లో పసుపు, అల్లం వంటివి యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు యాడ్ చేయడం మంచిదంటున్నారు.

News February 9, 2026

‘పార్లమెంటులో పేలుడు జరుగుతుంది’.. స్కూళ్లకు బాంబు బెదిరింపులు

image

ఢిల్లీలోని 10కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 8.33AMకి తొలి కాల్ వచ్చిందని, స్కూళ్లను అలర్ట్ చేసి విద్యార్థులను పంపించామని ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఢిల్లీ ఖలిస్థాన్ అవుతుంది. పంజాబే ఖలిస్థాన్. అఫ్జల్ గురు జ్ఞాపకార్థం. ఫిబ్రవరి 13న 1.11PMకు పార్లమెంటులో పేలుడు జరుగుతుంది’ అని ఈమెయిల్‌లో దుండగులు హెచ్చరించారు.

News February 9, 2026

పబ్‌జీ ఆడుతుండగా 300 దాటిన BP.. మెదడు నరాలు చిట్లి మృతి

image

మేరఠ్‌(UP)కు చెందిన మహ్మద్ కైఫ్(22) 4నెలలుగా PUBG గేమ్‌కు అలవాటుపడ్డారు. శుక్రవారం హెడ్‌ఫోన్స్ పెట్టుకొని అర్ధరాత్రి వరకు ఆడుతూనే ఉన్నారు. ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చెవులు, ముక్కు నుంచి రక్తం కారిన అతనికి ట్రీట్‌మెంట్ చేసినా ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. మెంటల్ ప్రెజర్‌తో BP 300 దాటి బ్రెయిన్‌లోని నరాలు చిట్లి రక్తస్రావమైనట్లు డాక్టర్లు తేల్చారు.

News February 9, 2026

దేనికోసం బాయ్‌కాట్? పాక్‌పై గంగూలీ ఫైర్

image

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే పాకిస్థాన్ నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాగూ శ్రీలంకలో ఆడుతున్నప్పుడు ఇబ్బందేంటని ప్రశ్నించారు. అసలు దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. వరల్డ్ కప్‌లో ప్రతీ పాయింట్ ముఖ్యమేనని హితవు పలికారు. బంగ్లాకు మద్దతు పలుకుతూ Feb 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

News February 9, 2026

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 83,957 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్లు పుంజుకొని 25,811 దగ్గర ట్రేడవుతోంది. అమెరికాతో మధ్యంతర ట్రేడ్ డీల్ సూచీల్లో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్-30 సూచీలో SBI, కోటక్‌బ్యాంక్, టైటాన్, ఎటర్నల్, BEL షేర్లు లాభాల్లో.. పవర్‌గ్రిడ్, HUL, బజాజ్‌ఫైనాన్స్, ఇన్ఫీ, ICICI బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News February 9, 2026

స్కాములతో రేవంత్ చరిత్రలో నిలిచిపోతారు: హరీశ్

image

TG: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులో ఉందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను BRS MLA హరీశ్ రావు ఖండించారు. తమ పొత్తు ప్రజలతోనేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఏనాడూ బీజేపీతో కలవలేదన్నారు. సిద్దిపేటలో మాట్లాడుతూ ‘ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ సంక్షేమ పథకాలతో చరిత్రలో నిలిచిపోయారు. రేవంత్ రెడ్డి మాత్రం స్కాములతో చరిత్రలో నిలిపోతారు’ అని విమర్శించారు.

News February 9, 2026

NCERTలో 117 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

<>NCERT <<>>117 అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు టీచింగ్/ రీసెర్చ్ అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, Assist. ప్రొఫెసర్, Assist. లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. సైట్: www.ncert.nic.in