News August 7, 2025

‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడు?

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు తర్వాతే ఎలక్షన్స్‌కు వెళ్తామని CM రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయడమే INC ముందున్న అవకాశం. మరి రేవంత్ త్వరలోనే ఆ దిశగా ఎన్నికలకు వెళ్తారా? లేక కేంద్రం స్పందన కోసం ఇంకా వేచి చూస్తారా? అనేది తేలాలి. అటు గ్రామాల్లో పాలకవర్గాల కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

News August 7, 2025

రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

TG: హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో శుక్రవారం స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించినా, చాలా స్కూళ్లు సెలవు ఇవ్వలేదు. పబ్లిక్ హాలిడే ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు?

News August 7, 2025

మాజీ IPS రఘువీర్‌రెడ్డిపై విచారణకు ఆదేశం

image

AP: 2024లో నంద్యాల SPగా పని చేసిన మాజీ IPS రఘువీర్‌రెడ్డిపై వచ్చిన అభియోగాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నంద్యాల YCP అభ్యర్థి శిల్పా రవిని హీరో అల్లుఅర్జున్ కలిసిన సమయంలో భారీ ర్యాలీకి అనుమతించారని, అదే రోజు చంద్రబాబు పర్యటన ఉండగా వైసీపీ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారని ఆయనపై అభియోగాలున్నాయి. ఇతర ఆరోపణలపైనా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణను విచారణాధికారిగా CS నియమించారు.

News August 7, 2025

ప్రెగ్నెంట్ అని తెలిసినా కనికరించలేదు: రాధిక

image

తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సెట్‌లో ఎదురైన చేదు అనుభవాలను హీరోయిన్ రాధికా ఆప్టే పంచుకున్నారు. ‘నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నా. ఈ విషయం తెలిసి ఆ చిత్ర నిర్మాత కసురుకున్నారు. షూటింగ్‌లో టైట్ దుస్తులు ధరించాల్సి వచ్చింది. డాక్టర్‌ను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. నొప్పిగా ఉన్నా కూడా షూటింగ్ అలాగే కొనసాగించారు. అప్పుడు ఎంతో బాధపడ్డా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

News August 7, 2025

పోలీసులు, టీడీపీ నేతల కుమ్మక్కు: బొత్స

image

AP: రాష్ట్రంలో పోలీసులు, TDP నేతలు కుమ్మక్కై YCP నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి సర్కార్ దుష్ట పాలన చేస్తోందని మండిపడ్డారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బొత్స, కారుమూరి, కొట్టు, వెల్లంపల్లి కలిశారు. ‘కూటమి ప్రభుత్వ అరాచకాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల ZPTC ఎన్నిక నిర్వహించాలని కోరాం’ అని తెలిపారు.

News August 7, 2025

భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై CM రేవంత్ స్పందించారు. ‘భారీ వర్షాల సమాచారం దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. HYDలో భారీ వర్షసూచన దృష్ట్యా అధికారులు సమన్వయంతో పని చేయాలి. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు వెంటనే సంబంధిత సిబ్బంది చేరుకొని చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు.

News August 7, 2025

రోజూ మాంసం తింటే..!

image

ముక్క లేనిదే ముద్ద దిగదు అనేవారు ఎక్కువ కాలం జీవించలేరని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. రోజూ లేదా వారానికి మూడు కంటె ఎక్కువ సార్లు ప్రాసెస్డ్ & రెడ్ మీట్ తినడం ఆరోగ్యానికి హానికరం అని తేలింది. 4,75,000 మందిపై చేసిన అధ్యయనంలో మాంసం తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి 25 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. పరిమితంగా మాంసం తినొచ్చని సూచించారు.

News August 7, 2025

ధనుష్ సిస్టర్స్‌ను ఫాలో అవుతున్న మృణాల్.. నెట్టింట చర్చ

image

తమిళ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. వారం రోజులుగా ఇది జరుగుతున్నా ఇద్దరూ దీనిని ఖండించలేదు. ఇదిలా ఉండగా మృణాల్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో ధనుష్ సిస్టర్స్ అయిన కార్తీక, విమల గీతను ఫాలో అవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరు కూడా ఆమెను తిరిగి ఫాలో అవుతుండటం ప్రేమ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తోంది. కాగా వీరిద్దరూ ఇప్పటివరకూ కలిసి పనిచేయలేదు.

News August 7, 2025

KCRను జైలుకు పంపుతారా? CM రేవంత్ సమాధానమిదే..

image

TG: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా CM రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. KCRను జైలుకు పంపుతారా? అన్న ప్రశ్నకు ‘ఆయనను నేనెందుకు జైలులో వేస్తా. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు, చర్లపల్లి జైలుకు తేడా ఏముంది? కేసీఆర్ ఓడిపోవడమే పెద్ద శిక్ష. నేను విద్వేష రాజకీయాలు చేయను’ అని స్పష్టం చేశారు. ఇక బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కూడా ఉండే అవకాశం ఉందని సీఎం అన్నారు.

News August 7, 2025

ఆసియా కప్‌కు రిషభ్ పంత్ దూరం?

image

వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్‌కు గాయం కారణంగా టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు కూడా ఆయన అందుబాటులో ఉండరని సమాచారం. కాలి గాయం నుంచి పంత్ పూర్తిగా కోలుకునేందుకు దాదాపు నెలన్నర సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో క్రిస్ వోక్స్ వేసిన బంతికి పంత్ కాలికి గాయమైన విషయం తెలిసిందే.