India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపి మేనేజ్‌మెంట్ తప్పు చేస్తోందని పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అన్నారు. అతడిని మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపాలని అభిప్రాయపడ్డారు. ‘కోహ్లీ ఓపెనర్‌గా వచ్చి త్వరగా ఔటైతే భారత్ ఓడిపోయే ఛాన్స్ ఉంది. మూడో స్థానంలో దిగితే ఒత్తిడికి లోనవకుండా జట్టు గెలిచేవరకూ క్రీజులోనే ఉంటారు. కోహ్లీ ఓపెనింగ్ స్థానాన్ని వదులుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

TG: సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. ప్రజాపాలన పేరిట పేర్ల మార్పు కోసం కాంగ్రెస్ సర్కార్ రూ.4,639 కోట్లు వృథా చేస్తోందంటూ బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. దీనికి కౌంటర్‌గా ‘మీలా ఉన్నవి కూల్చి అనవసర కట్టడాలు కట్టి ఖజానాకు బొక్క పెట్టే రకం కాదు. ప్రభుత్వంపై బురద చల్లడమే మీ పని’ అని కాంగ్రెస్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినీ నిర్మాతగానూ పేరొందిన మీడియా మొఘల్ రామోజీరావు నటనపై ఆసక్తితో ఒక సినిమాలో నటించారు. 1978లో ‘మార్పు’ అనే సినిమాలో ఆయన న్యాయమూర్తిగా గెస్ట్ రోల్ చేశారు. ఆ సినిమా పోస్టర్లపై ఆయన ఫొటోను ముద్రించడం గమనార్హం. నటనపై ఆసక్తితో చిన్నతనంలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రామోజీరావు పాల్గొన్నారు. ఆ తర్వాత పలు రంగాల్లో ఆయన ఖ్యాతి గడించారు.

బారాబతి-కటక్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ ఒడిశాలో సంచలనం సృష్టించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా రికార్డులకెక్కారు. సోఫియా తండ్రి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ మోకిమ్‌పై అనర్హత వేటు పడడంతో ఆమె ఈ సారి పోటీ చేశారు. బీజేపీకి చెందిన పూర్ణచంద్ర మహాపాత్రపై 8 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కాగా సోఫియా భువనేశ్వర్‌లో సివిల్ ఇంజినీరింగ్, బెంగళూరులో ఈజీఎంపీ పూర్తి చేశారు.

ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకొని భంగపడ్డ మోదీ నాయకత్వ హక్కును కోల్పోయారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దుయ్యబట్టారు. వైఫల్యానికి బాధ్యత వహించాల్సింది పోయి, రేపు ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రదర్శన పేలవంగా ఉన్న రాష్ట్రాల్లో మెరుగవ్వడంపై తాము దృష్టి పెడుతామని మీడియాతో చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఇది కొత్త అవకాశమని పేర్కొన్నారు.

‘ఆదిపురుష్’లో రావణుడిని ఓ రౌడీలా చూపడం బాధించిందని రామాయణ్ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా అన్నారు. ‘శివ భక్తుడైన రావణుడిలో చాలా మంచి లక్షణాలున్నాయి. సీతను అపహరించడమే ఆయన చేసిన తప్పు. సీతను గులాబీ రంగు చీరలో చూపడం, రావణుడిని భిన్నమైన ఆహార్యంలో చూపడం నచ్చలేదు. సినిమాను కొంత చూసేసరికే తట్టుకోలేకపోయా. రామాయణం గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.

TG: గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని TG CMO ట్వీట్ చేసింది. ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని తెలిపారని, అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొంది. కాగా ఉదయం 10 గంటలలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని TGPSC సూచించింది. రేపు జరిగే పరీక్ష కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్‌గా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఎంపీలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీపీ ఛైర్‌పర్సన్‌గా ఆమె పేరుతో పాటు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, సుదర్శన్ పేర్లను నేతలు ప్రతిపాదించారు. ఈ క్రమంలో నేతలంతా సోనియావైపు మొగ్గుచూపారు.

NDA ప్రభుత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందో చూస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, CAAను ఎత్తివేయాలని పార్లమెంటులో డిమాండ్ చేస్తామని మీడియాతో చెప్పారు. అన్ని రాష్ట్రాలకు పెండింగ్ నిధులను కేంద్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ కేంద్రంలో INDIA కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా.. రేపు పరిస్థితి మారవచ్చని పేర్కొన్నారు.

టీ20 వరల్డ్ కప్‌లో చిన్న జట్లు సంచలనాలు సృష్టిస్తున్నాయి. నాలుగు గ్రూపుల్లో మూడు చిన్న జట్లే టేబుల్ టాపర్లుగా ఉండటం దీనికి నిదర్శనం. గ్రూప్-ఏలో USA(4P), గ్రూప్-బీలో స్కాట్లాండ్(3P), గ్రూప్-సీలో అఫ్గానిస్థాన్(4P) టాపర్లుగా ఉన్నాయి. గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా(2P) తొలి స్థానంలో ఉంది. అయితే మ్యాచులు జరిగే కొద్ది టేబుల్ టాపర్లు మారే అవకాశం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.