India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముస్లిం యువకుడు, హిందూ యువతి పెళ్లి చేసుకోవడం ముస్లిం లా ప్రకారం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా తీర్పుచెప్పింది. మతాంతర వివాహంగా రిజిస్టర్ అయ్యేందుకు అనుమతినివ్వాలని, తమకు రక్షణ కల్పించాలని ఓ జంట చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇద్దరూ మతం మార్చుకోవడానికి సిద్ధంగా లేరని, ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నప్పటికీ ముస్లిం లా ప్రకారం చట్టబద్ధంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

ఈ ఏడాది ఐపీఎల్ ప్రసారంలో కొత్త రికార్డుల్ని సృష్టించినట్లు జియో సినిమా ప్రకటించింది. ఈ సీజన్‌లో 62 కోట్ల వీక్షణలు నమోదైనట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 53శాతం ఎక్కువ. ఇక వీక్షణ సమయం 35వేల కోట్ల నిమిషాలుగా ఉందని తెలిపింది. గత ఏడాది తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ ఏడాది తొలిమ్యాచ్‌ను 51శాతం ఎక్కువగా (11.3 కోట్లమంది) చూశారని పేర్కొంది. ప్రేక్షకుడు సగటున 75 నిమిషాలను వెచ్చించారని చెప్పింది.

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశానికి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పారు. ‘ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో 421 సార్లు మత, విభజన వాద వ్యాఖ్యలు చేశారు. కులమతాల ఆధారంగా ఓట్లు అభ్యర్థించకూడదని ఈసీ నిబంధనలు ఉన్నా వాటిని ఉల్లంఘించారు. 758 సార్లు తన సొంత పేరే తలుచుకున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు.

AP: దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదేరోజు YCP అధికారంలోకి వచ్చిందని CM జగన్ ట్వీట్ చేశారు. ‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మన పార్టీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది’ అంటూ గతంలో ప్రమాణస్వీకారం చేసిన ఫొటోను పోస్ట్ చేశారు.

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 617 పాయింట్లు కోల్పోయి 73,885కు చేరగా నిఫ్టీ 216 పాయింట్ల నష్టంతో 22,488 వద్ద స్థిరపడింది. ఎన్నికల ఫలితాలు సహా రిలయన్స్, ఇన్ఫోసిస్, TCS వంటి బడా షేర్లు ఒడుదొడుకులకు గురవడం మార్కెట్‌పై ప్రభావం చూపించింది. US వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మిన్నియాపోలిస్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు సైతం ప్రభావం చూపాయి.

సార్వత్రిక ఎన్నికలు-2024ల్లో చివరి దశ ప్రచారం ముగిసింది. ఈ ఫేజ్‌లో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇందులో యూపీలోని వారణాసి నుంచి ప్రధాని మోదీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో నటి కంగన వంటి ప్రముఖులు ఈ పోటీ చేస్తున్నారు. జూన్ 1తో 7 దశల పోలింగ్ ముగియనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో మొత్తం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అఖ్నూర్ వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 15 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

AP: ఓట్ల లెక్కింపు సమయంలో అలజడులు సృష్టిస్తే తక్షణమే అరెస్ట్ చేస్తామని సీఈవో ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలన్నారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దని ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గేయాన్ని మార్చే నిర్ణయాన్ని ప్రొఫెసర్ గంటా చక్రపాణి తప్పుబట్టారు. రాష్ట్రంలో రాచరిక ఆనవాళ్లకు చోటు లేదని చెబుతూ సీఎం రేవంత్ వీటిని మారుస్తున్నారని చెప్పారు. అలాగే రాచరికపు అవశేషం, పౌరుషం ఫ్యూడలిజపు ప్రతిరూపం అయిన మీసాన్ని కూడా కొరిగెయ్యండి అంటూ Xలో పోస్ట్ చేశారు. మార్పుల విషయంలో ఇప్పటికే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

* ఉచితంగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14 వరకే అవకాశం ఉంది.
* ఇకపై ప్రతినెలా 1న చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి.
* జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌కి అర్హత సాధించవచ్చు.
* మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.25 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
Sorry, no posts matched your criteria.