India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ, సంగీతం అందించిన కీరవాణిని ప్రభుత్వం సన్మానించనుంది. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్‌స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. 700 మందితో తెలంగాణ కళారూపాల కార్నివాల్, 70ని.షాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, 5వేల మందితో జాతీయ జెండాలతో ఫ్లాగ్‌వాక్ ఉంటుంది. ఫ్లాగ్‌వాక్ సమయంలో తెలంగాణ గీతం విడుదలవుతుంది.

జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. తాను ఆహ్వానిస్తున్నట్లుగా లేఖను స్వయంగా అందించాలంటూ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ను ఆయన ఆదేశించారు. లేఖతో పాటు ఆహ్వాన పత్రాన్ని వేణుగోపాల్ రేపు కేసీఆర్‌కు అందించే అవకాశం ఉంది. మరోవైపు దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కానున్నారు.

జర్మనీకి చెందిన లారెంట్ ష్వార్జ్ వయసు రెండేళ్లే. కానీ అతడు వేసే పెయింటింగ్స్ మాత్రం వేలాది డాలర్లకు అమ్ముడుపోతున్నాయి. గత ఏడాది లారెంట్‌లోని కళను గుర్తించిన పేరెంట్స్ అతడి కోసం ప్రత్యేకంగా ఓ ఆర్ట్ స్టూడియోను రూపొందించారు. అతడి పెయింటింగ్స్‌ను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. వాటికి డిమాండ్ పెరగడంతో ఆన్‌లైన్‌లో ఇప్పుడు వేలాది డాలర్లకు విక్రయిస్తుండటం గమనార్హం.

TG: రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 3 చరణాలతో 2.30 నిమిషాల నిడివితో సంక్షిప్త గీతాన్ని రూపొందించినట్లు చెప్పారు. అధికారిక చిహ్నం ఇంకా ఖరారు కాలేదని, తెలంగాణ తల్లి రూపంపైనా అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.

లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలంటూ వేలసంఖ్యలో మహిళలు రోడ్డుపైకి వచ్చారు. కర్ణాటకలోని హాసన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి ప్రజ్వల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ కేసు వెలుగుచూసిన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ప్రజ్వల్ ఇవాళ అర్ధరాత్రి స్వదేశానికి రానున్నారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా కాకతీయ కళా తోరణాన్ని ముఖద్వారంగా ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజముద్రలో రాచరిక ఆనవాళ్లుగా కాకతీయ తోరణం, చార్మినార్ ఉన్నాయని, వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ వరల్డ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను ఓ లెవెల్‌లో నిర్వహిస్తూ హంగామా చేస్తోంది. ఇదే ఊపులో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అన్నీ కలిసొస్తే జూన్ 7న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

AP: జూన్ 3న సచివాలయంలోని మంత్రుల పేషీలు, ఛాంబర్లను ఖాళీ చేయించి, స్వాధీనం చేసుకోవాలని అధికారులను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. సచివాలయం నుంచి ఎలాంటి సామగ్రి బయటికి వెళ్లకుండా చూడాలని సూచించింది. తమ అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తరలించొద్దని స్పష్టం చేసింది. కాగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.

పుణే పోర్షె కేసు సంచలనమైన వేళ ఓ వ్యక్తి తనదైన శైలిలో వాహనదారులకు వార్నింగ్ ఇచ్చాడు. 300 పదాల వ్యాసం రాయగలిగినా సరే తన వాహనానికి తగిన దూరం పాటించాలంటూ ఓ నోట్ తన కారుకు అంటించాడు. పుణే పోర్షె కేసులో 300 పదాల వ్యాసం రాయాలని కోర్టు ఇటీవల నిందితుడిని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఓ కారుపై దర్శనమిచ్చిన ఈ నోట్ నెట్టింట వైరలవుతోంది.

తెలంగాణ రాజముద్ర మార్పుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో పాటు ఓ వర్గం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొత్త చిహ్నానికి 200కు పైగా సూచనలు వచ్చాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఆవిష్కరణ వాయిదా పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరికాసేపట్లో స్పష్టత రానుంది.
Sorry, no posts matched your criteria.