India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సార్వత్రిక ఎన్నికలు-2024ల్లో చివరి దశ ప్రచారం ముగిసింది. ఈ ఫేజ్‌లో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇందులో యూపీలోని వారణాసి నుంచి ప్రధాని మోదీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో నటి కంగన వంటి ప్రముఖులు ఈ పోటీ చేస్తున్నారు. జూన్ 1తో 7 దశల పోలింగ్ ముగియనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో మొత్తం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అఖ్నూర్ వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 15 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

AP: ఓట్ల లెక్కింపు సమయంలో అలజడులు సృష్టిస్తే తక్షణమే అరెస్ట్ చేస్తామని సీఈవో ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలన్నారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దని ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గేయాన్ని మార్చే నిర్ణయాన్ని ప్రొఫెసర్ గంటా చక్రపాణి తప్పుబట్టారు. రాష్ట్రంలో రాచరిక ఆనవాళ్లకు చోటు లేదని చెబుతూ సీఎం రేవంత్ వీటిని మారుస్తున్నారని చెప్పారు. అలాగే రాచరికపు అవశేషం, పౌరుషం ఫ్యూడలిజపు ప్రతిరూపం అయిన మీసాన్ని కూడా కొరిగెయ్యండి అంటూ Xలో పోస్ట్ చేశారు. మార్పుల విషయంలో ఇప్పటికే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

* ఉచితంగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14 వరకే అవకాశం ఉంది.
* ఇకపై ప్రతినెలా 1న చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి.
* జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌కి అర్హత సాధించవచ్చు.
* మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.25 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

ఓట్ల లెక్కింపును కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ గదిలో ఉండి పర్యవేక్షించవచ్చు. కానీ, వారు EVMల దగ్గరికి వెళ్లడం, ఆపరేట్ చేయడం కుదరదు. EVM ఉన్న ప్రతి కౌంటింగ్ టేబుల్ చుట్టూ బారికేడ్లు ఉంటాయి. ఓట్ల లెక్కింపును చూసేందుకు ఏజెంట్ల కోసం అన్ని సౌకర్యాలు ఉంటాయి. కౌంటింగ్ ఏజెంట్‌ను అభ్యర్థులు నియమించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్‌గా వ్యవహరించలేరు. <<-se>>#ELECTIONS2024<<>>

తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద <<13340790>>రాక్<<>> మెమోరియల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. 1892లో స్వామి వివేకానంద.. ఈ ప్రాంతంలో ధ్యానం చేశారు. ఓ రాయిపై మూడు రోజుల పాటు ధ్యానం చేసిన అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయిందని చెబుతారు. తదనంతరం వివేకానంద గౌరవార్థం ఈ మెమోరియల్‌ను సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో 1970లో నిర్మించారు. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి దీన్ని ప్రారంభించారు. ఈ ప్రదేశం సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గతకొన్ని రోజులుగా ప్రధాని మోదీ చేస్తున్న ప్రచారానికి నేడు తెరపడింది. ఆఖరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో పర్యటించిన మోదీ అక్కడ చివరి ప్రసంగం చేశారు. నిర్విరామ ప్రచారం నుంచి సేదతీరేందుకు మోదీ కన్యాకుమారిలోని ధ్యానమండపంలో జూన్ 1 వరకు ధ్యానం చేస్తారు. కాగా 200కుపైగా ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ, 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు.

AP: విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్, భారతి దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకోనున్నారు. కాగా ఎన్నికలతో బిజీబిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి పయనమవుతున్నారు.

TG: ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. అధికారిక చిహ్నం, రాష్ట్ర గీతం మార్పుపై ప్రజాభిప్రాయం తీసుకుందా అని BJP MP బండి సంజయ్ ప్రశ్నించారు. సమస్యలను పక్కదారి పట్టించడంలో BRS, కాంగ్రెస్ రెండూ ఒకటేనని విమర్శించారు. చార్మినార్ అంటే HYD అంటున్న KCR కొడుకును అక్కడున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లకుండా అడ్డుకున్నదేమిటని ప్రశ్నించారు. HYD అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ అని బండి స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.