News November 1, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.1,23,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,12,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,66,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 1, 2025

టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు: చంద్రబాబు

image

AP: టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగుతామని పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని తెలిపారు. ఇకపై వారంలో తానొక రోజు, లోకేశ్ ఒకరోజు టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉంటామని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తే తమ ప్రభుత్వం గాడిలో పెట్టిందని పేర్కొన్నారు.

News November 1, 2025

నార్త్ యూరప్‌లో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్!

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR హీరోగా నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో పునః ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. నార్త్ యూరప్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయాలని డైరెక్టర్ నీల్ ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News November 1, 2025

నేడే ప్రబోధిని ఏకాదశి.. ఇలా చేస్తే కోటిరెట్ల పుణ్యం

image

తొలి ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణ కథనం. ఈరోజంతా ఉపవాసం ఉంటూ, హరి నామస్మరణతో రాత్రి జాగరణ చేస్తే.. పుణ్యక్షేత్ర దర్శనం కన్నా కోటి రెట్ల ఫలం ఉంటుందని నారద పురాణం పేర్కొంది. అన్నదానం, నదీ స్నానాలతో అపమృత్యు దోషానికి పరిహారం లభిస్తుందని నమ్మకం.
☞ ప్రబోధిని ఏకాదశి విశేషాలు, కార్తీక మాస నియమాలు, ఇతర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>>.

News November 1, 2025

ఈ క్షేత్రం నుంచే శివుడు లోకాలను కాపాడుతున్నాడట

image

ఉజ్జయిని మహాకాళేశ్వర్‌లో శివుడు స్వయంగా మహాకాలుడిగా వెలసి, కాల స్వరూపంలో కొలువై ఉన్నాడు. ఇక్కడి నుంచే శివుడు కాలానికి అధిపతిగా ఉండి, సకల లోకాలను, సమస్త జీవరాశిని రక్షిస్తున్నాడని ప్రగాఢ విశ్వాసం. శివ పురాణంలో చెప్పినట్లుగా, ఈ స్వయంభూ లింగం శక్తి ప్రవాహాలను వెలువరిస్తూ, భక్తులను అకాల మృత్యువు నుండి, కాల భయం నుండి కాపాడుతూ, నిరంతరం రక్షా కవచంగా నిలుస్తుంది. ఆ మహాదేవుడి రక్షణే మనకు రామరక్ష.

News November 1, 2025

IVFలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా..?

image

సహజంగా తల్లిదండ్రులు కాలేని దంపతులకు IVF ఒక వరం. ఇందులో 45-50% సక్సెస్ రేట్ ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. సంతానోత్పత్తి మందుల కారణంగా మానసికకల్లోలం, తల, కడుపు నొప్పి, వేడిఆవిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్(OHSS) వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మహిళల అండాశయాలు ఉబ్బి శరీరంలోకి ద్రవాన్ని లీక్ చేయవచ్చు.

News November 1, 2025

ఆధార్ అప్‌డేట్స్.. నేటి నుంచి మార్పులు

image

✦ ఆధార్‌లో పేరు, అడ్రస్, DOB, ఫోన్ నంబర్‌ను సేవా కేంద్రానికి వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌(₹75 ఛార్జీ)లో మార్చుకోవచ్చు. ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫొటో అప్‌డేట్ కోసం మాత్రం వెళ్లాలి.
✦ UIDAI కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. డెమోగ్రాఫిక్ వివరాల మార్పునకు ₹75, బయోమెట్రిక్స్‌కు ₹125 చెల్లించాలి. 2026, JUN 14 వరకు ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌డేషన్ ఫ్రీ
✦ 2025, DEC 31లోపు ఆధార్-పాన్ లింక్ తప్పనిసరి

News November 1, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

✦ జూబ్లీహిల్స్ బైపోల్: ఇవాళ రాత్రి బోరబండ, ఎర్రగడ్డలో CM రేవంత్ ప్రచారం
✦ నేడు సా.6 గంటలకు రహమత్ నగర్‌లో KTR రోడ్ షో
✦ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కొత్తగా 75 PG సీట్లు మంజూరు చేసిన NMC.. 1390కి చేరిన సీట్ల సంఖ్య
✦ భవిత కేంద్రాల్లో పని చేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకూ TET మినహాయింపు కుదరదు: హైకోర్టు
✦ గద్వాల(D) ధర్మవరం BC హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 86 మంది విద్యార్థులకు అస్వస్థత

News November 1, 2025

పంటకు ఎరువులను ఇలా అందిస్తే ఎక్కువ లాభం

image

అవసరాన్ని బట్టి మాత్రమే యూరియాను పంటకు వేసుకోవాలి. మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల చీడపీడల ఉద్ధృతి ఎక్కువై పంటల దిగుబడి తగ్గుతుంది. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా 3 దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు.
సూక్ష్మపోషకాలను పంటలకు స్ప్రే రూపంలో అందిస్తే మొక్క వేగంగా గ్రహిస్తుంది.

News November 1, 2025

IUCTEలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(IUCTE)10 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: www.iucte.ac.in