News November 21, 2024

బోర్లా పడుకుంటున్నారా?

image

సౌకర్యంగా నిద్రపోయేందుకు మనం వివిధ భంగిమల్లో పడుకుంటాం. అయితే బోర్లా పడుకుంటే ముఖ చర్మంపై ఎక్కువ ఒత్తిడి పడుతుందని వైద్యులు చెబుతున్నారు. నిద్రపోతున్నప్పుడు ముఖంపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలంటున్నారు. వెల్లకిలా లేదా ఎడమవైపు తిరిగి పడుకున్నప్పటి కంటే కుడివైపు పడుకున్నప్పుడే హాయిగా నిద్రపట్టే అవకాశాలు అధికంగా ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. పక్కకు తిరిగి పడుకోవడం వల్ల గురక సమస్య తక్కువగా ఉంటుందట.

News November 21, 2024

బిట్ కాయిన్ స్కాం: అవి ఫేక్ ఆడియోలు!

image

మహారాష్ట్ర PCC చీఫ్ నానా పటోలే, NCP SP సుప్రియా సూలే, గౌరవ్ మెహతా Bit Coin <<14658660>>స్కాంకు<<>> పాల్ప‌డ్డారంటూ వైర‌ల్ అవుతున్న ఆడియో టేప్‌లు డీప్ ఫేక్ AI జ‌న‌రేటెడ్ ఆడియోల‌ని India Today అధ్య‌య‌నంలో తేలింది. దీని కోసం TrueMedia, Deefake-O-Meter, Hiya AI టూల్స్‌ను ఉపయోగించింది. నానా ప‌టోలే, సుప్రియా సూలే ఆడియోలు చాలావ‌ర‌కు డీప్ ఫేక్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్టు వెల్ల‌డించింది. ఈ ఆడియోల‌ను BJP కూడా పోస్ట్ చేసింది.

News November 21, 2024

CBSE 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల

image

వ‌చ్చే ఏడాది జ‌రిగే బోర్డు ప‌రీక్ష‌ల‌కు CBSE షెడ్యూల్ ప్ర‌క‌టించింది. 10, 12 తరగతుల ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. పది పరీక్షలు మార్చి 18 వరకు, 12వ తరగతి ఎగ్జామ్స్ ఏప్రిల్ 4 వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని CBSE తెలిపింది. పూర్తి వివ‌రాల‌ను ఈ <>లింకులో<<>> పొందండి.

News November 20, 2024

నిన్న అమెరికా.. నేడు బ్రిటన్ క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్

image

అమెరికా లాంగ్ రేంజ్ క్షిప‌ణుల‌ను రష్యాపై ప్రయోగించి కాక పుట్టించిన ఉక్రెయిన్ తాజాగా బ్రిటిష్ క్రూయిజ్ క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించింది. ర‌ష్యా వైమానిక స్థావ‌రాలే ల‌క్ష్యంగా దాడి చేసింది. నార్త్ కొరియా బ‌ల‌గాల‌ను ర‌ష్యా మోహ‌రించిన కార‌ణంగా త‌మ స్టార్మ్‌షాడో క్షిప‌ణుల వినియోగానికి ఉక్రెయిన్‌కు UK అనుమ‌తించింది. ఇరు దేశాల యుద్ధం తారస్థాయికి చేరడంతో రష్యా ప్రతిచర్యలపై ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది.

News November 20, 2024

క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ అమ్మక తప్పదా?

image

క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్నెట్ సెర్చ్ మార్కెట్‌లో గూగుల్ గుత్తాధిపత్యంపై కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ బ్యాలెన్స్ అవ్వాలంటే క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ విక్రయించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అమెరికా న్యాయశాఖ(DoJ) కోరింది. అయితే.. క్రోమ్‌ను విక్రయిస్తే తమ వ్యాపారాలకు, వినియోగదారులకు నష్టం వాటిల్లుతుందని గూగుల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

News November 20, 2024

మీ నిర్లక్ష్య వైఖరికి ఎంత మంది బలికావాలి?: హరీశ్ రావు

image

TG: నారాయణపేట(D) మాగనూర్ ZP స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు <<14664383>>అస్వస్థతకు<<>> గురవడంపై హరీశ్ మండిపడ్డారు. ‘వాంకిడి స్కూల్‌లో ఫుడ్ పాయిజన్‌తో పిల్లాడు వెంటిలేటర్‌పై ఉన్నాడు. నల్గొండలో పాము కాటుతో విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు మరో ఘటన జరిగింది. మీ నిర్లక్ష్య వైఖరికి ఎంతమంది బలికావాలి? ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుకునేది?’ అని నిలదీశారు.

News November 20, 2024

నాయకత్వంలో బుమ్రా ఎప్పుడూ ముందుంటారు: మోర్కెల్

image

టీమ్ ఇండియా పేసర్ బుమ్రాపై బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ప్రశంసలు కురిపించారు. నాయకత్వానికి సంబంధించి ఎప్పుడూ ఆయన ముందుంటారని ప్రశంసించారు. ‘బుమ్రా గతంలోనూ ఆస్ట్రేలియాలో విజయవంతమయ్యారు. డ్రెస్సింగ్ రూమ్‌లో స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తారు. ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన తెలివైన ఆటగాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో సవాళ్లను బుమ్రా కచ్చితంగా అధిగమిస్తారు. తనో సహజమైన నాయకుడు’ అని పేర్కొన్నారు.

News November 20, 2024

చలి పెరుగుతోంది.. జాగ్రత్త: ప్రభుత్వం

image

TG: క్రమంగా చలి పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు, బాలింతలు, పిల్లలు, కార్మికులు, రైతులు, నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎక్కువ రోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుండి రక్తం కారడం లాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలంది. ఈ మేరకు ఓ అడ్వైజరీ నోట్‌ను విడుదల చేసింది.

News November 20, 2024

ధైర్యం సరిపోవడంలేదా చిట్టినాయుడు?: KTR

image

TG: మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నిమిషానికి 40 సార్లు KCR రావాలే అని తెగ అరుస్తావు! అసెంబ్లీలో కేసీఆర్ ముందు నిల్చునే మాట దేవుడెరుగు, కనీసం మహబూబాబాద్‌లో మహాధర్నాకు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవడంలేదా చిట్టినాయుడు?’ అని ఎద్దేవా చేస్తూ Xలో పోస్ట్ చేశారు.

News November 20, 2024

ఓటర్లను అడ్డుకున్న UP పోలీసులు.. ఏడుగురు స‌స్పెండ్‌

image

యూపీలో ఉపఎన్నిక‌లు ఉద్రిక్తంగా మారాయి. మీరాపూర్‌లో ఓట‌ర్ల‌పై పోలీసు తుపాకీ ఎక్కుపెట్ట‌డం సంచ‌ల‌న‌మైంది. ముస్లిం ఓట‌ర్లు ఓటు వేయ‌కుండా పోలీసులు అడ్డుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అఖిలేశ్ యాద‌వ్‌ విడుద‌ల చేసిన‌ వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఓట‌ర్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులు ఓట‌ర్ల స్లిప్పుల‌ను ప‌రిశీలించి అడ్డ‌గించ‌డం వివాద‌మైంది. దీంతో ఏడుగురు పోలీసులను ఎన్నిక‌ల సంఘం సస్పెండ్ చేసింది.