News August 7, 2025

ఉపరితల ఆవర్తనం.. 2 రోజులు భారీ వర్షాలు

image

AP: రాయలసీమతో పాటు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, NTR, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

News August 6, 2025

కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ MLA

image

TG: బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. తనను చంపుతామని బెదిరింపులు వచ్చినా ఆయన పట్టించుకోలేదని వాపోయారు. ‘2009లో బలవంతంగా ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. 2014, 2018లోనూ ఎంపీ బీఫామ్ ఇవ్వాలని చూశారు. అచ్చంపేటలో నాపై దాడులు జరిగినా ప్రశ్నించలేదు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనలో పట్టించుకోలేదు’ అని విమర్శలు చేశారు.

News August 6, 2025

హెలికాప్టర్ ప్రమాదంలో ‘ఘనా’ మంత్రులు మృతి

image

ఘనా దేశ రక్షణ మంత్రి, పర్యావరణశాఖ మంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆక్రా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వారి హెలికాప్టర్ రాడార్ నుంచి అదృశ్యమైందని అధికారులు పేర్కొన్నారు. మంత్రులు ఎడ్వర్డ్ ఒమేన్ బోమా, ఇబ్రహీం ముర్తాలా మహ్మద్ సహా 8 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ‘మంత్రులు, జవాన్లు దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారు’ అని ఘనా ప్రభుత్వం సంతాపం తెలియజేసింది.

News August 6, 2025

ట్రంప్‌ను లెక్కచేయని భారత్.. రష్యాతో కీలక ఒప్పందం

image

ట్రేడ్‌ రిలేషన్స్‌, సహకారం మరింత పెంచుకునేందుకు భారత్, రష్యా ప్రొటోకాల్‌ డీల్‌పై సంతకాలు చేశాయి. ఢిల్లీలో జరిగిన మాడర్నైజేషన్&కోఆపరేషన్ వర్కింగ్ గ్రూప్ సెషన్‌లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అల్యూమినియం, ఫెర్టిలైజర్స్, రైల్వేస్, మైనింగ్ టెక్నాలజీ తదితర సెక్టార్స్‌పై చర్చించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి. రష్యాతో సంబంధాలపై ట్రంప్ హెచ్చరిస్తున్నా భారత్ లెక్కచేయకపోవడం గమనార్హం.

News August 6, 2025

ఇది అన్యాయం, అసమంజసం: భారత్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు విధించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తీరు అత్యంత దురదృష్టకరమని అభివర్ణించింది. ఇది ఎంతో అన్యాయమని, అకారణమని, అసమంజసమని స్పష్టం చేసింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు చేపడుతుందని పునరుద్ఘాటించింది. ఇతర దేశాలు కూడా తమ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు.

News August 6, 2025

ఇందిరా గాంధీని మోదీ ఆదర్శంగా తీసుకోవాలి: కాంగ్రెస్

image

ఇండియాపై టారిఫ్స్‌ను ట్రంప్ 50%కి పెంచడంతో PM మోదీపై కాంగ్రెస్ ఫైరైంది. ‘2019లో హౌడీ మోదీ ఈవెంట్ నుంచి పాక్‌తో సీజ్‌ఫైర్ వరకు ట్రంప్‌కు మోదీ మద్దతుగా నిలిచారు. అన్ని విషయాల్లో మౌనం పాటించారు. అయినా ట్రంప్ టారిఫ్స్ విధించడం మోదీ వైఫల్యమే. ఇందిరాగాంధీ USను ధైర్యంగా ఎదుర్కొన్నారు. మోదీ ఈగోను పక్కనపెట్టి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఫారిన్ పాలసీ మారాలి’ అని INC జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

News August 6, 2025

భారత్‌పై 50% టారిఫ్స్.. అమల్లోకి ఎప్పటినుంచంటే?

image

ఇటీవల భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 25శాతం సుంకాలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్ తెలిపింది. తాజాగా విధించిన 25శాతం అదనపు టారిఫ్‌లు 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 50శాతం సుంకాలు వర్తించనున్నాయి. ఫలితంగా ఆసియాలో చైనా(51శాతం) తర్వాత అత్యధిక టారిఫ్‌లు ఎదుర్కొంటున్న దేశం భారతే కానుంది.

News August 6, 2025

టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు

image

అఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు సృష్టించారు. టీ20 క్రికెట్ చరిత్రలో 650 వికెట్ల మైలురాయిని దాటిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు. ENGలో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు. ఓవల్ ఇన్విన్సిబుల్ తరఫున లండన్ స్పిరిట్స్‌పై 3 వికెట్లు తీశారు. దీంతో మొత్తంగా 478 ఇన్నింగ్స్‌ల్లో 651 వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్రావో(631), నరైన్(589), తాహీర్(547), షకీబ్(498) ఉన్నారు.

News August 6, 2025

APCC వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం

image

AP: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇద్దరు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. జేడీ శీలం, మస్తాన్ వలీను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. అటు పొలిటికల్ అఫైర్స్ <>కమిటీ<<>> ఏర్పాటుకు కూడా ఖర్గే ఆమోదం తెలిపారు. మాణికం ఠాగూర్ అధ్యక్షతన వైఎస్ షర్మిల, రఘువీరా సహా మొత్తం 25 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

News August 6, 2025

అశ్లీల చిత్రాల్లో నటిస్తోందని నటిపై కేసు

image

మలయాళ నటి శ్వేతా మేనన్‌పై కేసు నమోదైంది. అశ్లీల, అసభ్యకర చిత్రాల్లో నటిస్తున్నారంటూ ఆమెపై ఫిర్యాదు రాగా దర్యాప్తు చేయాలని ఎర్నాకులం మెజిస్ట్రేట్ కోర్ట్ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు FIR నమోదు చేశారు. మనీ, పాపులారిటీ కోసం అశ్లీల కంటెంట్‌ను SM, అడల్డ్ సైట్లలోనూ పోస్ట్ చేస్తున్నారంటూ FIRలో పేర్కొన్నారు. రతి నిర్వేదం, సాల్ట్ N’ పెప్పర్, కలిమన్ను వంటి చిత్రాల్లో శ్వేత నటించారు.