News October 3, 2024

అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు

image

TG: మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు అందజేసింది. HCA అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. 2020-23 మధ్య కాలంలో HCAలో దాదాపు రూ.3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఉప్పల్ PSలో ఫిర్యాదులు నమోదయ్యాయి.

News October 3, 2024

మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తారు?: లావణ్య

image

TG: అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మెగా హీరో వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠి స్పందించారు. ‘సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఓ మహిళే తన తోటి మహిళను అవమానించడం సిగ్గుచేటు. ఎందుకు ఎప్పుడూ మమ్మల్నే టార్గెట్ చేస్తారు?’ అని ఫైర్ అయ్యారు. మరోవైపు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా స్పందించారు. ఈ వ్యాఖ్యల వల్ల బాధిత మహిళలు తీవ్ర క్షోభ అనుభవిస్తారని చెప్పారు.

News October 3, 2024

మంత్రి కామెంట్స్ చూసి షాకయ్యా: IAS స్మిత

image

TG: మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చూసి షాకయ్యానని ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ‘ప్రతిచోట మహిళలు వివక్ష, అవమానాలను ఎదుర్కొంటున్నారు. కొందరు సంచలనాల కోసం థంబ్‌నైల్స్‌గా వాడుకుంటారు. ఆఫీసర్లనూ వదలరు. నా వ్యక్తిగత అనుభవం ప్రకారం మాట్లాడుతున్నా. ప్రతి అంశాన్ని రాజకీయపరంగా చూడొద్దు’ అని కోరారు.

News October 3, 2024

దేవర: ఎన్టీఆర్ అభిమానులకు మళ్లీ నిరాశ!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించలేకపోతున్నామని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. ‘ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దవడంతో తన అభిమానులతో విజయోత్సవ ఈవెంట్‌ను నిర్వహించాలని తారక్ అన్న నిశ్చయించుకున్నారు. కానీ, దసరా, దేవీ నవరాత్రుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేడుకలకు అనుమతులు రావట్లేదు. అభిమానులు, ప్రేక్షకులు క్షమించాలి. అయినప్పటికీ ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు.

News October 3, 2024

సీజ్ ఫైర్‌కు సమ్మతించినా నస్రల్లాను చంపారు: లెబనాన్ మంత్రి

image

కాల్పుల విరమణకు అంగీకరించినా హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చిందని లెబనాన్ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్ తెలిపారు. ‘హత్యకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించారు. ఇందుకు సంబంధించి అమెరికా, ఫ్రాన్స్ ప్రతినిధులకు కూడా తెలియజేశాం. కానీ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన కాసేపటికే బంకర్‌లో తలదాచుకున్న నస్రల్లాను నెతన్యాహు హత్య చేయించారు’ అని ఆయన వెల్లడించారు.

News October 3, 2024

మౌనంగా ఉండను.. మంచు విష్ణు వార్నింగ్

image

ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడొద్దని ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘వినోదాన్ని అందించడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దు. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇలాంటి ఘటనలు ఎంతో బాధను కలిగిస్తాయి. నా చిత్ర పరిశ్రమను ఎవరైనా బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండను. మేమంతా ఏకమై నిలబడతాం’ అని హెచ్చరించారు.

News October 3, 2024

పేదలపై సీఎం రేవంత్ ప్రతాపం: కిషన్ రెడ్డి

image

TG: ప్రజల ఆవేదన, మనోవేదనను అర్థం చేసుకుని కూల్చివేతలు ఆపాలని సీఎం రేవంత్‌కు లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పేదలపై రేవంత్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘డ్రైనేజీ సమస్య తీర్చకుండానే మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డ్రైనేజీ పైపులను మూసీలో కలుపుతున్నారు. కలుషితమైన నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

News October 3, 2024

నిరుద్యోగులకు ALERT.. నేడు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రారంభం

image

యువత కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన ‘PM INTERNSHIP’ పథకానికి సంబంధించిన పోర్టల్ ఇవాళ ప్రారంభం కానుంది. 21-24 ఏళ్ల నిరుద్యోగులు ఈ నెల 12 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. వారి విద్యార్హత, ఆసక్తి ఉన్న రంగాలను బట్టి టాప్-500 కంపెనీలలో 12 నెలల ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుంది. నైపుణ్య శిక్షణతోపాటు ఒకేసారి రూ.6,000, ప్రతి నెలా రూ.5,000 అలవెన్సును అందజేస్తుంది.

News October 3, 2024

GST: కొన్నిటిపై పెంపు.. మరికొన్నిటిపై తగ్గింపు!

image

మెడిసిన్స్, ట్రాక్టర్స్ సహా ఎక్కువ ఉపయోగించే ఐటమ్స్‌పై GST రేటును 5 శాతానికి తగ్గించాలని మంత్రుల ప్యానెల్ యోచిస్తోందని తెలిసింది. సిమెంటు, టొబాకో వంటి వాటిపై 28% కొనసాగొచ్చు. ప్రస్తుతం కొన్ని ట్రాక్టర్లపై 12 లేదా 28% వరకు ట్యాక్స్ ఉంది. హై ఎండ్ EVs, రూ.40 లక్షల కన్నా విలువైనవి, ఇంపోర్ట్ వెహికల్స్‌పై 5% నుంచి పెంచొచ్చు. కేరళ సహా సౌత్ స్టేట్స్ ఇష్టపడకపోవడంతో శ్లాబుల్ని తగ్గించే పరిస్థితి లేదు.

News October 3, 2024

విరాట్ ఓ గొప్ప ఆటగాడు: హర్భజన్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ దాదా ప్లేయర్ అని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసించారు. ‘విరాట్ ఓ గొప్ప ఆటగాడు. మెగా టోర్నీలు, ఫైనల్స్‌లో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. గత టీ20 వరల్డ్ కప్‌లో కూడా మంచి ప్రదర్శనే చేశారు. టీ20 ఫార్మాట్‌లో ఆయనకు పరుగులు ఎలా రాబట్టాలో బాగా తెలుసు’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.