News April 16, 2024

MLC కవిత పిటిషన్ విచారణ వాయిదా

image

లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. ఈ నెల 22 లేదా 23న విచారణ జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News April 16, 2024

బ్లాక్‌బస్టర్ మూవీ రీమేక్‌లో క్రేజీ డైరెక్టర్?

image

క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బ్లాక్‌బస్టర్ మూవీ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’ రీమేక్‌లో ఆయన లీడ్ రోల్‌లో నటిస్తారని సమాచారం. భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో ఈ మలయాళ మూవీ తెరకెక్కింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. దీంతో రీమేక్‌లో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? తరుణ్ భాస్కర్ రోల్‌ ఏంటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

News April 16, 2024

గెలిచిన ఎంపీలతో బీజేపీలోకి రేవంత్: KTR

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న కేటీఆర్.. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక మార్పులు జరుగుతాయని అన్నారు. ముఖ్యమైన మార్పు సీఎం రేవంత్‌రెడ్డిదేనని, గెలిచిన ఎంపీలతో ఆయన బీజేపీలో చేరతారని మరోసారి బాంబు పేల్చారు. సీఎం రేవంత్ బీజేపీలో చేరతారని ఈమధ్య పదేపదే కేటీఆర్ అంటుండటం గమనార్హం.

News April 16, 2024

సల్మాన్ ఖాన్ 1BHKలో ఎందుకుంటున్నారు?

image

దాదాపు రూ.2900 కోట్ల నెట్‌వర్త్ ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ ఇంటిపై కాల్పుల తర్వాత అంతపెద్ద స్టార్ 1BHKలో ఎందుకు నివాసం ఉంటున్నారనే సందేహం చాలామందిలో నెలకొంది. సల్మాన్‌ ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో ఫ్లాట్లో ఉంటున్నారు. తన పేరెంట్స్ ఫ్లాట్ పక్క ఫ్లాట్లో సల్మాన్ ఉంటారట. తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనే ఆలోచనతోనే ఆయన ఆ 1BHKలో ఉంటున్నారట.

News April 16, 2024

పోలీసుల అదుపులో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం

image

ఆస్ట్రేలియా క్రికెట్‌ మాజీ దిగ్గజం మైకేల్ స్లేటర్‌ను ఆ దేశ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. మాజీ భార్యపై దాడి, వెంబడించడం, అనుమతి లేకుండా ఇంట్లోకి రావడం, హత్యాయత్నం తదితర అభియోగాలను ఆయనపై నమోదు చేశారు. ఇదే తరహాలో మరో 19 అభియోగాలు ఆయనపై గతంలోనూ నమోదయ్యాయి. 2022లో ఓ పోలీసు అధికారిని వెంబడించిన కేసూ స్లేటర్‌పై ఉంది. 1993 నుంచి 2003 మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు స్లేటర్ 74 టెస్టులు, 42 వన్డేలు ఆడారు.

News April 16, 2024

కొత్త జంటకు చిరు ఆశీస్సులు

image

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్‌ తరుణ్ కార్తికేయన్‌ను ఆమె వివాహమాడారు. ఈ వివాహ రిసెప్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. కొత్త జంటకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

News April 16, 2024

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

image

AP: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 16, 2024

BREAKING: ఫలితాలు విడుదల

image

UPSC సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 1016 మందిని ఎంపిక చేయగా.. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్ వచ్చింది. అనిమేశ్ ప్రధాన్ 2వ ర్యాంక్, దోనూరు అనన్య రెడ్డికి 3వ ర్యాంకు వచ్చింది. 347 మంది జనరల్ కేటగిరీలో, 303 OBC కేటగిరీలో, 165 SC కేటగిరీలో, ST కేటగిరీలో 86 మంది ఎంపికయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News April 16, 2024

జైలు నుంచి ఢిల్లీ సీఎం సందేశం

image

జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ సందేశాన్ని పంపారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాదు’ అని పేర్కొన్నట్లు చెప్పారు. కేజ్రీవాల్‌ను తక్కువ చేసి చూపేందుకు 24 గంటలూ ప్రయత్నాలు జరుగుతున్నాయని సంజయ్ ఆరోపించారు. ‘కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారు. ఏ ఒక్కరినీ దగ్గరగా కలిసేందుకు ఆయనను అనుమతించట్లేదు. ఇవి ప్రతీకార రాజకీయాలే’ అని పేర్కొన్నారు.

News April 16, 2024

నేటి నుంచే నీట్-పీజీ రిజిస్ట్రేషన్

image

ఈ ఏడాది నీట్-పీజీ రిజిస్ట్రేషన్లు నేటి నుంచి మొదలుకానున్నాయి. మధ్యాహ్నం 3గంటలనుంచి దరఖాస్తు లింక్ క్రియాశీలం కానుంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 23న పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్యసేవల పరీక్షల బోర్డు ప్రకటించింది. Nbe.edu.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ అందుబాటులోకి రానుంది.