India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: జగన్ వచ్చాక SCలు, STలకు అన్యాయం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. రాజాం సభలో మాట్లాడుతూ.. ‘YCP నేతలు నాపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడు రాళ్ల దాడి కూడా చేస్తున్నారు. రాజకీయాల్లో లేని నా భార్య భువనేశ్వరిని అనేక మాటలన్నారు. నేను అరెస్టయ్యాననే బెంగతో 203 మంది ప్రాణాలు వదిలారు. ఆ కార్యకర్తల కుటుంబసభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు. ఎన్ని జరిగినా పేదల బాగు కోసమే నా తపన’ అని పేర్కొన్నారు.

IPL మ్యాచ్‌లు జోరుగా సాగుతుండగా BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ల సమయంలో కామెంటేటర్లు వీడియోలు లేదా ఫొటోలను షేర్ చేయకుండా ఆంక్షలు విధించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఫాలోవర్లను పెంచుకోవడానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫొటోలను పోస్ట్ చేస్తున్నారని BCCI అభిప్రాయపడినట్లు సమాచారం. ఇకపై ప్లేయర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, కామెంటేటర్ల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచనున్నట్లు తెలుస్తోంది.

AP: సలహాదారుల పేరుతో YCP ప్రభుత్వం ప్రజా ధనం వృథా చేస్తోందని TDP చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ఆ డబ్బులతో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చన్నారు. రాజాం సభలో మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను సీఎం నిర్లక్ష్యం చేశారు. నేనుంటే 2020లోనే భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యేది. మేం సేకరించిన భూముల యజమానుల మధ్య వైసీపీ నేతలు గొడవ పెట్టారు. గిరిజన వర్సిటీ విషయంలోనూ ఇలాగే చేశారు’ అని ఫైరయ్యారు.

TG: రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తే బంగారం ధరలను నియంత్రిస్తారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్‌తో పాటు పసిడి ధరలూ పెరుగుతున్నాయని విమర్శించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2014లో తులం బంగారం రేటు రూ.28వేలుగా ఉందని, మోదీ వచ్చాక ఇప్పుడు రూ.75 వేలకు చేరుకుందన్నారు. రాముడిని, హనుమంతుడిని కూడా బీజేపీ నాయకులుగా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP: తాము విశాఖను వాణిజ్య రాజధాని చేస్తే.. వైసీపీ నేతలు గంజాయి, డ్రగ్స్ క్యాపిటల్‌గా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘సీఎం జగన్‌కు వైజాగ్‌పై ప్రేమ లేదు.. ఆయనకు ఆస్తుల మీదే ప్రేమ ఉంది. ఈ ప్రాంతంలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం చేస్తున్నారు. నేను విశాఖకు అదానీ డేటా సెంటర్, లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ తెస్తే వైసీపీ నేతలు తరిమేశారు. వాళ్లు భూకబ్జాలు చేశారు’ అని ఆరోపించారు.

TG: శ్రీరామనవమి సందర్భంగా జంటనగరాల్లో వైన్ షాప్స్ మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ఈ నెల 17న ఉ.6 గంటల నుంచి 18వ తేదీ ఉ.6 వరకు వైన్, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు బంద్ చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

AP: వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సజ్జల డైరెక్షన్‌లో జగన్ నటిస్తున్నారు. గత ఎన్నికల్లో గొడ్డలిపోటుతో సానుభూతి పెంచుకున్నారు. ఈసారి గులకరాయి డ్రామా ఫెయిలైంది. ఇప్పుడు ఎవరైనా బలికావొచ్చు. ముందుజాగ్రత్తతోనే విజయమ్మ అమెరికా వెళ్లారని ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా జైలు నుంచి బయటకు రానంటున్నారు’ అని పేర్కొన్నారు.

AP: రాయి దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘సీఎం భద్రతలో విఫలమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్‌ను బదిలీ చేయాలి. సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే రాయి విసిరిందెవరో తెలుస్తుంది. ప్రధాని పర్యటనలోనూ సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయి. ఈ విషయంపై ECI దృష్టి పెట్టాలి’ అని ట్వీట్ చేశారు.

స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మదుపర్ల రూ.5లక్షల కోట్లు ఆవిరైపోయాయి. సెన్సెక్స్ 845 పాయింట్ల నష్టంతో 73,399 వద్ద ముగియగా.. నిఫ్టీ 249 పాయింట్ల నష్టంతో 22,272 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.5లక్షల కోట్లు క్షీణించి రూ.394 లక్షల కోట్లకు చేరింది.

TG: భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు. కళ్యాణం లైవ్‌కు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 40 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు. భద్రాచలం ఆలయ విశిష్టత, సంప్రదాయాలను లేఖలో వివరించారు. కాగా, ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం, 18న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.