News October 3, 2024

నిరుద్యోగులకు ALERT.. నేడు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రారంభం

image

యువత కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన ‘PM INTERNSHIP’ పథకానికి సంబంధించిన పోర్టల్ ఇవాళ ప్రారంభం కానుంది. 21-24 ఏళ్ల నిరుద్యోగులు ఈ నెల 12 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. వారి విద్యార్హత, ఆసక్తి ఉన్న రంగాలను బట్టి టాప్-500 కంపెనీలలో 12 నెలల ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుంది. నైపుణ్య శిక్షణతోపాటు ఒకేసారి రూ.6,000, ప్రతి నెలా రూ.5,000 అలవెన్సును అందజేస్తుంది.

News October 3, 2024

GST: కొన్నిటిపై పెంపు.. మరికొన్నిటిపై తగ్గింపు!

image

మెడిసిన్స్, ట్రాక్టర్స్ సహా ఎక్కువ ఉపయోగించే ఐటమ్స్‌పై GST రేటును 5 శాతానికి తగ్గించాలని మంత్రుల ప్యానెల్ యోచిస్తోందని తెలిసింది. సిమెంటు, టొబాకో వంటి వాటిపై 28% కొనసాగొచ్చు. ప్రస్తుతం కొన్ని ట్రాక్టర్లపై 12 లేదా 28% వరకు ట్యాక్స్ ఉంది. హై ఎండ్ EVs, రూ.40 లక్షల కన్నా విలువైనవి, ఇంపోర్ట్ వెహికల్స్‌పై 5% నుంచి పెంచొచ్చు. కేరళ సహా సౌత్ స్టేట్స్ ఇష్టపడకపోవడంతో శ్లాబుల్ని తగ్గించే పరిస్థితి లేదు.

News October 3, 2024

విరాట్ ఓ గొప్ప ఆటగాడు: హర్భజన్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ దాదా ప్లేయర్ అని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసించారు. ‘విరాట్ ఓ గొప్ప ఆటగాడు. మెగా టోర్నీలు, ఫైనల్స్‌లో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. గత టీ20 వరల్డ్ కప్‌లో కూడా మంచి ప్రదర్శనే చేశారు. టీ20 ఫార్మాట్‌లో ఆయనకు పరుగులు ఎలా రాబట్టాలో బాగా తెలుసు’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

News October 3, 2024

వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చడం దురదృష్టకరం: వెంకటేశ్

image

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు’ అని పేర్కొన్నారు.

News October 3, 2024

మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ పార్టీ చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నమామి గంగ ప్రాజెక్టుకు ఒక్కో కి.మీకు రూ.17 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ మూసీ సుందరీకరణకు ఒక్కో కి.మీకు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదెక్కడి వింత? ఈ స్కామ్ నిధులు మొత్తం కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులోకే వెళ్తున్నాయి’ అని ఆయన ట్వీట్ చేశారు.

News October 3, 2024

Stock Markets Crash: రూ.3 లక్షల కోట్లు ఆవిరి

image

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లు వణుకుతున్నాయి. అనిశ్చితి నెలకొనడం, సప్లై చైన్ అవాంతరాలు, క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల భారీగా క్రాష్ అవుతున్నాయి. BSE సెన్సెక్స్ 725 పాయింట్ల నష్టంతో 83,542, NSE నిఫ్టీ 218 పాయింట్లు ఎరుపెక్కి 25,578 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. నిఫ్టీలో 41 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. JSW స్టీల్, ONGC టాప్ గెయినర్స్.

News October 3, 2024

కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన అల్లు అర్జున్

image

సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన <<14254371>>వ్యాఖ్యలపై <<>>హీరో అల్లు అర్జున్ స్పందించారు. ‘సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ప్రవర్తన తెలుగు సంస్కృతి, విలువలకు విరుద్ధం. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను అంగీకరించకూడదు. మహిళల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, వారి గోప్యతను గౌరవించాలని కోరుతున్నా’ అని ట్వీట్‌ చేశారు.

News October 3, 2024

ఇన్సూరెన్స్‌పై జీరో GSTకి ఛాన్స్ ఉందా?

image

ఇన్సూరెన్స్‌పై GST తగ్గింపు ఖాయమని తెలుస్తోంది. రాబోయే కౌన్సిల్ మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అయితే ట్యాక్స్ రేట్‌ను జీరోకు తీసుకురాకపోవచ్చు. ప్రస్తుతం అన్ని రకాల ఇన్సూరెన్స్‌పై 18% GST అమలవుతోంది. దీనిని హెల్త్‌పై 12, టర్మ్‌పై 5 శాతానికి తగ్గిస్తారని సమాచారం. జీరోకు తీసుకొస్తే ఇన్సూరెన్స్ కంపెనీలకు గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేసేవారికి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు.

News October 3, 2024

పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్

image

డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ తనకు ఇష్టమని Dy.CM పవన్ కళ్యాణ్ తమిళ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. అతను తెరకెక్కించిన లియోను తాను వీక్షించానన్నారు. ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ Xలో సంతోషం వ్యక్తం చేశారు. ‘పవన్ సార్ నా వర్క్‌ను ఇష్టపడ్డారని తెలిసి నా మనసు ఉప్పొంగింది. గర్వంగా ఉంది. బిగ్ థాంక్యూ’ అని రాసుకొచ్చారు. వీరి కాంబోలో మూవీ వస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News October 3, 2024

ఈ మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్ అత్యవసర మీడియా సమావేశం

image

నటి సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ అంశంపై ఈ మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్ అత్యవసర మీడియా సమావేశం నిర్వహించనుంది. అందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని సహా పలువురు నటీనటులు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.