News November 20, 2024

చలి పెరుగుతోంది.. జాగ్రత్త: ప్రభుత్వం

image

TG: క్రమంగా చలి పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు, బాలింతలు, పిల్లలు, కార్మికులు, రైతులు, నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎక్కువ రోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుండి రక్తం కారడం లాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలంది. ఈ మేరకు ఓ అడ్వైజరీ నోట్‌ను విడుదల చేసింది.

News November 20, 2024

ధైర్యం సరిపోవడంలేదా చిట్టినాయుడు?: KTR

image

TG: మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నిమిషానికి 40 సార్లు KCR రావాలే అని తెగ అరుస్తావు! అసెంబ్లీలో కేసీఆర్ ముందు నిల్చునే మాట దేవుడెరుగు, కనీసం మహబూబాబాద్‌లో మహాధర్నాకు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవడంలేదా చిట్టినాయుడు?’ అని ఎద్దేవా చేస్తూ Xలో పోస్ట్ చేశారు.

News November 20, 2024

ఓటర్లను అడ్డుకున్న UP పోలీసులు.. ఏడుగురు స‌స్పెండ్‌

image

యూపీలో ఉపఎన్నిక‌లు ఉద్రిక్తంగా మారాయి. మీరాపూర్‌లో ఓట‌ర్ల‌పై పోలీసు తుపాకీ ఎక్కుపెట్ట‌డం సంచ‌ల‌న‌మైంది. ముస్లిం ఓట‌ర్లు ఓటు వేయ‌కుండా పోలీసులు అడ్డుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అఖిలేశ్ యాద‌వ్‌ విడుద‌ల చేసిన‌ వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఓట‌ర్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులు ఓట‌ర్ల స్లిప్పుల‌ను ప‌రిశీలించి అడ్డ‌గించ‌డం వివాద‌మైంది. దీంతో ఏడుగురు పోలీసులను ఎన్నిక‌ల సంఘం సస్పెండ్ చేసింది.

News November 20, 2024

OGలో అకీరా నందన్.. షూటింగ్ కంప్లీట్?

image

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘OG’ క్లైమాక్స్‌లో ఆయన నటిస్తున్నారని, ఈ సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఇప్పటికే షూటింగ్ కూడా ముగిసిందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలోనే ఆయనతో కీబోర్డు ప్లే చేయించనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించిన విషయం తెలిసిందే.

News November 20, 2024

ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం సీరియస్

image

TG: నారాయణపేట జిల్లాలోని జడ్పీ స్కూల్‌లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.

News November 20, 2024

మరో ఫుడ్ పాయిజన్ ఘటన.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత

image

TG: రాష్ట్రంలో మరో ఫుడ్‌పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మాగనూర్‌ జడ్పీ స్కూల్‌లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లలో అసలేం జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

News November 20, 2024

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

* టూరిజానికి పరిశ్రమ హోదా
* విశాఖ, విజయవాడ మెట్రో డీపీఆర్‌కు ఆమోదం
* ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024కు ఆమోదం
* సీఎన్‌జీపై వ్యాట్ 5శాతానికి తగ్గింపు

News November 20, 2024

ఏఆర్ రెహమాన్ శిష్యురాలు కూడా విడాకులు

image

రెహమాన్-సైరా బాను దంపతులు <<14657136>>విడాకులు<<>> ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన మ్యూజిక్ టీమ్‌లోని గిటారిస్ట్ మోహిని డే(29) కూడా భర్త మార్క్‌‌కు డివోర్స్ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని తెలిపారు. బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటామని, కలిసే ప్రాజెక్టులు చేస్తామని ప్రకటించారు. రెహమాన్‌తో కలిసి మోహిని 40+ షోలలో ప్రదర్శన ఇచ్చారు. ఒకేసారి ఇద్దరూ తమ భాగస్వాముల నుంచి వేరుపడటం అనుమానాలకు తావిస్తోంది.

News November 20, 2024

ఝార్ఖండ్ EXIT POLLS: యాక్సిస్ మై ఇండియా కాన్ఫిడెన్స్ ఏంటి?

image

ఝార్ఖండ్‌పై ఇప్పటి వరకు 5 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయి. 81 సీట్లున్న ఈ రాష్ట్రంలో BJP కూటమి మ్యాజిక్ ఫిగర్ 41ని దాటేస్తుందని మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా ఒక్కటే BJP 25కు పరిమితం అవుతుందని, ఇండియా కూటమి 53 సీట్లతో అధికారం చేపడుతుందని పేర్కొంది. అటూ ఇటూ కాకుండా పక్కాగా సీట్లు అంచనా వేయడంపై నెటిజన్లు సర్‌ప్రైజ్ అవుతున్నారు.

News November 20, 2024

1000మంది ఉద్యోగుల్ని స్పెయిన్‌ పంపించిన చెన్నై కంపెనీ!

image

చెన్నైకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కాసాగ్రాండ్ తమ ఉద్యోగులు 1000 మందికి బంపరాఫర్ ఇచ్చింది. అన్ని ఖర్చుల్నీ భరిస్తూ స్పెయిన్‌కు వారం రోజుల టూర్‌కు పంపించింది. ఉద్యోగులకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు 2013లో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అప్పటి నుంచి అనేక దేశాలకు ఉద్యోగుల్ని పంపించామని తెలిపింది. కరోనా సమయంలోనూ ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం గమనార్హం.