News October 3, 2024

సమంత ఫోన్ ట్యాప్ అయ్యిందా? స్పందించిన చిన్మయి

image

సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో సామ్ ఫోన్ ట్యాపింగ్ గురించి సింగర్ చిన్మయి స్పందించారు. ‘BRS హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై సమంత స్పందించాలి. ఆమె ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమా? కాదా?’ అని నెటిజన్ ప్రశ్నించగా ‘ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం సమంతకు లేదు. రాజకీయ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతారు’ అని సింగర్ బదులిచ్చారు.

News October 3, 2024

రూ.500 బోనస్‌పై నేడు విధివిధానాలు!

image

AP: ఈ సీజన్ నుంచి సన్నబియ్యం రకాలకు క్వింటాకు ₹500 బోనస్ చెల్లించే అంశంపై నేడో, రేపో విధివిధానాలను ప్రభుత్వం వెల్లడించనుంది. రైతులకు మద్దతు ధర(కామన్ రకానికి ₹2,300, గ్రేడ్-Aకు ₹2,320), బోనస్‌ను విడివిడిగా చెల్లించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సన్నాల దిగుబడి 88 లక్షల టన్నులు కాగా, కొనుగోలు కేంద్రాలకు 49 లక్షల టన్నులు వస్తాయని అంచనా. ₹500 చొప్పున చెల్లిస్తే ₹2,455 కోట్ల ఖర్చవుతుంది.

News October 3, 2024

ఆస్పత్రిలో చేరిన టీమ్ ఇండియా క్రికెటర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. కాగా 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూనే నిన్న రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడారు. సర్ఫరాజ్ డబుల్ సెంచరీ చేసేందుకు శార్దూల్ (36 రన్స్) సహకారం అందించారు.

News October 3, 2024

లడ్డూ వివాదంపై నేడు సుప్రీం విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ను కొనసాగించాలా?లేదా స్వతంత్ర సంస్థను నియమించాలా? అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ తన అభిప్రాయాన్ని ధర్మాసనానికి చెప్పనున్నారు. దీన్నిబట్టి న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. గత విచారణలో సీఎం చంద్రబాబుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News October 3, 2024

హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా అల్లుడి హతం

image

హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ హతమైనట్లు ఐడీఎఫ్ తెలిపింది. సిరియా డమాస్కస్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయగా మరొకరితోపాటు ఖాసిర్ కూడా మరణించారు. మరోవైపు తాజాగా లెబనాన్‌లోని దహియేపై ఇజ్రాయెల్ మూడు క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఆరుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

News October 3, 2024

భారత్‌లోనే ఖో ఖో తొలి వరల్డ్ కప్

image

మొట్టమొదటి ఖో ఖో వరల్డ్ కప్ వచ్చే ఏడాది భారత్‌లో జరగనుంది. ఇందులో 24 దేశాల నుంచి 16 పురుష, 16 మహిళల జట్లు పాల్గొననున్నాయి. ఖో ఖోకు భారత్ పుట్టినిల్లు అని, ఈ వరల్డ్ కప్ దాని ఔన్నత్యాన్ని, సంప్రదాయ వారసత్వాన్ని హైలైట్ చేస్తుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) తెలిపింది. 2032 నాటికి ఖో ఖోను ఒలింపిక్ స్పోర్ట్‌గా చూడటం తమ కల అని, అందుకు ఈ ప్రపంచకప్ దోహదం చేస్తుందని పేర్కొంది.

News October 3, 2024

పెరిగిన Gold Loans డామినేషన్

image

FY25 ఫస్ట్ క్వార్టర్లో NBFCలు పర్సనల్ లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్లనే ఎక్కువగా సాంక్షన్ చేశాయని FIDC తెలిపింది. ఇవి YoY 26% పెరిగి రూ.79,218 కోట్లకు చేరాయంది. గత ఏడాది రూ.63,495 కోట్లతో పర్సనల్ లోన్లే టాప్‌లో ఉన్నాయి. అన్ సెక్యూర్డ్ లోన్లపై RBI గత నవంబర్లో వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడవి రెండో స్థానానికి చేరాయి. హౌసింగ్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

News October 3, 2024

వారికి 2BHK ఇళ్లతో పాటు రూ.25వేలు

image

TG: హైదరాబాద్ మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు 2BHK ఇళ్లతో పాటు సామగ్రి తరలింపు, ఇతర ఖర్చుల కోసం రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.25వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి ఆయా జిల్లాల్లో గ్రీవెన్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News October 3, 2024

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఇవాళ అంకురార్పణ

image

AP: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇవాళ రాత్రి 7-8 గంటల మధ్య అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాలకు భారీగా భక్తులు రానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. రేపు రాత్రి సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీ దర్శనాలు, ఆర్జిత సేవలను TTD రద్దు చేసింది.

News October 3, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో HYDతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, గద్వాల, NRPT, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలో ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.