News October 3, 2024

భారత్‌లోనే ఖో ఖో తొలి వరల్డ్ కప్

image

మొట్టమొదటి ఖో ఖో వరల్డ్ కప్ వచ్చే ఏడాది భారత్‌లో జరగనుంది. ఇందులో 24 దేశాల నుంచి 16 పురుష, 16 మహిళల జట్లు పాల్గొననున్నాయి. ఖో ఖోకు భారత్ పుట్టినిల్లు అని, ఈ వరల్డ్ కప్ దాని ఔన్నత్యాన్ని, సంప్రదాయ వారసత్వాన్ని హైలైట్ చేస్తుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) తెలిపింది. 2032 నాటికి ఖో ఖోను ఒలింపిక్ స్పోర్ట్‌గా చూడటం తమ కల అని, అందుకు ఈ ప్రపంచకప్ దోహదం చేస్తుందని పేర్కొంది.

News October 3, 2024

పెరిగిన Gold Loans డామినేషన్

image

FY25 ఫస్ట్ క్వార్టర్లో NBFCలు పర్సనల్ లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్లనే ఎక్కువగా సాంక్షన్ చేశాయని FIDC తెలిపింది. ఇవి YoY 26% పెరిగి రూ.79,218 కోట్లకు చేరాయంది. గత ఏడాది రూ.63,495 కోట్లతో పర్సనల్ లోన్లే టాప్‌లో ఉన్నాయి. అన్ సెక్యూర్డ్ లోన్లపై RBI గత నవంబర్లో వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడవి రెండో స్థానానికి చేరాయి. హౌసింగ్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

News October 3, 2024

వారికి 2BHK ఇళ్లతో పాటు రూ.25వేలు

image

TG: హైదరాబాద్ మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు 2BHK ఇళ్లతో పాటు సామగ్రి తరలింపు, ఇతర ఖర్చుల కోసం రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.25వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి ఆయా జిల్లాల్లో గ్రీవెన్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News October 3, 2024

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఇవాళ అంకురార్పణ

image

AP: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇవాళ రాత్రి 7-8 గంటల మధ్య అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాలకు భారీగా భక్తులు రానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. రేపు రాత్రి సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీ దర్శనాలు, ఆర్జిత సేవలను TTD రద్దు చేసింది.

News October 3, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో HYDతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, గద్వాల, NRPT, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలో ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

News October 3, 2024

టీడీపీలోకి ఎమ్మెల్సీ పద్మశ్రీ!

image

AP: ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తన పదవికి, YCPకి రాజీనామా చేసి నెలరోజులైంది. ఇప్పటికీ ఆమె రిజిగ్నేషన్‌ను మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. ఆమె గవర్నర్ కోటా MLCగా ఉండటంతో త్వరలోనే ఆయనతో సమావేశమై ఇష్టపూర్వకంగానే రాజీనామా చేసినట్లు తెలపనున్నట్లు సమాచారం. ఆమోదముద్ర పడగానే CM చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు.

News October 3, 2024

ట్రెండింగ్: #flipkartscam

image

బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లు అంటూ ఫ్లిప్‌కార్ట్ తమను మోసం చేస్తోందని పలువురు నెట్టింట ఫిర్యాదులు చేస్తున్నారు. #flipkartscam హ్యాష్‌ట్యాగ్‌తో వేలాది ట్వీట్లు చేస్తున్నారు. ఆఫర్లలో తక్కువ రేటుకు వస్తువులు వస్తున్నాయని ఆర్డర్ పెడితే 2-3 రోజుల తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారని వాపోతున్నారు. డబ్బులు చెల్లించి 5-6 రోజులైనా డెలివరీ చేయట్లేదని, కస్టమర్ కేర్ నుంచి కూడా స్పందన ఉండట్లేదని ఫైరవుతున్నారు.

News October 3, 2024

నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: కొండా సురేఖ

image

TG: సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను’ అని Xలో సమంతను ట్యాగ్ చేశారు.

News October 3, 2024

దేశ రక్షణలో వీరమరణం.. 56 ఏళ్లకు అంత్యక్రియలు

image

దేశ రక్షణలో వీరమరణం పొందిన సైనికుడికి 56 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు నిర్వహించిన అసాధారణ ఘటన UPలోని సహారన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. 1968లో ఎయిర్‌ఫోర్స్ విమానం రోహ్‌తంగ్‌పాస్ వద్ద ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న మల్ఖాన్ సింగ్ ఆచూకీ దొరకలేదు. ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఆయన మృతదేహం బయటపడింది. మంచులో ఉన్నందున శరీరం పాడవలేదు. బ్యాడ్జి ఆధారంగా గుర్తించి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

News October 3, 2024

PM కిసాన్.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు

image

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేస్తుంది. ఈ లబ్ధి పొందడానికి అన్నదాతలు తప్పనిసరిగా <>ఈకేవైసీ<<>> చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ.6వేలను రైతులకు అందిస్తున్న విషయం తెలిసిందే.