India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలుగులో తేజ దర్శకత్వంలో ‘ధైర్యం’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన రైమా సేన్.. ప్రస్తుతం ‘మా కాళి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 1946 ఆగస్టు 16న కోల్‌కతాలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావని కొందరు వ్యక్తులు తనకు కాల్స్ చేసి బెదిరిస్తున్నారని రైమా సేన్ వాపోయారు. హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.

తాజా సెన్సేషన్ ‘టిల్లు స్క్వేర్’ మూవీ యూనిట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. ‘సిద్ధూ.. నీ అద్భుత విజయం పట్ల గర్వంగా ఉంది. హీరోయిన్ అనుపమ, దర్శకుడు మల్లిక్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్లకు, నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్‌కు హృదయపూర్వక అభినందనలు’ అని పేర్కొన్నారు. అంతకుముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీ టీమ్‌ను అభినందించిన సంగతి తెలిసిందే.

TG: కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది జనజాతర కాదని.. అబద్ధాల జాతర అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘6 గ్యారంటీల పేరుతో గారడీ చేశారు. నమ్మి ఓట్లేసిన 4 కోట్ల ప్రజలను నట్టేట ముంచారు. రైతుల ఆత్మహత్యలు, నేతన్నల బలవన్మరణాలకు కాంగ్రెస్ కారణమవుతోంది. అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. రుణమాఫీ, తాగు, సాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. వీళ్ల ఆర్తనాదాలు వినిపించట్లేదా రాహుల్ గాంధీ’ అని ఆయన ట్వీట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో కేజీ రూ.310, హైదరాబాద్‌లో కేజీ రూ.300 ధర పలుకుతోంది. వారం క్రితం రూ.200 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.100 పెరిగి రూ.300కు చేరుకుంది. దీంతో చాలా మంది చికెన్ కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. ఈ ధరలు చూసి మాంసాహార ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. ఎండలు ముదురుతుండటంతో కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో వాటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో ధరలు పెరిగిపోతున్నాయి.

మనకు ఉన్న ఆహార అలవాట్లే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఉరుకుల పరుగుల జీవితంలో దొరికిన కాస్త సమయంలోనే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కచ్చితమైన సమయ పాలన పాటిస్తూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం మేలు చేస్తుందంటున్నారు. ఆరోగ్యం కోసం వ్యాయామం, తగినంత నిద్రతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ అజేయంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో KKR, CSK ఉన్నాయి. ఇక పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ముంబై పరాజయం పాలైంది. మరోవైపు ఆర్సీబీ 8, ఢిల్లీ 9వ స్థానాల్లో ఉన్నాయి.

హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమై సరిగ్గా నేటికి 6 నెలలు అవుతోంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేయడంతో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో 33 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 వేల మందికి పైగా ఉగ్రవాదులు ఉన్నారు. వేలాది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. తినడానికి తిండి లేకుండా, నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డారు. గాజా సగానికిపైగా తుడిచిపెట్టుకుపోయింది.

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 75,414 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి రూ.3.68 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. మరోవైపు ఎండతీవ్రతతో భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది.

AP: సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఇవాళ పదో రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగనుంది. పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్ద అరికట్లకు వెళ్లనున్నారు. సాయంత్రం కొనకనమెట్ల క్రాస్ దగ్గర బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బత్తువారిపల్లి, పొదిలి, రాజంపల్లి మీదుగా వెంకటాచలంపల్లికి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు.

కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ సీన్స్‌లో నటించడం తప్పేం కాదని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ‘నేనిప్పుడు నటిగా చాలా పరిణతి చెందా. ఒకే తరహా పాత్రల్లో నటించి బోర్ కొడుతోంది. టిల్లు స్క్వేర్ మూవీలో లిప్‌లాక్ సీన్‌లో నటించడాన్ని కొంత మంది తప్పుబడుతున్నారు. ఆ సినిమా చూడకుండా వారు విమర్శిస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. సినిమా చూసి మాట్లాడాలి’ అని ఆమె ఫైర్ అయ్యారు.
Sorry, no posts matched your criteria.