India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లక్నో సూపర్ జెయింట్స్(LSG) బౌలర్ మయాంక్ యాదవ్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో POTM అవార్డు అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఈ సీజన్‌లోనే అరంగేట్రం చేసిన మయాంక్ 150KMPH పైగా బంతులు విసురుతూ సెన్సేషన్‌గా మారారు. పంజాబ్, ఆర్సీబీతో మ్యాచుల్లో ఆరు వికెట్లు తీశారు.

TG: ఆర్టీసీలో స్వల్ప కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించిన 1500 మందికిపైగా సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగాలు లేకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బస్సుల కండిషన్ సరిగా లేకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరిగాయని.. వాటికి బాధ్యులుగా సిబ్బందిని తొలగించారని పేర్కొన్నారు.

MP అభ్యర్థుల ఎంపికలో BJP కొత్త పంథా ఎంచుకుంది. పార్టీ బలంగా ఉన్న చోట సీనియర్లను సైతం పక్కనబెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇస్తోంది. బలమైన అభ్యర్థులు, పార్టీకి బలం లేని చోట వేరే పార్టీ నేతలను చేర్చుకొని టికెట్లు ఇస్తోంది. TGలోనే రాములు, బీబీ పాటిల్, నగేశ్, సీతారాం నాయక్, సైదిరెడ్డి, ఆరూరి వంటి నేతలను ఇలా చేర్చుకుంది. దేశవ్యాప్తంగా 25 మంది ఇటీవల పార్టీలో చేరి టికెట్లు దక్కించుకున్నారు.
<<-se>>#Elections2024<<>>

AP: బాపట్ల(D) చీరాల నియోజకవర్గంపై మంచి పట్టున్న నాయకుడు ఆమంచి కృష్ణమోహన్. 2009లో కాంగ్రెస్, 2014లో సొంత పార్టీ నవోదయం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో YCP నుంచి పోటీ చేసి ఓడిపోగా ఈసారి ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలా? వద్దా అనే దానిపై అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన బరిలో ఉంటే ముక్కోణపు పోటీ తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

TG: రాష్ట్రంలో గత 6 నెలల్లో వర్షపాతం 57.6% తగ్గింది. ప్రస్తుతం ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి. నీటి మట్టాలు తాగు అవసరాలకు మినహా సాగుకు అందించలేని డెడ్ స్టోరేజీకి చేరాయి. భూగర్భ జలాలు సైతం గత పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయికి తగ్గాయి. భూగర్భ జలమట్టం గత మార్చితో పోలిస్తే 2.5మీటర్ల లోతుకు పడిపోయింది.

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 56,228 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు సమకూరింది.

టీ20 ప్రపంచ కప్‌నకు రోహిత్ శర్మను బీసీసీఐ ముందే కెప్టెన్‌గా ప్రకటించి ఉండాల్సిందని మాజీ ప్లేయర్ సిద్ధూ అన్నారు. అలా చేసి ఉంటే ముంబై ఇండియన్స్ సారథిగా కొనసాగి ఉండేవారని అభిప్రాయపడ్డారు. గత ఏడాది అక్టోబర్‌లో రోహిత్‌ను టీ20 WCకు కెప్టెన్‌గా ప్రకటిస్తే బాగుండేదన్నారు. భారత హీరో, టీమ్ ఇండియా సారథిని ముంబై కెప్టెన్‌గా తొలగించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు.

చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు గతేడాది ఆమోదించింది. ఈ రిజర్వేషన్లు 2026లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలయ్యే అవకాశం ఉంది. అయితే.. అప్పటి వరకూ ఎందుకు వేచి చూడాలన్న కాంగ్రెస్.. ఇప్పుడే అమలు చేయవచ్చు కదా అని ప్రశ్నించింది. ఇక ఇప్పటి వరకు ప్రకటించిన MP అభ్యర్థుల్లో ఆ పార్టీ 13% మాత్రమే మహిళలకు సీట్లు ఇచ్చింది. మరోవైపు BJP కూడా 17% మహిళలను నిలబెట్టింది.
<<-se>>#Elections2024<<>>

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను వైద్యారోగ్యశాఖ అప్రమత్తం చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలంది. ఎండలో పనిచేయడం, ఆటలాడటం, చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయవద్దని కోరింది. మద్యం, చాయ్, కాఫీ, స్వీట్స్, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది.

AP: పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది. ఈసీ ఆదేశాలను రద్దు చేస్తూ.. వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. గతంలో వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చేవారని.. తాజా ఆదేశాలతో సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవడం లబ్ధిదారులకు కష్టంగా మారిందని పిటిషనర్ వాదించారు.
Sorry, no posts matched your criteria.